Failed to fetch language order
ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
562 Posts • 25K views
PSV APPARAO
718 views 1 months ago
#🎶గణేశ భజన–మంత్రాలు–ఆరతి🪔 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #🕉️వినాయక మంత్రాలు *ఓం లంబోదరాయ నమః* గణేశ రూపాలు ఎన్నో ఉన్నాయి. గణేశ మంత్రాలు కూడా అసంఖ్యాకమే. ఒక్కోనామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రతి మంత్రానికీ విశిష్ట పరమార్థం, ప్రయోజనం ఉంటాయి. ఏ సమయంలో ఎప్పుడైనా ఎవరైనా జపించుకోగలిగే గణపతి మంత్రాలు మూడింటిని చూద్దాం. _మంత్రం :_ *ఓం లంబోదరాయ నమః* _వివరణ :_ సృష్టికంతకూ మూలమైన వానికి నమస్కారం అని మంత్రార్థం. లంబోదరుడంటే సాధారణమైన అర్థంలో బానబొజ్జ కలవాడని చెబుతాం. కానీ బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి ఖండం లంబ శబ్దానికి బ్రహ్మాండ భాండములనే వివరణ ఇచ్చింది. లంబోదరుడంటే సృష్టిలోని బ్రహ్మాండాలన్నీ ఉదరంలోనే దాచుకున్నవాడని అర్థం. సిద్దిలక్ష్మీదేవిని అంకముపై కూర్చుండబెట్టుకుని లంబోదరుడు దర్శనమిస్తాడు. _నేపథ్యం :_ లంబోదర శబ్దాన్ని గురించి ముద్దలపురాణం చక్కగా వివరించింది. భాగవతంలో కూడా బ్రహ్మవర్చసః కామస్తు యదేతా బ్రహ్మణస్పతిం అంటే బ్రహ్మవర్చస్సు, విద్యకావాలనుకునేవారు లంబోదరుణ్ణి పూజించాలని చెప్పారు. లంబోదర లకుమి కథా అనేకీర్తన లంబోదరుడు లక్ష్మీకరుడు అని చెబుతుంది. _చేయవలసిన క్రమం :_ రోజూ 108 సార్లు _నైవేద్యం :_ వడపప్పు, ఉండ్రాళ్లు, పెసరపప్పు, పానకం వంటివి ఏవైనా. _ప్రయోజనం:_ విద్య, యశస్సు, సంపద కలుగుతాయి. స్త్రీలకు వివాహప్రాప్తి, సౌందర్యప్రాప్తి. _-_ _మంత్రం :_ *ఓం ఫాలచంద్రాయ నమః* _వివరణ:_ అరచంద్రునివంటి నుదురు కలిగిన స్వామికి నమస్కారం అని మంత్రారం. _నేపథ్యం:_ స్వామి శిరస్సు మీద ఉండే చంద్రుడు వేరు. ఆకాశంలో మనకు కనిపించే చంద్రుడు వేరు. నుదురు చంద్రవంకలావుంటే శ్రేష్టమైన జాతకుడవుతాడని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. ఇటువంటి స్వామి అందరికీ ఆరాధ్యుడు. రసూల్ ఖాన్ అనేకవి శిశుశశి ఈక్ అయిన ఫాలచంద్ర గణపతికి తాను బందీనైపోయానని చెప్పుకున్నాడు. _చేయవలసిన క్రమం:_ యధాశక్తి _నైవేద్యం :_ పళ్లు, పాలు, వడపప్పు వంటివి. _ప్రయోజనాలు :_ చంద్రుడు మనస్సుకు కారకుడు. ఫాలచంద్ర గణపతిని అర్చిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి. జ్ఞానము కలుగుతుంది. బుద్ది తీక్ష మవుతుంది. గణపతి సద్విద్య, సద్భుద్ది కలిగిస్తాడు. _-_ _మంత్రం :_ *ఓం గజవకాయ నమః* _వివరణ :_ ఏనుగు ముఖం కలిగిన స్వామికి వందనం అని మంత్రార్థం. గజ అన్నప్పుడు గ అంటే జ్ఞానం. జ్జ అంటే ఆచరణ. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని కలిగించే దేవర గజవక్షుడు. ఈ స్వామి ఎనిమిది ముఖాలతో ఎర్రని శరీరం కలిగివుంటాడు. _నేపధ్యం:_ నారదపురాణంలో చెప్పిన మహామంత్రాలలో ఇదికూడా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శ్లోకంలో ప్రసన్నవదనం అంటే సింహ. గజముఖాలు కలిగిన్ స్వామి అనే అర్ధాన్ని పెద్దలు చెబుతారు. ఏనుగు ముఖం గంభీరమైంది. దాని మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. శిక్షించినా, రక్షించినా అపూర్వమైన రీతిలో చేయడం గజవదనుని ప్రత్యేకత _చేయవలసిన క్రమం :_ రోజుకు 27 సార్లు తగకుండా చేయాలి. _నేవేద్యం:_ బెల్లంముక్క చాలు. _ప్రయోజనాలు :_ గజవదనుడైన గణపతిని పూజిస్తే మనలోని ఎనిమిది అవలక్షణాలు తొలగుతాయి. ఉత్సాహం ఫలితం ఆలస్యం చెయ్యిడం, లోభం, దీనత్వం, నిద్ర, సోమరితనం, అరకొరగా పనిచేయడం, స్తబ్దత, మతిమరుపు ఒకప్పుడు ఈ ఎనిమిది అవలక్షణాలూ ఒకప్పుడు దేవతా సైన్యాలకు కలిగితే వాటిని తొలగించడానికే పరమాత్మ గజవదనంతో వచ్చాడు. జ్ఞానం బలం, చురుకైన బుద్ధి సిద్ధిస్తాయి. పోటీపరీక్షలకు చదువుకునే పిల్లలు ఈ మంత్రం జపించాలి. *డైలీ విష్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
14 shares
PSV APPARAO
606 views 5 days ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం🙏 #అట్లతద్ది #అట్ల తదియ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం* 'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే. జీవితాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. భారతీయ వైదిక సంస్కృతిలో నోములకు, వ్రతాలకు ప్రత్యేక స్థానముంది. ఇవి వనితల కోసం నిర్దేశింపబడినవి. అయితే అవి వారి కొసమేననే అభిప్రాయానికి రాకూడదు. ఆయా నోములు, వ్రతాల ఫలాలు ఇంటిల్లిపాదికీ అందుతాయి. అటువంటి వాటిలో ఆశ్వయుజ బహుళ తదియ నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించే అట్ల తదియ ఒకటి. 'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే, జీవి తాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వ ర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సకల సౌభాగ్య ప్రదాత్రి అయిన గౌరీ దేవి ఈ నోముకు అధిష్ఠాత్రి. అశ్వీయుజ బహుళ తదియ నాడు చంద్రోదయమైన తర్వాత గౌరీదేవిని ప్రతిష్ఠించి, పూజించి మినుములు, బియ్యం కలిపి విసిరి ఆ పిండితో అట్లను చేసి గౌరీ దేవికి నివేదించి ముత్తయిదువులను గౌరిగా భావించి, అలంకరణ చేసి, పది ఫలాలను, పది అట్లను రవికల బట్టతో వాయనంగా అందించి ఆశీస్సులందుకోవడం ఈ నోములోని విశేషం. ఆహూతులైన సువాసినులకు ప్రసా దంగా ఫలపుష్పాదులతో సహా ఇచ్చి ఆశీస్సులందుకోవాలి. ఆపై నోముకు సంబంధించి కథ చెప్పుకుని అక్షతలు దేవిపై, తనపై వేసుకుని వ్రత సమాప్తి చేయాలి. పరమ శివుని పతిగా పొందాలనే లక్ష్యంతో పార్వతి తపస్సు చేస్తున్న సమయంలో త్రిలోక సంచారి అయిన నారదుడు ఆమె మనోరథ సిద్ధికై ఈ నోమును చెప్పాడని పురాణ వచనం. ఆ విధంగా ఈ నోము చేయించడంతో ఆమె కోరిక తీరింది. ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో నిర్వహిస్తారు. కనుక దీనిని చంద్రో దయ గౌరీ వ్రతంగా పిలుస్తారు. చంద్రోదయ వ్రతం ఆచరించి రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని భర్తగా పొందిందని శ్రీమద్భాగవతం ఉటంకిస్తోంది. *వ్రత విధానం* ఆశ్వీయుజ తదియ నాడు వేకువజామునే లేచి వ్రతులై గౌరిని పూజించాలి. రోజంతా ఉపవసించాలి. అవకాశం లేని వారు పక్వాహారం కాకుండా ఫలాలను ఆరగించవచ్చు. పాలు తాగవచ్చు, తాంబూలం కూడా సేవించవచ్చు. రోజంతా పిన్నలు, పెద్దలు కలిసి ఆటపాటలతో ఆనందంగా గడపాలని, ఊయలలూగడం వంటివి చేసి రోజంతా సంతోషంగా ఉండా లని వ్రత విధానం చెబుతోంది. కథ ఒకప్పుడు పాటలీ పుత్రాన్ని ఏలే మహారాజుకు సునామ అనే కుమార్తె ఉండేది. అందచందాలలో ఆమె సాటిలేనిది. అయితే ఆమెకు ఎంత ప్రయత్నించినా వివాహం కాలేదు. తన చెలికత్తెలందరికీ వివాహాలైవారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం ఆమెను కుంగదీసింది. గౌరి అంటే ఎంతో భక్తి కలిగిన ఆమె తన బాధను దేవి కూడా పట్టించుకోవటంలేదని గౌరీ ఆలయానికి వెళ్ళి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఇంతలో చంద్రోదయ వ్రతాన్ని ఆచరిస్తే సలక్షణుడైన వ్యక్తితో వివాహం జరుగుతుందని, వ్రత విధి విధానాలను తెలియజేస్తూ ఒక వాణి వినిపించింది. సునామ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుని ఇంటికి చేరింది. తాను దేవాలయంలో విన్న విధంగా చంద్రదోయ వ్రతాన్ని నిర్వర్తించడానికి సంకల్పిం చింది. ఆశ్వయుజ తదియనాడు రాకుమారి సునామ వ్రతదీక్ష పూనింది. అయితే చంద్రోదయం వరకూ ఆమె ఉపవాసం ఉండడం కష్టమని ఆమె ఆ కఠిన నిబంధనలను పాటించలేదని భావించి ఆమెపై ప్రేమతో ఆమె సోదరుడు కొద్దిగా చీకటి పడుతున్న వేళ ఆమె పూజ చేస్తున్న ప్రాంగణంలో ఒక వృక్షా నికి పెద్ద అద్దం వేలాడదీయించి, దానికి ఎదురుగా ఒక గడ్డి వాము నుంచి దానిని కాల్పించాడు. కాలుతున్న గడ్డివాము కాంతి ఆ అద్దంలో చంద్రోదయ మనట్టు కనిపించేలా ఏర్పాటు చేశాడు. అనంతరం చెల్లెలితో చంద్రోదయమైందని నమ్మ బలికాడు. దానితో ఆమె చంద్రోదయం కాకుండానే వ్రతం ముగించి ఆహారం తీసుకుంది. వ్రతం భంగమవడంతో ఫలితం దక్కలేదు. సునామ స్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే వ్రతం చేసినా దేవి తనను కరుణిం చలేదని నిరాశ చెందిన సునామ అంతఃపురాన్ని వీడి అడవుల బాటపట్టింది. అక్కడ ప్రాణాలు వదలాలని నిశ్చయించుకుంది. ఆమె కృత కృత నిశ్చయానికి అబ్బురపడిన గౌరీశంకరులు వృద్ధుల రూపంలో వచ్చి సునామ సోదరుడు చేసిన తప్పిదాన్ని చెప్పి మళ్ళీ వ్రతం చేయమని చెప్పారు. ఆ వృద్ధులను పార్వతీ పరమేశ్వరులుగా భావించిన సునామ మరోమారు వ్రతాన్ని చేసింది. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందిన సునామకు కరివీరుడనే ఉత్తమునితో వివాహం జరిగింది. గౌరీ కృపతో ఆ దంపతులు సత్సంతానాన్ని పొంది సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో జీవించారు. అట్లతదియ నోమును సువాసినులు పదేళ్ళ పాటు ప్రతి ఏడాది నిర్వహించి ఆ తర్వాత ఉద్యాపనం చెప్పుకోవాలి. పది మంది ముత్తయిదువలకి నల్లపూసల తాడు, లక్క జోళ్ళు, రవికలబట్టలు, దక్షిణ తాంబూలాలతో పదేసి అట్లు వాయనంగా ఇచ్చి ఆశీస్సులు పొందాలి. ఇలా ఉద్యాపనం చేసిన అతివలు సంసారంలో సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని పురాణ కథనం. అట్ల తద్ది నోములో ఎన్నో జ్యోతిష, వైద్య, విజ్ఞాన శాస్త్ర రహస్యాలు ఇమిడి ఉన్నాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా కుజుడు అట్ల ప్రియుడంటారు. అట్లు నివేదించడం వల్ల కుజ దోషం తొలగుతుంది. స్త్రీలలో రజోదయానికి కారకుడు కుజుడే. అందువల్ల ఈ వ్రతంతో సంతోషించి అతను ఋతు సంబంధ సమస్యల నుంచి రక్షిస్తాడు. ఇక ఆయుర్వేదాన్ని అనుసరించి అట్లు చేయడానికి బియ్యం, మినుములు వాడతారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. వీటితో తయారైన అట్లు నివేదించి వాయనం ఇవ్వడం చేత ఈ రెండు గ్రహాలు సంతుష్టులై స్త్రీలకు గర్భస్రావాలు వంటివి జరగ కుండా సుఖంగా ప్రసవం జరిగేలా చూస్తాడు. ఇంతటి మహత్వపూర్వమైన అట్లతద్ది నోములోగల అంతరార్థాన్ని గ్రహించి అతివలందరూ ఆచరించగలిగితే శుభం కలుగుతుంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
8 likes
7 shares
PSV APPARAO
699 views 9 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *శరత్ పూర్ణిమ* విజయదశమి తరవాత వచ్చేది- శరత్ పూర్ణిమ. ఇది ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని విశేషంగా పూజి స్తారు. మహిళలు వ్రతం ఆచరిస్తారు. శార దాదేవిని ఆరాధిస్తారు కాబట్టి, దీన్ని 'శారదా పూర్ణిమ' అని పిలుస్తారు. ఇదే పూర్ణిమ నాటి రాత్రి లక్ష్మీదేవి భువిలోని ఇళ్లకు వెళ్తుందని, తలుపు తట్టి 'రాత్రివేళ కొబ్బరి నీరు మాత్రమే సేవించి మేలుకొన్నదెవరు' అని ప్రశ్నిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 'కో జాగర్'- అంటే, 'మేలుకొన్నదెవరు' అని అర్థం. అటువంటి స్త్రీలు గల ఇంట్లోకి దేవి ప్రవేశించి, సకల సంపదలూ అనుగ్రహిస్తుందని భక్తకోటి నమ్ముతుంది. లక్ష్మికి వాహనం- పైడికంటి పక్షి. ఆ చల్లని తల్లి చేతిలో గవ్వల భరిణ ఉంటుందట. బియ్యం ఆమెకు ఎంతో ఇష్టమని చెబుతారు. అందుకే బెల్లం పాయసాన్ని దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. గవ్వలు అంటే, దేవి చేతిలోని నాణేలు! సముద్రం నుంచి ఆవిర్భవించడం వల్ల, సహజంగానే ఆమె చేతిలో గవ్వలుంటాయి. అవి సిరిసం పదలకు సంకేతాలన్న భావన లోకంలో నెలకొని ఉంది. దేవికి అటుకులు, కొబ్బరి అత్యంత ప్రీతికర మైనవి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మహి ళలు బియ్యపు పిండిని ముద్దలుగా చేసి, ఇంటి ద్వారాల వద్ద ఉంచుతారు. ఇంటి గోడల మీద ఆ తల్లి పాదముద్రలు, శంఖాల బొమ్మలు, పైడికంటి పిట్టల చిత్రాలు వేస్తారు. గవ్వలాడుతూ, పాటలు పాడుకుంటూ, లక్ష్మిని ఆహ్వా నిస్తూ రాత్రంతా తదేక చిత్తంతో జాగారం చేస్తారు. భక్తులు కొబ్బరినీరు మాత్రమే తీసుకుంటారు. వారు సంధ్యాసమయం నుంచి శంఖనాదం చేస్తుంటారు. ఆశ్వయుజ పూర్ణిమ వ్రత కథ 'భవిష్యో త్తర పురాణం'లో వివరంగా ఉంది. నియమ నిష్ఠలు కలిగిన వ్రతం ఇది. పార్వతికి వని తలు షోడశోపచార పూజలు చేస్తారు. అరి సెలు, అప్పాలతో పాటు కూరలు, అన్నం సిద్ధపరుస్తారు. ఆ తల్లితో పాటు నందికేశ్వర ప్రతిమలు ఉంచుతారు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంకేతంలా 'చతుర్భుజ'గా మహే శ్వరిని భావించి అర్చిస్తారు. నైవేద్యం, తాంబూలం, హారతి, ప్రదక్షిణ ముగిసిన అనంతరం- విగ్రహాన్ని జలంలో నిమజ్జనం చేయడం తరతరాల సంప్రదాయం. వ్రత విధానాన్ని సాక్షాత్తు పరమేశ్వరే ఉప దేశించిందని పురాణ గాథలు చెబుతాయి. మగధ రాజ్య నివాసి వలితుడు భాగ్య వంతుడు కావడానికి, భార్యాసమేతంగా నిశ్చిం తగా కాలం గడపడానికి అపార భక్తిశ్రద్దలే కారణమని అవి వివరిస్తాయి. శ్రీమహాలక్ష్మి కృపా కిరణాలు సదా తమపై ప్రసరించాలని భక్తజనులు త్రికరణ శుద్ధిగా కోరుకుంటారు. ఆమె నామ శబ్దాన్ని వేదవి హితంగా, అనంత సంపదకు పర్యాయ పదంగా వారు సర్వదా తలచుకుంటారు. ఈ పండుగను మహారాష్ట్ర మహిళలు మహోత్సాహంగా జరుపుతారు. వెన్నెల రాత్రి ఆహారంగా పాలలో నానబెట్టిన అటుకుల్ని స్వీకరిస్తారు. పంచదార, కుంకుమ పువ్వు వేసి క్షీరాన్నం వండుతారు. ఆ పాయస పాత్రను బయట వెన్నెలలో ఉంచడం వల్ల, సహజసిద్ధంగానే చంద్రకిరణాల అమృత శక్తి ప్రసరి స్తుందని అనేకులు నమ్ముతారు. ఈ వ్రతాచరణ విధానం కాలక్రమంలో మహారాష్ట్ర నుంచి అన్ని రాష్ట్రాలకూ విస్తరిం చింది. ఇంటింటా సిరులు కురిపించే నిండైన పున్నమి వెన్నెల వేళగా దీన్ని తెలుగువారు పరిగణిస్తారు. సాయంకాలం ప్రారంభమయ్యే పండుగ సందర్భంగా, తల్లి తన బిడ్డలకు కొత్త వస్త్రాలిస్తుంది. దేవ వైద్యులైన అశ్వని పరిరక్షణలో పిల్లలందరూ చల్లగా ఉండాలని మాతృమూర్తి ఆశిస్తుంది. అలాగే, ఈ శుభసమయంలో నారదీయ పురాణ గ్రంథాన్ని దానం చేస్తే మరెన్నో ఉత్తమ ఫలి తాలు కలుగుతాయన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం! *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
10 shares
PSV APPARAO
865 views 9 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *కౌముది లక్ష్మీ వ్రతం* ప్రతి మాసంలోను పౌర్ణమికి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే ప్రపూజలు, వ్రతాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేసే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలు ఇస్తుందని పురాణ వచనం. ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తే, పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరిసంపదలను ప్రసాదిస్తుందని చెబుతారు. ఆశ్వయుజ పౌర్ణమిని 'కౌముది' పౌర్ణమి అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతం ఆచరించి జాగరణ చేయడం వలన, ఆశించిన ఫలితాలు శీఘ్రంగా అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, తన వ్రతం ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్య్ర బాధలు తొలగిపోయి. సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున ఆ తల్లిని పూజిస్తూ, సేనిస్తూ ఉండాలని పండితులు చెబుతారు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
15 likes
14 shares