చైనా అభివృద్ధికి మనకి తేడా ఏంటో తెలుసా!
చైనా మన లాగే యువతను అన్ని దేశాలలో చదువు నిమిత్తం పంపుతుంది. అలాగే టెక్నాలజీ నేర్చుకోమని చెబుతుంది. చదువుకుని, టెక్నాలజీ నేర్చుకుని తిరిగివచ్చి దేశానికి ఉపయోగించాలని చెబుతుంది. అందుకే పిన్నిసు నుండి ఐఫోన్ వరకు అంతా కాపీ చేసి డూప్లికేట్ తయారు చేస్తుంది. టెక్నాలజీని ఉపయోగించి హైస్పీడ్ రైళ్లు, అత్యంత భారీ నిర్మాణాలు చేపట్టి ప్రపంచానికి దిక్సూచి గా మారింది.
మన యువత ఏం చేస్తున్నారు?
చదువుకోడానికి అమెరికా ఆస్ట్రేలియా, కొరియా ఇంకా అనేక దేశాలకు వెళ్ళి, బాత్రూమ్ లు కడిగి, పెట్రోల్ బంకుల్లో పనిచేసి, ఎలాగైతేనేమ్ పౌరసత్వం పొంది, అక్కడి సంస్థల్లో ceo గా జాబ్ కొట్టి, ఇంటికి పది లక్షలు కొట్టి, మమ్మల్ని చూడు మా సోకు చూడు అంటుంది మన దేశ యువత ... ఇతర దేశాల్ని బాగు చేసే పనిలో ఉన్నారు. అంతేనా. కసబ్ కి సపోర్ట్, దేశద్రోహులకు సపోర్ట్, గుండా నాయకులకి సపోర్ట్, సినిస్టార్ లకు సపోర్ట్, కులమతాలకు సపోర్ట్.. వీటికోసం కొట్టుకొని సచ్చిపోతారు తప్ప దేశాభివృద్ధి కోసం చేసేది సున్నా.. ఎదిగే వాడిని క్రిందికి లాగుతాం. చేసేవాడిని నిరాశపరుస్తాం..
అందుకే చైనా అభివృద్ధి చెందిన దేశం,
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం..
మన యువత ఇలానే ఉంటే మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలానే ఉంటుంది. ఎందుకంటే నాయకత్వం మారిందంటే పథకాలు మారిపోతాయి. వచ్చిన వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వీడిని పట్టుకొని కొందరు యువత వేలాడతారు తప్ప అభివృద్ధి భవిష్యత్తు తరాలకి మంచి చేయడం అనేది నేటి తరానికి కల.
మోడీ వంటి నాయకులు ఎవరో ఒకరిద్దరు వచ్చి బాధ్యత భారం మోయాలి తప్ప స్వతహాగా దేశ బాధ్యత మోయడం దేశాభివృద్ధి కోసం పాటుపడటం జరగదు.
#yes it's true 💯% #తెలుసుకుందాం #మీకు తెలుసా?? #Did you know

