Did you know
103 Posts • 76K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
562 views 2 months ago
క్షౌర కర్మ విధానం...........!! క్షౌర కర్మకు ఒక నిర్దిష్టమైన క్రమం ఉంది: ముందుగా గడ్డం మరియు మీసాలను కుడివైపు నుండి ప్రారంభించి పూర్తి చేయాలి. తర్వాత చంకలను శుభ్రం చేయాలి. పిదప తల వెంట్రుకలను కత్తిరించాలి. చివరగా గోళ్ళను కత్తిరించాలి. ఈ క్రమాన్ని పాటించడం శరీర శుద్ధికి మరియు ఆధ్యాత్మిక నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అలాగే, తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చుని క్షౌరం చేయించుకోవడం కూడా శుభప్రదం. క్షౌర కర్మ చేయకూడని సమయాలు.... క్షౌర కర్మను చేయకూడని సమయాలను ఇక్కడ చాలా స్పష్టంగా వివరించారు. వీటిలో ముఖ్యమైనవి: తిథులు: పాడ్యమి, షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి మరియు అమావాస్య. ఈ తిథులలో గ్రహాల గమనం మరియు ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందని నమ్ముతారు. రోజులు: శనివారం, ఆదివారం, మంగళవారం. ఈ రోజులు క్షౌరానికి అనుకూలం కాదని, అలా చేస్తే ఆయుక్షీణం కలుగుతుందని మీరు పేర్కొన్నారు. ప్రత్యేక సందర్భాలు: జన్మ నక్షత్రం, సూర్య సంక్రమణం, శ్రాద్ధ దినాలు, ప్రయాణాలకు వెళ్లే రోజులు, మరియు వ్రతాలు చేసే రోజులలో కూడా క్షౌరం చేయకూడదు. కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాకుండా, ఈ నియమాలు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని, శారీరక శక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏర్పరిచినవిగా భావించవచ్చు. క్షౌరం వల్ల ఆయుర్వృద్ధి/ఆయుక్షీణం మీరు ఏ రోజు క్షౌరం చేయించుకుంటే ఆయుర్వృద్ధి కలుగుతుందో, ఏ రోజు ఆయుక్షీణం కలుగుతుందో చాలా వివరంగా చెప్పారు. ఆయుక్షీణ కారక రోజులు: ఆదివారం (1 నెల), శనివారం (7 నెలలు), మంగళవారం (8 నెలలు) క్షౌరం వల్ల ఆయుక్షీణం కలుగుతుందని చెప్పడం దీని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఆయుర్వృద్ధి కారక రోజులు: బుధవారం (5 నెలలు), సోమవారం (7 నెలలు), గురువారం (10 నెలలు), శుక్రవారం (11 నెలలు) క్షౌరం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ నియమాలు మారుతాయి. ఉదాహరణకు, కొడుకు కావాలనుకునేవారు లేదా ఉన్నవారు సోమవారం క్షౌరం చేయించుకోకూడదు. అలాగే, విద్య మరియు ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం క్షౌరం చేయించుకోకూడదు. ముఖ్యమైన సూచనలు....,. ఇక్కడ ప్రస్తావించిన మరో ముఖ్యమైన అంశం: క్షౌర కర్మ సమయంలో విష్ణు నామస్మరణ చేయాలి. ఇది సమస్త దోషాలను తొలగిస్తుందని గర్గ మహర్షులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నియమాలు కేశాలను లేదా వెంట్రుకలను కేవలం శారీరక భాగంలా కాకుండా, వాటికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని తెలియజేస్తాయి. ఈ నియమాలన్నీ వరాహి సంహిత వంటి ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినవి. #హిందూసాంప్రదాయాలు #ఆచారాలు - సాంప్రదాయాలు #తెలుసుకుందాం #మీకు తెలుసా?? #Did you know
7 likes
8 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
618 views 2 months ago
చైనా అభివృద్ధికి మనకి తేడా ఏంటో తెలుసా! చైనా మన లాగే యువతను అన్ని దేశాలలో చదువు నిమిత్తం పంపుతుంది. అలాగే టెక్నాలజీ నేర్చుకోమని చెబుతుంది. చదువుకుని, టెక్నాలజీ నేర్చుకుని తిరిగివచ్చి దేశానికి ఉపయోగించాలని చెబుతుంది. అందుకే పిన్నిసు నుండి ఐఫోన్ వరకు అంతా కాపీ చేసి డూప్లికేట్ తయారు చేస్తుంది. టెక్నాలజీని ఉపయోగించి హైస్పీడ్ రైళ్లు, అత్యంత భారీ నిర్మాణాలు చేపట్టి ప్రపంచానికి దిక్సూచి గా మారింది. మన యువత ఏం చేస్తున్నారు? చదువుకోడానికి అమెరికా ఆస్ట్రేలియా, కొరియా ఇంకా అనేక దేశాలకు వెళ్ళి, బాత్రూమ్ లు కడిగి, పెట్రోల్ బంకుల్లో పనిచేసి, ఎలాగైతేనేమ్ పౌరసత్వం పొంది, అక్కడి సంస్థల్లో ceo గా జాబ్ కొట్టి, ఇంటికి పది లక్షలు కొట్టి, మమ్మల్ని చూడు మా సోకు చూడు అంటుంది మన దేశ యువత ... ఇతర దేశాల్ని బాగు చేసే పనిలో ఉన్నారు. అంతేనా. కసబ్ కి సపోర్ట్, దేశద్రోహులకు సపోర్ట్, గుండా నాయకులకి సపోర్ట్, సినిస్టార్ లకు సపోర్ట్, కులమతాలకు సపోర్ట్.. వీటికోసం కొట్టుకొని సచ్చిపోతారు తప్ప దేశాభివృద్ధి కోసం చేసేది సున్నా.. ఎదిగే వాడిని క్రిందికి లాగుతాం. చేసేవాడిని నిరాశపరుస్తాం.. అందుకే చైనా అభివృద్ధి చెందిన దేశం, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం.. మన యువత ఇలానే ఉంటే మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలానే ఉంటుంది. ఎందుకంటే నాయకత్వం మారిందంటే పథకాలు మారిపోతాయి. వచ్చిన వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వీడిని పట్టుకొని కొందరు యువత వేలాడతారు తప్ప అభివృద్ధి భవిష్యత్తు తరాలకి మంచి చేయడం అనేది నేటి తరానికి కల. మోడీ వంటి నాయకులు ఎవరో ఒకరిద్దరు వచ్చి బాధ్యత భారం మోయాలి తప్ప స్వతహాగా దేశ బాధ్యత మోయడం దేశాభివృద్ధి కోసం పాటుపడటం జరగదు. #yes it's true 💯% #తెలుసుకుందాం #మీకు తెలుసా?? #Did you know
10 likes
15 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
630 views 3 months ago
శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు..? దీని వెనుక కారణమేంటి? పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు.. శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు. అలాగే.. విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు. శివ కేశవుల్లో బేధం లేనపుడు.. ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్ లో చూద్దాం. మానవ శరీర నిర్మాణం ప్రకారం.. కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు. ఇది బయటకు కనపడకపోయినా.. దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది. ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు. ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమం గా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు. హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు. ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక గా శివుడు అలా ధరిస్తాడట. అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు. పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే.. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్ గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూది ని ధరిస్తూ ఉంటారు. అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరు గా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువు గా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు. ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపం గా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు. 🕉️ ఓం నమశ్శివాయ || || నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర || ☸️ ఓం నమో నారాయణాయ || 🔱 జై మహాకాల్ || 🔱 జై మహాకాళి || 🔯 ఓం శ్రీ మాత్రే నమః ||🙏🙏🙏 #మీకు తెలుసా?? #Did you know #తెలుసుకుందాం #bhakti #devotional
15 likes
11 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
671 views 3 months ago
మీకొచ్చే SMSలలో ఇవి గమనించారా? మనకు రోజూ పదుల సంఖ్యలో వివిధ SMSలు వస్తుంటాయి. అయితే, అందులో ఏది ఎక్కడి నుంచి వచ్చిందో ఈజీగా చెప్పేలా TRAI కొత్త SMS ట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. మనకు వచ్చే ప్రతి SMS ఉద్దేశాన్ని స్పష్టంగా చూపించేలా ఐడెంటిఫికేషన్ అక్షరం ఉంటుంది. SMS హెడర్లో P అని ఉంటే ప్రమోషనల్, S- సర్వీస్, T- ట్రాన్సాక్షనల్, G-గవర్నమెంట్ అని గుర్తించాలి.... #తెలుసుకుందాం #మీకు తెలుసా?? #Did you know #useful information #Technical Useful information
19 likes
7 shares