#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*కౌముది లక్ష్మీ వ్రతం*
ప్రతి మాసంలోను పౌర్ణమికి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే ప్రపూజలు, వ్రతాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేసే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలు ఇస్తుందని పురాణ వచనం.
ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తే, పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరిసంపదలను ప్రసాదిస్తుందని చెబుతారు.
ఆశ్వయుజ పౌర్ణమిని 'కౌముది' పౌర్ణమి అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతం ఆచరించి జాగరణ చేయడం వలన, ఆశించిన ఫలితాలు శీఘ్రంగా అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, తన వ్రతం ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్య్ర బాధలు తొలగిపోయి. సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున ఆ తల్లిని పూజిస్తూ, సేనిస్తూ ఉండాలని పండితులు చెబుతారు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
