🙏సుబ్రహ్మణ్య స్వామి
35K Posts • 396M views
💞𝐊𝐮𝐦𝐚𝐑💞
1K views 14 days ago
#🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🙏సుబ్రహ్మణ్య స్వామి #✌️నేటి నా స్టేటస్ #🤳Whatsapp DP #🤳Whatsapp DP #🙏దేవుళ్ళ స్టేటస్ . *** ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి *** సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు, ఇది మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజున, శివుడు పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఈ పండుగను సుబ్రహ్మణ స్వామి జన్మించిన రోజుగా భావిస్తారు. వివాహ, సంతాన సమస్యలు ఉన్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పండుగను తమిళనాడుతో సహా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్న ప్రదేశాలలో ఘనంగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల దేవాలయాల సమీపంలో తిరునాళ్ళు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో సుబ్బరాయ షష్ఠి అని కూడా పిలుస్తారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిన కథే. మహా బలిష్టుడు తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించు కోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. ప్రజలు సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింత శ్రద్దగా జపిస్తూ ఉంటారు. అందరికి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు.🙏KumaR
21 likes
2 comments 13 shares