⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️
141 Posts • 87K views
1. *మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం*.. ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం.. భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..! 2. *జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం*. ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (*వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం*) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి) 3. *ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం*.. ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...! 4. *తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం*.. ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...! 5. *బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం*.. ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..! 6. *బఫే భోజనాలు*.. ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.! 7. *వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం*.. ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..! ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి.... *అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు*. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సం.ల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ.. 🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏 #తెలుసుకుందాం #😃మంచి మాటలు #💗నా మనస్సు లోని మాట #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️
13 likes
16 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
757 views 1 months ago
✨🪔 దీపం (Deepam) అంటే వెలుగు, జ్యోతి. హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించడం పవిత్రమైన ఆచారం. దీపం వెలిగించే ప్రాధాన్యం: 1. అజ్ఞానాన్ని తొలగిస్తుంది – చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం. దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుందని నమ్మకం. 2. దేవతలకు ప్రీతికరం – ఇంట్లో దీపం వెలిగిస్తే సౌభాగ్యం, శాంతి, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. 3. శుభప్రదం – ఇంట్లోని నెగటివ్ శక్తులు తొలగి పాజిటివ్ శక్తులు పెరుగుతాయి. 4. పంచభూత శుద్ధి – దీపం లోని అగ్ని తత్త్వం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం పూజ సమయం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పండుగలు, శుభకార్యాలు, వ్రతాలు ఏ నూనెతో వెలిగించాలి? నువ్వుల నూనె – శ్రేయస్సు, పాప పరిహారం గొంగూర/ఆవ నూనె – చెడు శక్తులను తొలగించుటకు నెయ్యి – ప్రత్యేక పూజల్లో దేవతలకు ప్రీతికరం దీపం రకాలు: ఆకుపచ్చ (తులసి ముందర దీపం) – ఆరోగ్యానికి రెండు వత్తులు – కుటుంబ ఐక్యతకు ఐదు వత్తులు – ఐశ్వర్యానికి ఒక వత్తి దీపం – శాంతికి --- 🪔 దీపం వెలిగించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం
13 likes
14 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
650 views 1 months ago
సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. ఆదివారం.:🙏 ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం.:🙏 దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం.:🙏 శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం. :🙏 నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది. గురువారం.:🙏 గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం.🙏 లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి. శనివారం.:🙏 సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.🙏 #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #rituals
9 likes
16 shares