#🟡తెలుగుదేశం పార్టీ #ఎల్లో మీడియా.. 💥
*వైఎస్ భారతిపై ఏంటీ నీచ రాతలు❓*
SEPTEMBER 21, 2025🎯
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య కావడమే భారతి చేసిన తప్పా? రాజకీయాల్లో ఉన్న వైఎస్ జగన్ ను ప్రత్యర్థులు, వారి మీడియా దాడి చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని భారతిపై తరచూ నీచ రాతలు రాయడాన్ని ఎలా చూడాలి? తప్పుడు రాతలని తెలిసిన తర్వాత వాళ్లలో కనీస పశ్చాత్తాపం కనిపించకపోవడం మరింత ఆశ్చర్యం
కలిగిస్తోంది.
లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కొన్ని రోజులుగా చెన్నై, హైదరాబాద్లలో వైఎస్ అనిల్రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుకూల మీడియాకు వివరాలు అందజేస్తూ, రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్ని చేస్తున్నారు.
అనిల్రెడ్డికి సంబంధించిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్ పేరు భారతి అని కనిపించగానే, లిక్కర్ కేసుతో జగన్ సతీమణి భారతికి సంబంధం ఉన్నట్టు అనుకూల మీడియా హడావుడి విడ్డూరంగా వుంది. ఆ రెండు కంపెనీలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అని, ఏ మాత్రం తెలుసుకోకుండానే రాయడం, తమది తప్పుడు సమాచారం అని పాఠకులకు చెప్పాలనే సంస్కారం లేకపోవడం జర్నలిస్టు విలువల దిగజారుడుతనానికి పరాకాష్ట.
అందరికీ తెలిసేలా ఫలానా కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్టర్ అని రాసి, ఆ మరుసటి రోజు మాత్రం ఎవరికీ తెలియకుండా, లోపలి పేజీలో సంబంధం లేదన్నట్టు వార్తలో ఇరికించడం ఏం జర్నలిజమో వాళ్లకే తెలియాలి.
“ఈ కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని సిట్ అధికారులు తేల్చారు”
ఎవరు తేల్చారని ………ఆ కంపెనీల్లో మాజీ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్టర్ అని రాశారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? తప్పుడు సమాచారానికి క్షమాపణ చెప్పాలనే ఆలోచన రాలేదా? అనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తోంది. తనపై తప్పుడు రాతలు రాసిన మీడియాపై వైఎస్ భారతి న్యాయ పోరాటం మొదలు పెట్టారు. రాజగురువు పత్రికకు భారతి లీగల్ నోటీసు పంపారు. బురద చల్లుతాం, కడుక్కోమన్నట్టుగా వైఎస్ జగన్, ఆయన భార్య భారతిపై ప్రత్యర్థి మీడియా రాతలు, నాయకుల కూతలున్నాయి. ఇలా ఇంకెంత కాలం? రాజకీయాలతో సంబంధం లేని భారతిపై, ఏ మాత్రం
నిజాలు లేని వాటిని తెరపైకి తీసుకొచ్చి, బద్నాం చేయాలనే కుట్రలకు ముగింపు పలకాల్సిన అవసరం వుంది. తమ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి రాతలు రాస్తే, కూతలు కూస్తే ఎలా ఫీల్ అవుతామో, ప్రత్యర్థులు ఆలోచించుకోవాలి.
