PSV APPARAO
711 views • 10 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*శరత్ పూర్ణిమ*
విజయదశమి తరవాత వచ్చేది- శరత్ పూర్ణిమ. ఇది ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని విశేషంగా పూజి స్తారు. మహిళలు వ్రతం ఆచరిస్తారు. శార దాదేవిని ఆరాధిస్తారు కాబట్టి, దీన్ని 'శారదా పూర్ణిమ' అని పిలుస్తారు. ఇదే పూర్ణిమ నాటి రాత్రి లక్ష్మీదేవి భువిలోని ఇళ్లకు వెళ్తుందని, తలుపు తట్టి 'రాత్రివేళ కొబ్బరి నీరు మాత్రమే సేవించి మేలుకొన్నదెవరు' అని ప్రశ్నిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 'కో జాగర్'- అంటే, 'మేలుకొన్నదెవరు' అని అర్థం. అటువంటి స్త్రీలు గల ఇంట్లోకి దేవి ప్రవేశించి, సకల సంపదలూ అనుగ్రహిస్తుందని భక్తకోటి నమ్ముతుంది.
లక్ష్మికి వాహనం- పైడికంటి పక్షి. ఆ చల్లని తల్లి చేతిలో గవ్వల భరిణ ఉంటుందట. బియ్యం ఆమెకు ఎంతో ఇష్టమని చెబుతారు. అందుకే బెల్లం పాయసాన్ని దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. గవ్వలు అంటే, దేవి చేతిలోని నాణేలు! సముద్రం నుంచి ఆవిర్భవించడం వల్ల, సహజంగానే ఆమె చేతిలో గవ్వలుంటాయి. అవి సిరిసం పదలకు సంకేతాలన్న భావన లోకంలో నెలకొని ఉంది.
దేవికి అటుకులు, కొబ్బరి అత్యంత ప్రీతికర మైనవి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మహి ళలు బియ్యపు పిండిని ముద్దలుగా చేసి, ఇంటి ద్వారాల వద్ద ఉంచుతారు. ఇంటి గోడల మీద ఆ తల్లి పాదముద్రలు, శంఖాల బొమ్మలు, పైడికంటి పిట్టల చిత్రాలు వేస్తారు. గవ్వలాడుతూ, పాటలు పాడుకుంటూ, లక్ష్మిని ఆహ్వా నిస్తూ రాత్రంతా తదేక చిత్తంతో జాగారం చేస్తారు. భక్తులు కొబ్బరినీరు మాత్రమే తీసుకుంటారు. వారు సంధ్యాసమయం నుంచి శంఖనాదం చేస్తుంటారు.
ఆశ్వయుజ పూర్ణిమ వ్రత కథ 'భవిష్యో త్తర పురాణం'లో వివరంగా ఉంది. నియమ నిష్ఠలు కలిగిన వ్రతం ఇది. పార్వతికి వని తలు షోడశోపచార పూజలు చేస్తారు. అరి సెలు, అప్పాలతో పాటు కూరలు, అన్నం సిద్ధపరుస్తారు. ఆ తల్లితో పాటు నందికేశ్వర ప్రతిమలు ఉంచుతారు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంకేతంలా 'చతుర్భుజ'గా మహే శ్వరిని భావించి అర్చిస్తారు. నైవేద్యం, తాంబూలం, హారతి, ప్రదక్షిణ ముగిసిన అనంతరం- విగ్రహాన్ని జలంలో నిమజ్జనం చేయడం తరతరాల సంప్రదాయం.
వ్రత విధానాన్ని సాక్షాత్తు పరమేశ్వరే ఉప దేశించిందని పురాణ గాథలు చెబుతాయి. మగధ రాజ్య నివాసి వలితుడు భాగ్య వంతుడు కావడానికి, భార్యాసమేతంగా నిశ్చిం తగా కాలం గడపడానికి అపార భక్తిశ్రద్దలే కారణమని అవి వివరిస్తాయి.
శ్రీమహాలక్ష్మి కృపా కిరణాలు సదా తమపై ప్రసరించాలని భక్తజనులు త్రికరణ శుద్ధిగా కోరుకుంటారు. ఆమె నామ శబ్దాన్ని వేదవి హితంగా, అనంత సంపదకు పర్యాయ పదంగా వారు సర్వదా తలచుకుంటారు.
ఈ పండుగను మహారాష్ట్ర మహిళలు మహోత్సాహంగా జరుపుతారు. వెన్నెల రాత్రి ఆహారంగా పాలలో నానబెట్టిన అటుకుల్ని స్వీకరిస్తారు. పంచదార, కుంకుమ పువ్వు వేసి క్షీరాన్నం వండుతారు. ఆ పాయస పాత్రను బయట వెన్నెలలో ఉంచడం వల్ల, సహజసిద్ధంగానే చంద్రకిరణాల అమృత శక్తి ప్రసరి స్తుందని అనేకులు నమ్ముతారు.
ఈ వ్రతాచరణ విధానం కాలక్రమంలో మహారాష్ట్ర నుంచి అన్ని రాష్ట్రాలకూ విస్తరిం చింది. ఇంటింటా సిరులు కురిపించే నిండైన పున్నమి వెన్నెల వేళగా దీన్ని తెలుగువారు పరిగణిస్తారు. సాయంకాలం ప్రారంభమయ్యే పండుగ సందర్భంగా, తల్లి తన బిడ్డలకు కొత్త వస్త్రాలిస్తుంది. దేవ వైద్యులైన అశ్వని పరిరక్షణలో పిల్లలందరూ చల్లగా ఉండాలని మాతృమూర్తి ఆశిస్తుంది. అలాగే, ఈ శుభసమయంలో నారదీయ పురాణ గ్రంథాన్ని దానం చేస్తే మరెన్నో ఉత్తమ ఫలి తాలు కలుగుతాయన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం!
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
10 shares