తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS
58 Posts • 31K views
PSV APPARAO
667 views 13 days ago
#శ్రీవారి భక్తులకు శుభవార్త 🕉️ భక్తులకు విజ్ఞప్తి #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ 👆 *భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు* తిరుమల, 2025, అక్టోబర్ 08 : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
10 likes
13 shares
PSV APPARAO
702 views 13 days ago
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #టీటీడీ న్యూస్!!!📰 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS 👆 *భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు* తిరుమల, 2025, అక్టోబర్ 08 : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
16 likes
2 shares
PSV APPARAO
608 views 13 days ago
#తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం / గరుడ సేవ విశిష్టత 🕉️🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ #తిరుమల పున్నమి గరుడ సేవ వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
14 likes
9 shares
PSV APPARAO
627 views 16 days ago
#తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #ఫేక్ న్యూస్ లు నమ్మవద్దు #ఫేక్ న్యూస్ నమ‌్మకండి #సీనియర్ సిటిజన్లకు నేరుగా శ్రీవారి దర్శనం.. పత్రికా ప్రకటన తిరుమల, 2025 అక్టోబర్ 05 వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.
10 likes
7 shares