Failed to fetch language order
ఫేక్ న్యూస్ లు నమ్మవద్దు
18 Posts • 13K views
PSV APPARAO
630 views 17 days ago
#తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #ఫేక్ న్యూస్ లు నమ్మవద్దు #ఫేక్ న్యూస్ నమ‌్మకండి #సీనియర్ సిటిజన్లకు నేరుగా శ్రీవారి దర్శనం.. పత్రికా ప్రకటన తిరుమల, 2025 అక్టోబర్ 05 వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.
10 likes
7 shares