#🙏🦚MURUGA🦚🙏 #సుబ్రహ్మణ్య స్వామి💐 #Om Saravana Bhava #😴శుభరాత్రి #good night
తిరునామం..............!!
కలియుగ ఏకైక దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనకు మొదటగా కనపడేది శ్రీవారి ముఖారవిందం మీద పెద్దగా వెలసిన నామమే.!
అంతటి విశిష్టత కలిగిన నామంలో రెండు రంగులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు.
మొదట తెలుపు రంగుతో Y ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు.
ఈ తెల్లటి నామాన్ని “తిరునామం” అంటారు.
‘తిరు’ అంటే పవిత్రమైన. ‘నామం’అంటే చూర్ణం
అని అర్థాలున్నాయి.
శ్రీవేంకటేశ్వర స్వామి తిరునామం కోసం వాడే పదార్థాన్ని కర్ణాటకలోని “మేలుకొట్టై” అనే దివ్యక్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అభ్రకం నుండి తెస్తారు.
ఈ ‘మేలుకొటే’ మైసూరుకు దగ్గరగా ఉంది.
ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణస్వామి గుడి ఉన్నది.
ఇక మధ్యలో చిన్నగా మనకు కనిపించే ఎర్రటి నామాన్ని “శ్రీచూర్ణం” అంటారు.
ఈ ‘శ్రీచూర్ణం’ పసుపు, సున్నం కలిపి పెడతారుట.
సంప్రదాయం ప్రకారం వైష్ణవంలో రెండు శాఖలు ఉన్నాయి.
అవి ‘తెంగలై’, ‘వడగలై’ అని వ్యవహారంలో ఉన్నాయి.
“తెంగలై” వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు.
“వడగలై” వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు.
ఈ రెండూ కలిపి శ్రీవేంకటేశ్వర స్వామి నామం ఉంటుంది.
ఈ నామంలో ఉండే రెండు తెలుపు గీతలు
విష్ణువు పాదాలుగా,
మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీ దేవిగా చెబుతారు.
ఒక సంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తీ,లక్ష్మీదేవీ విడివిడిగా ఉండరనీ, అందుకే స్వామి తెలుపుగా, లక్ష్మీదేవిగా ఎరుపు కలిసి ఉంటాయి.
తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం ‘అభిషేక సేవ’ అనంతరం స్వామికి నామాన్ని ధరింపజేస్తారు అర్చకస్వాములు.
మళ్లీ శుక్రవారం వరకూ (వారం రోజులు) ఆ నామం అలానే ఉంటుంది.
శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు.
అందుకే శుక్రవారం అభిషేక సేవ, నిజపాద దర్శనానికి వెళ్లే భక్తులు నామం లేకుండా ఏడుకొండల స్వామిని దర్శించుకోవచ్చు.
నామం ఎలా ధరింపజేయాలీ,
ఏయే ద్రవ్యాలను కలిపి పెట్టాలీ,
పెట్టే సమయంలో ఏయే మంత్రాలను పఠించాలీ”
అనే విషయం “పరాశర స్మృతి” అనే గ్రంథంలో విపులంగా వివరణలున్నాయి.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన!
వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి!!
ఓం నమో వెంకటేశాయ..!!
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఏడుకొండలవాడా, వెంకటరమణ, శ్రీనివాస, ఆపదమొక్కులవాడ, గోవిందా గోవింద, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వక్షస్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది.
అందుకే వైకుంఠనాధుడ్ని శ్రీనివాసుడుగా పిలుస్తారు.
ఈ శ్రీమహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్రశాస్త్రంలో పేరు.
ఇది ప్రపంచంలో ఏదేవాలయంలోలేని తంత్రశాస్త్ర విశేషమైన కార్యక్రమం..
ఒకానొక సందర్భంలో స్వామివారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామివారు సాక్షాత్తు వైకుంఠనాధుడని, వైకుంఠంనుండి భూలోకంలో ఆచ్ఛావతారమూర్తిగా అవతరించారని, స్వామివారికి శంఖు,చక్రాలను ఏర్పాటుచేసి పచ్చకర్పూరంతో నామంపెట్టి వక్షస్థలంలో వ్యూహాలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.
వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటంవల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామనుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి.
అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యంకోసం తొలి జీయర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని,
ఈసంప్రదాయం ఆనాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉంది.
అలా శ్రీవారి వక్షస్థలంలో ఈవ్యూహాలక్ష్మి ఉండటం వల్లే స్వామివారికి జన,ధనఆకర్షణ విశేషంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే.
ఈ వ్యూహలక్ష్మిని వర్ణిస్తూ విభుజా అంటారు..
సాధారణంగా చతుర్భుజాలతో దర్శనభాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉండగా మూడుభుజాలతోనే దర్శనం ఇస్తారు కనుక
త్రిభుజా అని పిలుస్తారు.
శ్రీవారితో ఉన్నప్పుడు నాలుగుభుజాలతో పద్మాలు అలంకరించుకుంటే పద్మాసనంగా పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు.
ఈ వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారంనాడు పసుపుతో అభిషేకం జరుగుతుంది.
అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు, స్వామివారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు.
అనంతరం స్వర్ణాభరణాలు. పుష్పమాలలతో అలంకరించిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు,
ఈ వ్యూహలక్ష్మిని దర్శించుకొనేభక్తులకు కోరినన్ని కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
ఈ వ్యూహాలక్ష్మినే స్వర్ణలక్ష్మిగా పూజిస్తారు,
మహాలక్ష్మి అమ్మవారు మాంగల్యంతో మనకు దర్శనమిస్తారు అందుకే శ్రీవత్సమని అని పిలుస్తారు. మహాలక్ష్మికి అంటే ఈప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామివారి ఏకాంతంగా శ్రీసూక్తంగా సుగంధ ద్రవ్యంతో,చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామివారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు.
ఈ విధంగా పూజాలందుకుంటున్న వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు..
#తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు #🔱లక్ష్మీదేవి కటాక్షం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#💗నా మనస్సు లోని మాట #❤️లవ్ కోట్స్✍🏼 #✌️నేటి నా స్టేటస్












![💗నా మనస్సు లోని మాట - Making Someone Feel Seeh; Hfeard} & Uhderstood] Way is the Loudest 7 Love Ieww Making Someone Feel Seeh; Hfeard} & Uhderstood] Way is the Loudest 7 Love Ieww - ShareChat 💗నా మనస్సు లోని మాట - Making Someone Feel Seeh; Hfeard} & Uhderstood] Way is the Loudest 7 Love Ieww Making Someone Feel Seeh; Hfeard} & Uhderstood] Way is the Loudest 7 Love Ieww - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_176301_31c74492_1764691174809_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=809_sc.jpg)
