ఎల్లో మీడియా.. 💥
868 Posts • 126K views
P.Venkateswara Rao
856 views 16 days ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *నిస్సంకోచంగా… నిర్మొహమాటంగా… బాలకృష్ణను కడిగేసిన రాధాకృష్ణ..❗❗* October 5, 2025🎯 సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకుకు పాఠకులు ఎక్కువ… ఏ ఇతర పత్రికల్లోనో కనిపించే సంపాదకీయ వ్యాసాలు చదివేవాళ్లే ఉండరు… ఉత్త నస… పసలేని రాతలు… ఐతే రాధాకృష్ణ వ్యాసాలకు అతి పెద్ద మైనస్… జగన్‌పై విషం, చంద్రబాబుపై భక్తి… సో, ఏపీ రాజకీయాలకు సంబంధించిన తన అభిప్రాయాలన్నీ వెయ్యి శాతం బయాస్డ్… తన వ్యాసాల్ని చదివేవాళ్లు అది తెలిసీ చదువుతూనే ఉంటారు… ఈసారి పూర్తి భిన్నం… ఈరోజు తను రాసిన వ్యాసం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్… బ్యాలెన్స్‌డ్… ఓ జర్నలిస్టుగా తన అనుభవం, తన పరిణతి కనిపించాయి… మామూలుగా తన వ్యాసాల్ని నిశితంగా విమర్శించే సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం ఈరోజు వ్యాసాన్ని మెచ్చుకుంటున్నారు తమ పోస్టుల్లో… కాస్త కటువుగా, పరుషంగా చెప్పాలంటే… బాలకృష్ణ బట్టలిప్పేశాడు… మామూలుగా బాలకృష్ణ మీద ఏదైనా రాయడానికి చాలామంది సంకోచిస్తుంటారు… కానీ ఆ క్యాంపు మనిషే అయి ఉండీ రాధాకృష్ణ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కడిగేశాడు… తన వ్యాసంలోని కొన్ని వాక్యాలు ఇలా… ‘‘తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు – నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు. మూడో పర్యాయం. సభ మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి, రెండు జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమే! నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్లజోడును తలపైకి నెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం కచ్చితంగా అభ్యంతరకరమే. బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చునుగానీ ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్‌రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారేమో తెలియదు. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏక వచనంతో ఎవరినీ సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదుగానీ బాలకృష్ణ ‘వాడు వీడు’ అన్న పదాలను వాడారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడైనా బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైనా నష్టమైనా ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు, విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే’’ హవ్వ… నవ్విపోదురుగాక! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు… అని చంద్రబాబును చూసి కూడా జాలిపడ్డాడు రాధాకృష్ణ… బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా, ఆయన చిరంజీవికి కూడా ఫోన్‌ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది… అని బాలకృష్ణ మాటలతో చంద్రబాబు ఇలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు ఆర్కే… ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపు కులజాఢ్యం ఎలా ప్రబలిందో ఘాటుగానే రాశాడు… నిజమే, కేవలం వాళ్ల కులస్తులు వోట్లేస్తేనే గెలుస్తారా ఈ కులరాజకీయ నేతలు..? టీడీపీ కమ్మ పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ, జనసేన కాపు పార్టీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేసేంతగా కులం- రాజకీయం కలగలిసిపోయి, దానికి ఫ్యానిజం తోడై… ఏపీ రాజకీయాలు నిజంగానే కంపు కొడుతున్నాయి..!! ఓ కొత్త విషయం తెలిసింది… ‘‘బాలకృష్ణను మాత్రమే కాదు– ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ కే.కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖరరెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా? కాదా? అన్నది వేరే విషయం…’’
4 likes
11 shares
P.Venkateswara Rao
579 views 16 days ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *జగన్ ను అలా అనడం తప్పు.. బాలకృష్ణకు సభా మర్యాదలు తెలియవా❓* 05.10.2025🎯 అప్పట్లో ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల మీద నిషేధం ఉండేది.. ఇది కొంతకాలం పాటు సాగింది. ఇటీవల ఆ నిషేధం ఎత్తేశారు. చంద్రబాబు మీద ప్రేమ ఉండి.. బాలకృష్ణ మీద ద్వేషం కలగడం ఏంటో.. అసలు వేమూరి రాధాకృష్ణకు.. బాలకృష్ణకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు.. అందువల్లే కావచ్చు తాజా ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బాలకృష్ణ మీద అమాంతం లేచారు. మర్చిపోతున్న విషయాన్ని మరోసారి గెలికారు. సింపుల్ గా చెప్పాలంటే మానిపోతున్న గాయం మీద కారం వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల శాసనసభలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సైకో గాడు అంటూ మండిపడ్డారు. స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని జుట్టు మీద గాగుల్స్ పెట్టుకొని.. అలా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటని అవి సభ మర్యాదలు ఎలా అవుతాయని రాధాకృష్ణ ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయి అంటూ వాపోయారు. “బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు.. నాటి నగర కమిషనర్ ఆర్పి సింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదుట ఒక నివేదిక ఉంచారు. ఆ నివేదికను చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నవ్వి ఊరుకున్నారు.. చర్యలు ఏమొద్దులేవయ్యా అంటూ నగర కమిషనర్ కు సూచించారు. నాటి ఆ ఘటనలో బాలకృష్ణను కాపాడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణకు కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నది జగన్.. బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి” ఇలా కీలక విషయాలను బయటపెట్టారు వేమూరి రాధాకృష్ణ. బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని.. పేరుకు పరామర్శ అయినప్పటికీ.. అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని వేమూరి రాధాకృష్ణ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆయనను చల్లపరచడానికే చంద్రబాబు ప్రయత్నించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు.. బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు. కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రాధాకృష్ణ బయటపెట్టారు. రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాసం రాశారు కాబట్టి దీనిని వైసిపి నాయకులు మరింత ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే తొలిసారి ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ బాధిత పక్షంగా కనిపించారు కాబట్టి వైసిపి ఊరుకోదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం వదులుకోవడం లేదు. కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ప్రచురిస్తున్నారు. తన చానల్లో ప్రసారం చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా రాధాకృష్ణ వెనుకాడటం లేదు. రాధాకృష్ణలో ఈ మార్పును చూసిన కూటమినేతలు ఆశ్చర్యపోతున్నారు. తాజా కొత్త పలుకులో కూడా వేమూరి రాధాకృష్ణ అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు. దీంతో కూటమినేతలకు మరోసారి షాక్ తగిలినట్టే. అన్నట్టు ఏపీలో కులాల కుంపట్లు ఇప్పుడే కొత్తగా ఉన్నాయా.. గతంలో లేవా.. కులాల కుంపట్ల మీద చలికాచుకున్న వారిలో ఎంతమంది లేరు.. ఇప్పుడే ఏపీలో ఆ జాడ్యం మొదలైనట్టు రాధాకృష్ణ చెప్పడం భలే వింతగా ఉంది.
13 likes
15 shares
P.Venkateswara Rao
1K views 1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ #ఎల్లో మీడియా.. 💥 *వైఎస్ భారతిపై ఏంటీ నీచ రాతలు❓* SEPTEMBER 21, 2025🎯 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య కావడమే భారతి చేసిన తప్పా? రాజకీయాల్లో ఉన్న వైఎస్ జగన్ ను ప్రత్యర్థులు, వారి మీడియా దాడి చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని భారతిపై తరచూ నీచ రాతలు రాయడాన్ని ఎలా చూడాలి? తప్పుడు రాతలని తెలిసిన తర్వాత వాళ్లలో కనీస పశ్చాత్తాపం కనిపించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కొన్ని రోజులుగా చెన్నై, హైదరాబాద్లలో వైఎస్ అనిల్రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుకూల మీడియాకు వివరాలు అందజేస్తూ, రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్ని చేస్తున్నారు. అనిల్రెడ్డికి సంబంధించిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్ పేరు భారతి అని కనిపించగానే, లిక్కర్ కేసుతో జగన్ సతీమణి భారతికి సంబంధం ఉన్నట్టు అనుకూల మీడియా హడావుడి విడ్డూరంగా వుంది. ఆ రెండు కంపెనీలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అని, ఏ మాత్రం తెలుసుకోకుండానే రాయడం, తమది తప్పుడు సమాచారం అని పాఠకులకు చెప్పాలనే సంస్కారం లేకపోవడం జర్నలిస్టు విలువల దిగజారుడుతనానికి పరాకాష్ట. అందరికీ తెలిసేలా ఫలానా కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్టర్ అని రాసి, ఆ మరుసటి రోజు మాత్రం ఎవరికీ తెలియకుండా, లోపలి పేజీలో సంబంధం లేదన్నట్టు వార్తలో ఇరికించడం ఏం జర్నలిజమో వాళ్లకే తెలియాలి. “ఈ కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని సిట్ అధికారులు తేల్చారు” ఎవరు తేల్చారని ………ఆ కంపెనీల్లో మాజీ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్టర్ అని రాశారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? తప్పుడు సమాచారానికి క్షమాపణ చెప్పాలనే ఆలోచన రాలేదా? అనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తోంది. తనపై తప్పుడు రాతలు రాసిన మీడియాపై వైఎస్ భారతి న్యాయ పోరాటం మొదలు పెట్టారు. రాజగురువు పత్రికకు భారతి లీగల్ నోటీసు పంపారు. బురద చల్లుతాం, కడుక్కోమన్నట్టుగా వైఎస్ జగన్, ఆయన భార్య భారతిపై ప్రత్యర్థి మీడియా రాతలు, నాయకుల కూతలున్నాయి. ఇలా ఇంకెంత కాలం? రాజకీయాలతో సంబంధం లేని భారతిపై, ఏ మాత్రం నిజాలు లేని వాటిని తెరపైకి తీసుకొచ్చి, బద్నాం చేయాలనే కుట్రలకు ముగింపు పలకాల్సిన అవసరం వుంది. తమ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి రాతలు రాస్తే, కూతలు కూస్తే ఎలా ఫీల్ అవుతామో, ప్రత్యర్థులు ఆలోచించుకోవాలి.
12 likes
12 shares