శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏
11 Posts • 40K views
PSV APPARAO
45K views 17 days ago
#శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 బెజవాడ ఇంద్రకీలాద్రి శారదా నవరాత్రులు ఐదవ రోజు: అమ్మవారి అలంకారం శ్రీమహాలక్ష్మీదేవి గా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి 🙏🏼 రూపం: రెండు కమలాలను చేతుల్లో ధరించి, అభయ వరద హస్తముద్రలో దర్శనమిస్తుంది. వెనుకనుంచి గజరాజు సేవ. అష్టలక్ష్ముల సమష్టి రూపంగా మహాలక్ష్మీ. క్షీరాబ్ధి పుత్రిక, డోలాసురుడిని సంహరించిన శక్తి మధ్యస్థరూపం. పురాణవివరణ: అమ్మను పూజిస్తే సర్వమంగళ ఫలాలు, ఐశ్వర్యం, శుభప్రదం అవుతుంది. చండీసప్తశతిలో: “యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా” → అన్ని జీవులలో లక్ష్మీ రూపం దుర్గాదేవి అని సూచిస్తుంది. నైవేద్యం: వడపప్పు, క్షీరాన్నం స్తోత్రం: *శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం క్లీం బీజంతో పఠించటం శ్రేయస్కరమ్. ప్రత్యక్షదేవతా ఫలాలు: దారిద్ర్య నాశనం, ఐశ్వర్యప్రాప్తి, సర్వసుఖ సంపత్తి. ప్రతిదినం పఠించటం ద్వారా సర్వం శాంతి, శ్రేయస్సు, భోగసౌభాగ్యం లభిస్తుంది. ధ్యానం సూచన: పద్మకరాం, ప్రసన్నవదనాం, హస్తాభ్యాం భక్తప్రదాం అని ద్యానము. కమల, చంద్రవదన, చతుర్భుజ రూపాలను కల్పనచేత ప్రతిబింబించవచ్చు. ప్రార్ధన: త్రికాలం జపం చేయుట ద్వారా భోగసౌభాగ్యాలు, కోటిజన్మ సంపదలు. భృగువార పఠనం ద్వారా కుబేర సంపత్తి, దారిద్ర్యమోచనం.
220 likes
1 comment 298 shares
PSV APPARAO
663 views 14 days ago
#మూలా నక్షత్రం - సరస్వతీదేవి అలంకారం #📖శ్రీ సరస్వతి దేవి🎶 #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఇంద్రకీలాద్రి - విజయవాడ 🕉️🙏 ఈరోజు ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణ........ సరస్వతీ దేవి చరిత్ర....... చదువుల తల్లి దేవనాగరి: సరస్వతీ తెలుగు: సరస్వతీ దేవి వాహనం: హంస , నెమలి హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. *“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల* *కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”* నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”. పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు..... పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి.... ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః (10) ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతక నాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః (20) ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః (30) ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖావిభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకార భూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః (40) ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః (50) ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః (60) ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః ఓం విశాలాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః (70) ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః (80) ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః (90) ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం రక్త మధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100) ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108) ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం. #namashivaya777
10 likes
9 shares
PSV APPARAO
739 views 15 days ago
#కాళరాత్రి - అమ్మవారి ఏడవ అవతారం #శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
7 likes
9 shares