Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Family Traditions and ethics
13 Posts • 1K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
843 views 2 months ago
అన్నదానం ఎందుకు గొప్పది...........!! మన సమాజంలో అనేక రకాల దానాలు ఉన్నాయి - రక్తదానం, అవయవదానం, నేత్రదానం, భూదానం, వస్త్రదానం వంటివి. వీటన్నింటిలో అన్నదానం అన్నిటికంటే విశేషమైనదిగా హిందూ సంప్రదాయం చెబుతుంది. దీని వెనుక అనేక కారణాలున్నాయి. 1. సంపూర్ణ సంతృప్తిని కలిగించేది:..... మనం ఏ దానం చేసినా, అది తీసుకునేవారికి తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకు, డబ్బు దానం చేస్తే ఇంకా కావాలనిపించవచ్చు. కానీ, అన్నదానంలో మాత్రమే, భోజనం చేసిన వ్యక్తి "ఇంక చాలు" అని సంపూర్ణ సంతృప్తితో చెప్పగలడు. ఈ సంతృప్తి మరే ఇతర దానంతోనూ సాధ్యం కాదు. ఒక మనిషి కడుపు నింపినప్పుడు, ఆ వ్యక్తికి కలిగే తృప్తి, దానం చేసేవారికి ఆత్మసంతృప్తినిస్తుంది. 2. అన్నం లేనిదే జీవం లేదు:........ ఈ భూమిపై ఏ జీవి అయినా అన్నం లేనిదే జీవించలేదు. అన్నం అనేది ప్రాణాధారం. మనకు ప్రతిరోజూ ఆహారం లభించడం అనేది సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. ఆ అమ్మవారిని నిత్యం పూజించేవారికి, అన్నం లేని లోటు ఉండదు. అందుకే, భోజనం చేసేటప్పుడు ఆ తల్లిని తలుచుకుని, మనతో పాటు ఈ లోకంలో ఉన్న అన్ని జీవులకు ఆహారం లభించాలని కోరుకోవాలి. 3. అన్నదానం - కోటి గోవుల దానంతో సమానం:...... మన పురాణాలలో, అన్నదానం యొక్క గొప్పతనాన్ని గురించి విస్తృతంగా వివరించారు. "దానాలన్నింటిలో అన్నదానం గొప్పది" అని పండితులు చెబుతారు. అన్నదానం చేయడం అనేది కోటి గోవుల దానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే మన పూర్వీకులు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి ఆచరించేవారు. 4. మోక్ష సాధనకు సులభమైన మార్గం:...... త్రేతాయుగం, ద్వాపరయుగాలలో యజ్ఞాలు, తపస్సులు చేయడం ద్వారా ప్రజలు మోక్షం పొందేవారు. కానీ, కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామస్మరణ వంటి వాటి ద్వారా సులభంగా మోక్షాన్ని పొందవచ్చని పండితులు చెబుతారు. ఈ దానాలలో కూడా, నిస్వార్థంగా అన్నదానం చేయడం అనేది మోక్షానికి ఒక సులభమైన మార్గం. 5. నిస్వార్థ సేవకు ప్రతీక:........ దానం చేసేటప్పుడు మనసులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు. జలదానం, వస్త్రదానం, భూదానం వంటివి గొప్పవే అయినా, అన్నదానం మాత్రమే ఆకలితో ఉన్న వ్యక్తికి పూర్తి ఉపశమనాన్ని ఇస్తుంది. పురాణాలలో కర్ణుడు, బలిచక్రవర్తి వంటి వారు భగవంతుడికి కూడా అన్నదానం చేసి మోక్షం పొందారని చెప్పబడింది. 6. దానగుణం లేకపోతే మోక్షం లేదు:........ ఎవరికైతే దానగుణం ఉండదో, అలాంటి వారికి మోక్షం లభించదని శాస్త్రాలు చెబుతాయి. అన్నదానం అనేది ఆకలితో ఉన్న పేదలకు, అనాథలకు, రోగులకు, వికలాంగులకు సహాయం చేసే ఒక గొప్ప అవకాశం. ఈ దానం చేసేటప్పుడు ఎటువంటి పక్షపాతం లేదా మత భేదం చూపకుండా అందరికీ సమానంగా అన్నం పెట్టాలి. మనకు వీలైనంత మేరకు ఆకలితో ఉన్నవారికి సహాయం చేద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా గౌరవిద్దాం. ఆకలితో ఉన్న వారి కడుపు నింపి, పుణ్యాన్ని పొందుదాం. #తెలుసుకుందాం #Traditions #Family Traditions and ethics #హిందూసాంప్రదాయాలు
11 likes
6 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
849 views 2 months ago
🏵️🍃🏵️🍃🏵️🍃🏵️🍃🏵️ *🚩ఒడిబియ్యం అంటే ఏమిటి ?* 🚩 *-{ 🌈ఒడి బియ్యం తెలుగు* *సంస్కృతికే మకుటం🌈 }-* *🚩🌈ప్రతి మనిషిలో (అన్ని మతాలవాళ్ళకు కూడ) వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు*. *🍇🌈ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం పోయటమన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి*. *🚩This is nothing but alerting Mahalakshmi inside the girl🚩*. *🚩అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ*. *🚩🌴ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లులు చేసే సంకల్ప పూజ మాత్రమే*. *🌹🍃సంతోషంతో ఆ మహాలక్ష్మి (ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్ళకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాద్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను (ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది*. " *🚩ఒడి బియ్యం🚩 😗 *🏵️వలసెల్లిపోయినా గట్టుకూలిపోయినా తల్లిగారి బియ్యం తన్నుకురావల్సిందే ! అయిదేండ్లకోసారి సారె మళ్ళాల్సిందే > పసుపుబువ్వ దావత్ తో తాంబూలాలియ్యాల్సిందే*..! *🍇శ్రీ మంతులకైనా నిరుపేదలకైనా ఒడినిండా బియ్యం సంతానానికి ప్రతీక. సౌభాగ్యానికి కొనసాగింపు > భర్త అలిగితే తొడమీదనే బట్టలు పెట్టుకొచ్చుకునే తెగింపు.. ఆడబిడ్డలకందరికి అతిపెద్ద సామాజిక గౌరవం*. *🫐🚩ఐదు సేర్లు, ఐదు దోసిళ్ళు ఐదు పిడికిళ్శు, ఐదు చారల బియ్యం, ఐదు తమలపాకులు, ఐదు పోకలు, ఐదు పసుపుకొమ్ములు, ఐదు ఎల్లిగడ్డలు ఐదు కర్జూరాలు, ఐదు దానిమ్మలు‌‌, రూపాయిబిళ్ళలైదు పంచశిలా ఒప్పందంలా పంచభూతాల కలయికలా ఐదుగురు ముత్తైదువలు పసుపు కుంకుమలతో అలంకరణ.* *🍇బియ్యం పడిపోతే బతుకే కూలినట్లు విచారం > గోదావరి వంతెన కూలి రాజ్యకిరీటం ముక్కలైనట్లు అవమానం > ఏ కార్యంల బొట్టుపెట్టనియ్యరు మందిల కలువనియ్యరు > పందిరి గుంజ పట్టుకొని పండ్లిగిలియ్యాల్సిందే !,* *🍇చెరువు నిండితే ఊరుకెంత సంబరమో > బిడ్డకు ఒడి నింపితే తల్లికంత ఆనందం > అన్నా చెల్లెండ్లు అక్కా తమ్ముండ్లు అనురాగాలు అనుబంధాల్ని దుసరితీగ సిబ్బిలా తరతరాలుగా ముడేసే ఒడి బియ్యం తెలుగు సంస్కృతికే మకుటం*. 🍃🌈🍃🌈🍃🌈🍃🌈🍃 #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #Traditions #Family Traditions and ethics
15 likes
10 shares