తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁
158 Posts • 26K views
P.Venkateswara Rao
548 views 6 days ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 #నూతన మద్యం పాలసీ⁉️ *మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..‼️* October 13, 2025🍺🍻🥂 మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదోరకంగా ప్రభుత్వాన్ని, పార్టీని గోకడానికే ప్రయత్నిస్తున్నాడు… తన నియోజకవర్గం తెలంగాణలో భాగమేననీ, అక్కడ కూడా ప్రభుత్వ పాలసీలు వర్తిస్తాయనీ, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మునుగోడుకు తాను సీఎం కాననీ మరిచిపోతున్నాడు… తనేం అంటున్నాడంటే..? మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ (Wine Shops ) టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశాడు… షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించాడు… మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశాడు… వైన్ షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నాడు… ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్‌లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నాడు… ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్‌ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నాడు… స్థూలంగా గమనిస్తే ఎమ్మెల్యే పెట్టే ఆంక్షలు, షరతులు ఆమోదయోగ్యం అనిపిస్తాయి… సమాజహితం అనిపిస్తాయి… కానీ తను అధికార పార్టీ ఎమ్మెల్యే… నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ పాలసీతో సంబంధం లేదనీ, ఇవి నా షరతులు అని ఎలా అంటాడు..? మునుగోడుకు ఏమైనా స్వయంప్రతిపత్తి ఉందా..? అక్కడ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే చెప్పిందే శాసనమా..? రేప్పొద్దున ఇంకా ఇతరత్రా అన్ని విషయాల్లో కూడా వేరే ఎమ్మెల్యేలు ఇలాగే సొంత పాలసీలను, షరతులను ప్రవేశపెడితే… ఇక ప్రభుత్వాలు దేనికి..? ఇదంతా కావాలని గోకడమేనా..? రియాలిటీ విషయానికి వస్తే, పర్మిట్ రూమ్స్ ఉండటమే బెటర్, లేకపోతే మందుబాబులు బయట ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా తాగేసి న్యూసెన్స్ చేస్తారు… షరతులు పాటించకపోతే తరువాత నష్టపోతారు అనడం బెదిరించడమే.,. ఊరి బయట మాత్రమే ఉండాలనేది ఆచరణలో సాధ్యం కాదు… కాకపోతే స్కూళ్లు, ప్రార్థన స్థలాల సమీపంలో ఉండకూడదు, అదెలాగూ ప్రభుత్వ పాలసీలో ఉన్నదే… సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మాలనేదీ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమే… బెల్టు షాపుల మీద ప్రతి నాయకుడూ మాట్లాడతాడు, ప్రతి ప్రభుత్వం వాటి తాట తీస్తాననే చెబుతుంది… బెల్టు షాపులు లేకపోతే అసలు మద్యవ్యాపారమే లేదు… మహిళల సాధికారత అనే పదానికి విస్తృతార్థం ఉంటుంది… ఇది కాదు… నేను చెబుతున్నట్టుగానే మద్యం విధానం ఉండాలని నేరుగా పార్టీని, ప్రభుత్వాన్నే అడగాలి… లేదా నచ్చకపోతే పార్టీని వదిలేయాలి, తన పదవినే వదిలేయాలి… ఆ మాట చెప్పొచ్చుగా ఎమ్మల్యే సాబ్..!!
10 likes
13 shares
P.Venkateswara Rao
608 views 29 days ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్..! అందరూ పేదవాళ్లే..❗❗* September 21, 2025🎯 ప్రపంచంలో ఏ భాషలో అయినా మొదటి పలకరింపు “బాగున్నారా?”. ఒకవేళ మనం ఆ సమయానికి కష్టంలో ఉన్నా బాగున్నామనే చెబుతాం. వెనువెంటనే “మీరెలా ఉన్నారు?” అని అడుగుతాం. వాళ్ళు కూడా బాగున్నామనే చెబుతారు. “ఉభయకుశలోపరి” మిగతా మాటలు మొదలవుతాయి. సెల్ ఫోన్లు రాకముందు ఉత్తరాలు రాసుకునే సత్తెకాలంలో మొదట రాయాల్సిన మాటలు “నేను క్షేమం”; “మీరు క్షేమమని తలుస్తాను”. దానమో ధర్మమో చేస్తే చివరికి అడుక్కుతినేవారు కూడా “దయగల మారాజులు చల్లంగ ఉండాల” అని ఆశీర్వదిస్తారు. లోకంలో అదొక మర్యాద. మన నరనరాన ప్రతిఫలించే ఆచారం. అదే ప్రభుత్వ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడూ బాగుండము. ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటాం. మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేము. మన రోగాలకు వైద్యం చేయించుకోలేము. మన పిల్లలను పైచదువులకు విదేశాలకు పంపలేము. పెరిగి చెట్టంత అయిన మన పిల్లలకు పెళ్ళి చేయలేము. మనకు నిలువ నీడ ఉండదు. కట్టుకోవడానికి గోచీ గుడ్డ కూడా ఉండదు. వండుకోవడానికి ఏ పూటా పిడికెడు బియ్యం ఉండవు. పొయ్యి వెలిగించడానికి సిలిండర్ కు డబ్బులు ఉండవు. దాంతో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇచ్చి… మనకు మేలిరకం సన్న బియ్యం ఇచ్చేదాకా మన ఇళ్లల్లో వంటింటి పొయ్యిలో పిల్లి లేవదు. బియ్యం ఇచ్చిన ఆ చేత్తోనే పప్పు- ఉప్పు- నిప్పు ఇచ్చేదాకా మనకు మింగ మెతుకు ఉండదు. తెలంగాణాలో జనాభాతో దాదాపు సమానంగా రేషన్ కార్డులున్నాయని మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలొస్తున్నాయి. అంటే రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లమందిలో మహా అయితే పది, పదిహేను లక్షల మంది తప్ప మిగతావారందరూ పేదవారే. నిరుపేదలే. పది లక్షల ఉద్యోగులు, హైదరాబాద్ కోటీశ్వరులు, లక్షలు, కోట్లలో ఆదాయపు పన్ను కట్టేవారు…ఇలా స్థిర ఆదాయ, అధికాదాయ, దారిద్ర్య రేఖకు పైనున్నవారికి మరీ ఇంతగా కరువొచ్చిందా? ఏమో! వచ్చే ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న మూడు కోట్లా ఇరవై అయిదు లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు తోడు ఇప్పటికిప్పుడు మరో పది లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి…వెంటనే కార్డుల పంపిణీని ఒక బ్రహ్మోత్సవంగా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చేది? రాష్ట్రంలో పాతిక లక్షల కార్లున్నాయి, పదిహేను లక్షలు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లు… ఇలాంటి కాకిలెక్కలకిక్కడ విలువ లేదు. కార్లుంటే రేషన్ కార్డు ఉండకూడదా! ఈరోజుల్లో కార్లు సైకిళ్ళతో సమానం. కారు కారే- రేషన్ కార్డు రేషన్ కార్డే! రెండు, మూడు తరాలకు సరిపడా ఇంట్లో మూలుగుతున్నా… పూటగడవడం కష్టంగా ఉందని చెప్పుకుంటూ… రెండు, మూడు రేషన్ కార్డులు తీసుకోవడంలో ఉన్న ఆ కిక్కే వేరప్పా! ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు, సామాజిక అంశాల విశ్లేషకుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ “Everybody loves a good drought (అందరూ ప్రేమించే మంచి కరువు)” పేరిట గొప్ప సామాజిక పరిశోధన వ్యాసాల సంకలనంతో ఇంగ్లిష్ లో ఒక పుస్తకం ప్రచురించారు. కరువును నిర్మూలించడం కంటే… కరువును శాశ్వతంగా అలాగే ఉండేలా చేస్తూ… కరువు పేరిట నిధులు అడుక్కునే, ఆ కరువు నిధులను కరువుదీరా దిగమింగే మన పాలనా వ్యవస్థలను, రాజకీయ యంత్రాంగాన్ని యథార్థగాథలతో ఇందులో ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇలాంటివి చదవడానికి, చదివి జీర్ణించుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. అదొక దశాబ్దాల విషాదగాథ. ఇకముందు కూడా కొనసాగే అంతులేని వ్యథ. జనాభాను మించి రేషన్ కార్డుల సంఖ్య ఉండడాన్ని కూడా “అందరూ ప్రేమించే మంచి కరువు”లో భాగంగా అనుకుని… తూరుపు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప మెడమీద తలకాయ ఉన్నవారు, ఆ తలకాయలో మెదడున్నవారు చేయగలిగింది ఏమీ లేదు! దారిద్య్ర రేఖ భూమధ్య రేఖలాంటిది! అది కంటికి కనిపించదు. దారిద్య్రరేఖకు అందరమూ కిందే ఉంటాం కాబట్టి తెల్ల రేషన్ కార్డుల నిచ్చెనలు వేస్తూ ఉంటే… ఎన్నో కొన్ని యుగాలకు ఆ రేఖను అందుకోగలుగుతాం! “ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్!” *పమిడికాల్వ మధుసూదన్* 9989090018
12 likes
11 shares
P.Venkateswara Rao
2K views 1 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..⁉️* September 15, 2025🎯 మంత్రి సీతక్క… ఆమె జిల్లా ఎస్పీ శబరీష్ మోటార్ సైకిల్ వెనుక కూర్చుని మేడారం జాతర పరిసరాల్లో పర్యటించిన ఫోటో నిన్న వైరల్… గుడ్ టు సీ దట్ ఫోటో… కానీ ఎందుకు..? మంత్రుల దాకా ఎందుకు… చిన్న చిన్న ఊళ్ల సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చోటా నాయకులు కూడా కాన్వాయ్స్ మెయింటెయిన్ చేస్తున్న రోజులివి… అట్టహాసం, ఆడంబరం, పటాటోపం… ఆమెకు కాన్వాయ్ లేక కాదు… కానీ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఓ జిల్లా ఎస్పీని వెంటేసుకుని ఓ మోటార్ సైకిల్ మీద పర్యవేక్షణ పనుల్లో తిరుగుతున్న ఫోటో సొసైటీకి మంచి సంకేతాలను ఇస్తుంది… స్థానికులను ఈజీగా కలుస్తూ, పలకరిస్తూ తిరగడం అభినందనీయం… అవును, ఈమధ్య నల్గగొండ, ఖమ్మం రెడ్డి లీడర్లు హెలికాప్టర్ ప్రయాణాలు బాగా విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ఓ మహిళా ఆదివాసీ మంత్రి ఇలా నిరాడంబరంగా జనంలోకి వెళ్లడం కంట్రాస్టు విశేషమే కదా మరి… జనం అట్టహాసాలను ఇష్టపడరు… తమ దగ్గరకు ఓ కామన్ మ్యాన్‌లా రావడాన్నే ఇష్టపడతారు… పైగా ఆమె ఒకప్పుడు అడవుల్లో పోలీసులను తప్పించుకుంటూ తిరిగిన నక్సలైట్… ఇప్పుడు ఆమే ఓ పాలకురాలు… ఓ పోలీస్ ఎస్పీని వెంటేసుకుని అవే అడవుల్లో తిరుగుతున్న తీరు మరో కంట్రాస్టు విశేషం… అజ్ఞాతంలో ఉంటూ పోరాడే నక్సలైట్లూ ప్రధాన జీవన స్రవంతిలోకి రండి, మీరే పాలకులైతే మేమే బ్రహ్మరథం పడతామని చెప్పినట్టు లేదా ఇది..? గుడ్ సిగ్నల్... అక్కడ రోడ్లు లేవా..? కార్లు పోవా..? ఇదంతా పబ్లిసిటీ ప్రయాస అని కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… బహుశా ప్రతిదీ విమర్శించడం అలవాటైన బీఆర్ఎస్ క్యాంపు కావచ్చు… గతంలో కరోనా సమయంలో నడుస్తూ, డొంకల్లో పడి తిరుగుతూ, జనానికి నిత్యావసరాలు సప్లయ్ చేసిన ఫోటోలు కూడా అంతేనని ఓ విమర్శ… సరే, నిజమే అనుకుందాం… పబ్లిసిటీయే అనుకుందాం… మరి ఈ సోకాల్డ్ ఇతర నేతలు పబ్లిసిటీ కోసమైనా ఒక్కరోజు, కనీసం ఒక్కపూట అలా పర్యటించొచ్చుగా… అది చేతకాదు కానీ ఆమెను విమర్శిస్తారు… ఇదే బీఆర్ఎస్ క్యాంపు, నమస్తే తెలంగాణ ఆమె ఆధ్వర్యంలో మేడారంలో సమ్మక్క- సారలమ్మ గద్దెల దగ్గర ఆదివాసీ సంస్కృతిని దెబ్బతీసే మాస్టర్ ప్లాన్ సన్నాహాలు సాగుతున్నాయని రాసుకొచ్చింది… సీతక్కపై ఆదివాసీలు మండిపడుతున్నారట… ఈ నేపథ్యంలో ఆమే స్వయంగా అక్కడికి వెళ్లి.., ఎవరి మనోభావాలకు, సంస్కృతులకు విరుద్ధంగా ఏ ఆధునికీకరణ పనీ జరగదని స్వయంగా స్థానికులకు చెబుతోంది… బీఆర్ఎస్ దుష్ప్రచారాలకు సరైన విరుగుడు..!!
19 likes
28 shares
P.Venkateswara Rao
559 views 1 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…❗* September 9, 2025💃 జస్ట్ ఓ షర్మిలలాగే మిగిలిపోతుందా..? కవిత ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ రాజకీయాలపై, ప్రత్యేకించి బీఆర్ఎస్ మీద ఉంటుందా..? కేసీయార్ తేలికగా కొట్టిపడేస్తున్నాడు గానీ… కవిత ప్రభావమే ఉండదా.,.? సోషల్ మీడియాలో ఆమె మీద దుష్ప్రచారం సాగుతోంది… ఆమె సోషల్ మీడియా కూడా ఎదురుదాడి చేస్తోంది… రోజుకొకరి బట్టలు విప్పుతోంది ఆమె టీమ్.,. కేసీయార్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కూడా తేటతెల్లం చేస్తోంది… ఈ స్థితిలో తెలంగాణ రాజకీయాలపై కవిత ప్రభావం అనే అంశంపై VOTA media house ఓ ఫ్లాష్ సర్వే చేసింది… చిన్న శాంపిలే… రాండమ్‌గా 1000 మంది… కాకపోతే కుల, లింగ, వృత్తి, వయస్సుల పరంగా కరెక్ట్ శాంపిల్ మిక్స్… సరే, ఈ మెతుకు చూద్దాం, అన్నం ఏమిటో తెలుస్తుందేమో… ఇదీ పీడీఎఫ్ లింక్… KAVITHA IMPACT తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావంపై ఓ ఫ్లాష్ సర్వే కవిత రాజీనామా జనంలోకి విస్తృతంగా వెళ్లింది… చాలామంది ఇది ఊహించిందే అన్నారు… బీఆర్ఎస్‌కు దీనివల్ల కొంత నష్టమే అని దాదాాపు సగం మంది అభిప్రాయం… కవిత భవిష్యత్తులో కొత్త పార్టీ పెడుతుంది… ఎజెండాను బట్టి కవితకు మద్దతు దొరకొచ్చు… అంటూనే మరోవైపు… బీఆర్ఎస్ లేకుండా కవిత బలమైన నాయకురాలు కాదని మెజారిటీ అభిప్రాయం… కవిత హరీష్, సంతోష్‌లపై చేసిన ఆరోపణలను ఎక్కువ మంది నమ్ముతున్నారు… కవిత రాజీనామాకు ఇంటి గొడవలే కారణం… కవిత ఇష్యూ కాంగ్రెస్‌కే ఫాయిదా… బీఆర్ఎస్ ఇంటిగొడవలకు కారణం ఆస్తులు, వారసత్వాలు, అవినీతిలో వాటా… ఆమె ఇష్యూతో తెలంగాణ రాజకీయాలపై కొంత ప్రభావం ఉంటుంది… కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆమె బీసీ పాట అందుకుంది.,. దీర్ఘకాలంలో ఆ ఇష్యూ ఆమెకు ఏమీ ఉపయోగపడదు… లిక్కర్ స్కాంలో ఆమె పాత్ర కొంతమేరకు ఉంది… ఈ వివరాలను సదరు VOTA మీడియా హౌజ్ సీఈవో కంభాలపల్లి కృష్ణ వెల్లడించాడు సోషల్ మీడియా వేదికగా..!!
12 likes
8 shares