#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం🙏 #అట్లతద్ది #అట్ల తదియ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
*సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం*
'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే. జీవితాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
భారతీయ వైదిక సంస్కృతిలో నోములకు, వ్రతాలకు ప్రత్యేక స్థానముంది. ఇవి వనితల కోసం నిర్దేశింపబడినవి. అయితే అవి వారి కొసమేననే అభిప్రాయానికి రాకూడదు. ఆయా నోములు, వ్రతాల ఫలాలు ఇంటిల్లిపాదికీ అందుతాయి. అటువంటి వాటిలో ఆశ్వయుజ బహుళ తదియ నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించే అట్ల తదియ ఒకటి.
'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే, జీవి తాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వ ర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
సకల సౌభాగ్య ప్రదాత్రి అయిన గౌరీ దేవి ఈ నోముకు అధిష్ఠాత్రి. అశ్వీయుజ బహుళ తదియ నాడు చంద్రోదయమైన తర్వాత గౌరీదేవిని ప్రతిష్ఠించి, పూజించి మినుములు, బియ్యం కలిపి విసిరి ఆ పిండితో అట్లను చేసి గౌరీ దేవికి నివేదించి ముత్తయిదువులను గౌరిగా భావించి, అలంకరణ చేసి, పది ఫలాలను, పది అట్లను రవికల బట్టతో వాయనంగా అందించి ఆశీస్సులందుకోవడం ఈ నోములోని విశేషం. ఆహూతులైన సువాసినులకు ప్రసా దంగా ఫలపుష్పాదులతో సహా ఇచ్చి ఆశీస్సులందుకోవాలి. ఆపై నోముకు సంబంధించి కథ చెప్పుకుని అక్షతలు దేవిపై, తనపై వేసుకుని వ్రత సమాప్తి చేయాలి. పరమ శివుని పతిగా పొందాలనే లక్ష్యంతో పార్వతి తపస్సు చేస్తున్న సమయంలో త్రిలోక సంచారి అయిన నారదుడు ఆమె మనోరథ సిద్ధికై ఈ నోమును చెప్పాడని పురాణ వచనం. ఆ విధంగా ఈ నోము చేయించడంతో ఆమె కోరిక తీరింది. ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో నిర్వహిస్తారు. కనుక దీనిని చంద్రో దయ గౌరీ వ్రతంగా పిలుస్తారు. చంద్రోదయ వ్రతం ఆచరించి రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని భర్తగా పొందిందని శ్రీమద్భాగవతం ఉటంకిస్తోంది.
*వ్రత విధానం*
ఆశ్వీయుజ తదియ నాడు వేకువజామునే లేచి వ్రతులై గౌరిని పూజించాలి. రోజంతా ఉపవసించాలి. అవకాశం లేని వారు పక్వాహారం కాకుండా ఫలాలను ఆరగించవచ్చు. పాలు తాగవచ్చు, తాంబూలం కూడా సేవించవచ్చు. రోజంతా పిన్నలు, పెద్దలు కలిసి ఆటపాటలతో ఆనందంగా గడపాలని, ఊయలలూగడం వంటివి చేసి రోజంతా సంతోషంగా ఉండా లని వ్రత విధానం చెబుతోంది.
కథ
ఒకప్పుడు పాటలీ పుత్రాన్ని ఏలే మహారాజుకు సునామ అనే కుమార్తె ఉండేది. అందచందాలలో ఆమె సాటిలేనిది. అయితే ఆమెకు ఎంత ప్రయత్నించినా వివాహం కాలేదు. తన చెలికత్తెలందరికీ వివాహాలైవారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం ఆమెను కుంగదీసింది. గౌరి అంటే ఎంతో భక్తి కలిగిన ఆమె తన బాధను దేవి కూడా పట్టించుకోవటంలేదని గౌరీ ఆలయానికి వెళ్ళి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఇంతలో చంద్రోదయ వ్రతాన్ని ఆచరిస్తే సలక్షణుడైన వ్యక్తితో వివాహం జరుగుతుందని, వ్రత విధి విధానాలను తెలియజేస్తూ ఒక వాణి వినిపించింది. సునామ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుని ఇంటికి చేరింది. తాను దేవాలయంలో విన్న విధంగా చంద్రదోయ వ్రతాన్ని నిర్వర్తించడానికి సంకల్పిం చింది. ఆశ్వయుజ తదియనాడు రాకుమారి సునామ వ్రతదీక్ష పూనింది. అయితే చంద్రోదయం వరకూ ఆమె ఉపవాసం ఉండడం కష్టమని ఆమె ఆ కఠిన నిబంధనలను పాటించలేదని భావించి ఆమెపై ప్రేమతో ఆమె సోదరుడు కొద్దిగా చీకటి పడుతున్న వేళ ఆమె పూజ చేస్తున్న ప్రాంగణంలో ఒక వృక్షా నికి పెద్ద అద్దం వేలాడదీయించి, దానికి ఎదురుగా ఒక గడ్డి వాము నుంచి దానిని కాల్పించాడు. కాలుతున్న గడ్డివాము కాంతి ఆ అద్దంలో చంద్రోదయ మనట్టు కనిపించేలా ఏర్పాటు చేశాడు. అనంతరం చెల్లెలితో చంద్రోదయమైందని నమ్మ బలికాడు. దానితో ఆమె చంద్రోదయం కాకుండానే వ్రతం ముగించి ఆహారం తీసుకుంది. వ్రతం భంగమవడంతో ఫలితం దక్కలేదు. సునామ స్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే వ్రతం చేసినా దేవి తనను కరుణిం చలేదని నిరాశ చెందిన సునామ అంతఃపురాన్ని వీడి అడవుల బాటపట్టింది. అక్కడ ప్రాణాలు వదలాలని నిశ్చయించుకుంది. ఆమె కృత కృత నిశ్చయానికి అబ్బురపడిన గౌరీశంకరులు వృద్ధుల రూపంలో వచ్చి సునామ సోదరుడు చేసిన తప్పిదాన్ని చెప్పి మళ్ళీ వ్రతం చేయమని చెప్పారు. ఆ వృద్ధులను పార్వతీ పరమేశ్వరులుగా భావించిన సునామ మరోమారు వ్రతాన్ని చేసింది. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందిన సునామకు కరివీరుడనే ఉత్తమునితో వివాహం జరిగింది. గౌరీ కృపతో ఆ దంపతులు సత్సంతానాన్ని పొంది సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో జీవించారు.
అట్లతదియ నోమును సువాసినులు పదేళ్ళ పాటు ప్రతి ఏడాది నిర్వహించి ఆ తర్వాత ఉద్యాపనం చెప్పుకోవాలి. పది మంది ముత్తయిదువలకి నల్లపూసల తాడు, లక్క జోళ్ళు, రవికలబట్టలు, దక్షిణ తాంబూలాలతో పదేసి అట్లు వాయనంగా ఇచ్చి ఆశీస్సులు పొందాలి. ఇలా ఉద్యాపనం చేసిన అతివలు సంసారంలో సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని పురాణ కథనం.
అట్ల తద్ది నోములో ఎన్నో జ్యోతిష, వైద్య, విజ్ఞాన శాస్త్ర రహస్యాలు ఇమిడి ఉన్నాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా కుజుడు అట్ల ప్రియుడంటారు. అట్లు నివేదించడం వల్ల కుజ దోషం తొలగుతుంది. స్త్రీలలో రజోదయానికి కారకుడు కుజుడే. అందువల్ల ఈ వ్రతంతో సంతోషించి అతను ఋతు సంబంధ సమస్యల నుంచి రక్షిస్తాడు. ఇక ఆయుర్వేదాన్ని అనుసరించి అట్లు చేయడానికి బియ్యం, మినుములు వాడతారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. వీటితో తయారైన అట్లు నివేదించి వాయనం ఇవ్వడం చేత ఈ రెండు గ్రహాలు సంతుష్టులై స్త్రీలకు గర్భస్రావాలు వంటివి జరగ కుండా సుఖంగా ప్రసవం జరిగేలా చూస్తాడు.
ఇంతటి మహత్వపూర్వమైన అట్లతద్ది నోములోగల అంతరార్థాన్ని గ్రహించి అతివలందరూ ఆచరించగలిగితే శుభం కలుగుతుంది.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*