😴మనకు తెలియని నిజాలు
32 Posts • 5K views
ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - * జీర్ణక్రియ - జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. * మలాశయం - మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . * మూత్రపిండములు - మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . * ఊపిరితిత్తులు - ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . * గుండె - గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . * లివర్ , స్ప్లీన్ - ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . * రక్తప్రసరణ - రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. * కీళ్లు - కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. * నాడి మండలము - ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. * జ్ఞానేంద్రియములు - జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. * చర్మము - చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . * మనస్సు - మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు #fasting
10 likes
13 shares
ఏడువారాల నగల గురించి సంపూర్ణ వివరణ - * ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును. . ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను. * సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించవలెను . * మంగళవారమునకు కుజుడు అధిపతి. అతని లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరించవలెను . * బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు. . ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు . * గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను . * శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు . * శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు . . స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు. . గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభ కలుగును. #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు
15 likes
11 shares
శరీరం నందు వాత, పిత్త , కఫాలు పెరిగినపుడు ఏర్పడే శారీరక , మానసిక మార్పులు - # శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * బరువు తగ్గుట. * శరీర దారుఢ్యం , బలం తగ్గును. * నరాల నొప్పులు పెరుగును . * కండరాల నొప్పులు పెరుగును . * నడుములో నొప్పి ముఖ్యముగా నడుము క్రింద . * కీళ్లనొప్పులు , కాళ్ల నొప్పులు పెరుగును . * చర్మం గరుకుదనం పెరుగును . * పెదాలు , శరీరం పగుళ్లు ఏర్పడును . * మలబద్దకం . * కడుపుబ్బరం , గ్యాస్ పెరగటం , గ్రహణి సమస్య * అధిక రక్తపోటు . * చలిగాలికి తట్టుకోలేకపోవడం . * ఋతువునోప్పి . ☆ మానసిక మార్పులు - * మనసు కుదురుగా ఉండదు. రకరకాలుగా పరుగుతీయును . * పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోవడం . * దేనిమీద ఏకాగ్రత ఉండదు. * అధికమైన ఆందోళన . * గాభరా ఎక్కువ అవ్వడం . * అసహనంగా ఉండటం . * దిగులు , నిద్రపట్టక పోవడం . * త్వరగా అలసిపోవడం . * ఆకలి లేకపోవటం . # శరీరం నందు పిత్తం ప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * అతిగా దాహం వేయడం . * అతిగా ఆకలి వేయడం . * హైపర్ ఎసిడిటి , అల్సర్ ఏర్పడుట. * ఎండని తట్టుకోలేకపోవడం . * వొళ్ళంతా మంటలు . * చర్మం పైన పుళ్ళు ఏర్పడుట . * దద్దురులు , కురుపులు , మొటిమలు వచ్చును . * దుర్వాసన , చమటలు అధికంగా పట్టడం . * మొలల వ్యాధి , మలద్వారం వద్ద మంట. * కళ్లు ఎరుపెక్కడం . * మూత్రం మంటగా , బాగా పలచగా , ఎరుపుగా వెళ్లడం . ☆ మానసిక మార్పులు - * ప్రతిదానికి అరవడం , కేకలు పెట్టడం , చికాకు పడటం . * కోపం అధికం అవ్వడం . అసహనం పెరుగుట . * ప్రతిదాన్ని విమర్శించడం . * ప్రతిదానికి ఎదురుమాట్లాడటం . * ప్రతివాళ్ల మీద పగతీర్చుకుంటా అనడం , ప్రవర్తించటం . # శరీరము నందు కఫం ప్రకోపం చెందినపుడు - ☆ శారీరక మార్పులు - * ఛాతి బరువుగా ఉండటం. * కంఠం కఫముతో పూడుకొనిపోయినట్టు ఉండటం. * ముక్కు , సైనస్ లు జిగురుతో నిండిపోవడం . * దగ్గు , ముక్కు కారటం , తరచూ జలుబు చేయడం . * చలి , తేమని తట్టుకోలేకపొవడం . * ఎప్పుడూ ఎలర్జీలతో ఇబ్బందిపడటం * ఉబ్బసం కలగడం . * అధిక బరువు పెరగటం . * కొలెస్ట్రాల్ మోతాదు పెరగటం . * శరీరం నందు వాపులు పెరగటం . * కడుపుబ్బరం . * శరీరం చల్లగా , తెల్లగా మారడం . * మధుమేహ సమస్య రావటం . * శరీరంలో గడ్డలు , కండలు పెరగటం . పైన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అనగా శరీరం నందలి వాత, పిత్త , కఫాలు కొన్ని కొన్ని కారణాల వలన హెచ్చుతగ్గులకు లోనగును. అలాంటప్పుడు ఏదైతే పెరిగిందో అలా పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి . ఉదాహరణకు పైన చెప్పిన లక్షణాలు ఆయా శరీర ప్రకృతుల వారికి సహజ లక్షణాలు . అంటే వాత ప్రకృతి గల వారికి ఏ మాత్రం వాతం పెరిగినా నొప్పులు వెంటనే వస్తాయి. అలాగే కఫం పెరిగితే వాళ్లకి నొప్పులు రావా ? అంటే వస్తాయి . కఫ శరీర తత్త్వం గలవారికి నొప్పులు వచ్చాయంటే వారితో వాతం పెరిగిందని అని అర్థం . అలాగే బరువు అధికంగా పెరగటం కఫ శరీర తత్త్వం ఉన్నవారి లక్షణమైన వాత, పిత్త శరీరతత్వం ఉన్నవాళ్లు కూడా బరువుపెరుగుతారు అటువంటప్పుడు వారిలో కఫ సంబంధ దోషం పెరిగిందని అర్థం చేసుకోవాలి . వాతశరీరం కలిగిన వారు బరువు త్వరగా తగ్గుతారు , బరువు ఆలస్యముగా పెరుగుతారు. పిత్త శరీరం కలవారు ఆకలి ఎక్కువుగా ఉండటం , స్ట్రెస్ ఎక్కువుగా ఉండటం వలన అతిగా తింటారు. దానివల్ల బరువు పెరుగుతారు . వీరుకొంత ఆలస్యముగా బరువు తగ్గుతారు. కఫప్రకృతి వారు బరువు తగ్గడం అంత త్వరగా సంభవించదు. #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు #🍃ఆయుర్వేదం #🍃ఆయుర్వేదం
13 likes
11 shares