Failed to fetch language order
Failed to fetch language order
ఖలేజా..
4 Posts • 460 views
P.Venkateswara Rao
7K views 4 months ago
#🎬మూవీ ముచ్చట్లు #ఖలేజా.. *పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…❗* May 24, 2025💃 [[ Ashok Pothraj ]] ….. “కాటుక నల్లని రాతిరి వేళ గురువుల ఆజ్ఞతో గురుతునెరెంగితి, ఉత్తర దిక్కున ఊరును విడిచితి, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి అడవులు దాటితి మడుగుల దాటితి అన్నీ దాటితి, బొటనవేలితో నెత్తురుపొంగగ పులుపుగ నుదుట విభూతి దరించితి, అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు సెలవుతో మడివస్త్రంబులు కట్టితి, మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడై శతృవుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం నిరుప దృవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐఖ్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివా”..! వ్వాటే కంటిన్యుటి డైలాగ్ అన్నా shafi moin హ్యాట్సాఫ్ టు యూ … “ఖలేజా” ఓ సినిమా మాత్రమే కాదు, ఒక సందేశం. ఇది దేవుడిని వెలుపల వెతకకుండా, మనలోనే దేవుడిని చూసుకోమంటుంది. విడుదల సమయంలో అర్థం కాని సినిమా, నేడు కాలాన్ని దాటి మన మనసుల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించింది. తెలుగుసినిమాల్లో కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్‌కి, తాత్వికతకి సరిచూసే సమతౌల్యాన్ని అందించిన చిత్రం “ఖలేజా”. ట్రెడిషనల్ హీరోయిజాన్ని ఓ ఫిలాసఫికల్ కోణంతో మిళితం చేసి, ప్రజలలో మానవత్వాన్ని వెలికితీసే ఈ సినిమా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో కొలువు తీరింది. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు విడుదల సమయంలో అంతగా వర్కవుట్ కాకపోయినా, తరువాత కాలంలో కల్ట్ క్లాసిక్‌గా మారతాయి. అలాంటి చిత్రాల్లో “ఖలేజా” ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2010లో విడుదలైన ఈ సినిమా ట్రెడిషనల్ కమర్షియల్ మసాలాల నుంచి పూర్తి భిన్నంగా, ఒక లోతైన సందేశానికి వినోదం మేళవించి చూపుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా. ఓ ఊహాజనిత కాన్సెప్ట్‌ను తీసుకుని, ప్రేక్షకుడి హృదయాన్ని తాకే విధంగా చెప్పారు. ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎలా ఓ గ్రామానికి దేవుడిలా మారుతాడన్న కథ వినడానికి సింపుల్‌గా అనిపించినా, దీనిలో దాగి ఉన్న తాత్వికత ఎంతో లోతైనది. మహేష్ బాబు పాత్ర మొదట తనను తాను మామూలు మనిషిగా భావిస్తాడు. కానీ పరిస్థితులు అతన్ని ఓ ‘దైవదూత’గా మార్చేస్తాయి. సినిమా యొక్క మెయిన్ థీమ్ “మనిషే దేవుడు” అనే మెసేజ్, ప్రతి సన్నివేశంలో కూడా సున్నితంగా వ్యక్తమవుతుంది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో డైలాగ్స్ ఎప్పుడూ ప్రత్యేకం. కానీ.. ఖలేజాలో డైలాగ్స్‌లోని ఫైర్, ఫిలాసఫీ, ఫన్ ఈ మూడింటి మేళవింపు ఈ సినిమాని మ‌ళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి. “ఈ లోకంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరకదు… కానీ ప్రతి సమస్యకు నిలబడే మనిషి దొరుకుతాడు.” ఈ ఒక్క డైలాగ్‌నే కాదు, చాలా సందర్భాల్లో మనసును హత్తుకునే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఇక్కడ విలనిజం వ్యక్తిగా కాకుండా, వ్యవస్థగా కనిపిస్తుంది. పల్లెటూరి ప్రజలు మూఢనమ్మకాలతో బ్రతుకుతుండగా, కార్పొరేట్ ప్రభావం, అసమానతలు వారి జీవితాలను నాశనం చేస్తున్న తీరు సినిమాకు బలమైన బేస్ ఇచ్చింది. మణిశర్మ గారి సంగీతం ఈ సినిమాకు మరో వరం. “ఓం నమో శివ రుద్రాయా” “పిలిచే పెదవుల పైనా” వంటి పాటలు కథకు లోతునిచ్చాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే, కీలక సన్నివేశాల్లో హై ఎమోషన్‌ను తెచ్చింది. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇది మహేష్ బాబు కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్. ఆయన కామెడీ టైమింగ్, ఇంటెన్స్ డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మోస్తున్న తీరు ప్రేక్షకులను అలరించింది. కానీ..! అంత క్లాస్ ఇమేజ్ హీరో ఇలాంటి విచిత్రమైన సబ్జెక్ట్ టేకింగ్ చేయడం అప్పట్లో ఆడియన్స్ కు మింగుడు పడలేదు. ఆ తర్వాత జెమిని టీవీలో నిరంతరంగా ఈ సినిమాను ప్రదర్శించడం వలన మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. మనోడిలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని ఆశ్చర్య పోయారు. అనవసరంగా ఈ సినిమాని థియేటర్లలో పక్కన పెట్టేసామని ఇప్పటికీ కొంతమంది ప్రేక్షకులు వాపోతుంటారు. ఇందులోని కొన్ని డైలాగ్స్ “మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు… కానీ ఎలా చస్తాడన్నదే ముఖ్యం!” “ఇక్కడ సమస్యలేం లేవ్ సార్… సమస్యల్లోనే మనుషులు ఉన్నారు” “పేదవాడికి నువ్విచ్చే భరోసా ఓదార్పు, అది ఇస్తే అతనికి లక్ష కోట్లు ఇచ్చినట్టే!” త్రివిక్రమ్ తన స్టైల్‌లో కామెడీని ఎమోషన్‌తో మిళితం చేశారు. “పైనున్న వాడు నాకు డైరెక్షన్ ఇచ్చాడు… నేనిక్కడ ఆ స్టోరీ డెవలప్ చేస్తున్నాను. “ఛీ దీనెమ్మ బురదలో పందీ బతుకుతుంది నువ్వూ బతుకుతున్నావ్ ఎందుకురా నీకీ ఎదవ జన్మ” “అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు”. ” ఏం జరిగింది గురూజీ..? అది గోలేసింది నువ్వొదిలేసావ్” .. “ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి భయ్యా.” ” ఆ కాయలోని గింజను తీసి భూమిలో నాటితే మొక్క మొలకెత్తుతుంది సామీ.. మీకిందులో గింజ కనబడుతుంది నాకేమో చెట్టు కనబడుతుంది”. ” దేవుడి డెఫినేషన్ అర్థమైంది భయ్యా.. అతనెక్కడో ఉండడు, నీలోనూ నాలోనూ ఇక్క‌డే మనలోనే ఉంటాడు”. ” వినపడక అడుగుతున్నావా..? అర్థంకాక అడుగుతున్నావా..? తెలియక అడుగుతున్నా..! కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది”. ” మనిషిది కోరిక నీది శాసనం అనుకో సామీ ఐపోతుంది ” ఇలాంటి డైలాగులు కథను బలంగా ముందుకు నడిపించడమే కాదు, ఓ జ్ఞానం గోడపట్టున నిలబెడతాయి. యాక్షన్ సీన్లు మామూలుగా కాకుండా, ఓ తాత్విక సంకేతాలుగా నిలుస్తాయి. ఈ సినిమా నేను లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటాను. అసలు బోర్ అనేదే రాదు. ఆ ఫస్టాఫ్ లో ఉన్న ఫన్ జనరేటర్ మామూలు టైమింగ్ కాదసలు. నిజంగా ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అంటే ఇప్పుడు ఎవరూ నమ్మరు. ఈ నెల 30వ తేదీన మళ్ళీ రీరిలీజ్ అవుతుంది……
65 likes
66 shares