గాంధీ జయంతి
530 Posts • 2M views
అక్టోబర్ 2 వ తేదీన గాంధీజీ గారి 156 వ జయంతిని పురస్కరించుకొని భారతదేశానికి ఆయన అందించిన వెలకట్టలేని,అజారామమైన సేవలను ఒక్కసారి మనమంతా స్మరించుకుందాం ! లేదా హింస వద్దు - అహింస ముద్దు అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి,శక్తి మన జాతిపిత బాపూజీ గారు! బ్రిటిష్ వారి ద్రాస్య శృంఖలాల నుంచి భారతదేశ ప్రజానీకానికి బంధ విముక్తులు గావించిన,స్వేచ్చా స్వాతంత్య్రాలను ప్రసాదించిన స్ఫూర్తి ప్రదాత,'హింస వద్దు - అహింస ముద్దు ' అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి,శక్తి మన జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ గారు. అశేష భారతదేశ ప్రజానీకంచే బాపూజీ గా పిలువబడే గాంధీజీ గారి 156 వ జయంతిని పురస్కరించుకొని భారతదేశానికి ఆయన అందించిన అమూల్య,అసాధారణ,వెలకట్టలేని సేవలను స్మరించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి భారతీయుడిపై ఎంతైనా వుంది.ఎందుకంటే మన భారతవాణిపై అర్ధరాత్రి స్ర్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు అని చాటి చెప్పిన గొప్ప దార్శనికుడు,అణువణువున దేశభక్తిని తనలో ఇముడ్చుకున్న నిస్వార్థ వ్యక్తి మన ప్రియతమ స్వాతంత్ర్య సమర యోధుడు మహాత్మాగాంధీ.జగడాలు,ఘర్షణల కంటే సామరస్య పూరితమైన వాతావరణం గొప్పదని చాటి చెప్పిన మహానుభావుడు మన జాతిపిత.ప్రతి ఒక్క భారతీయుడు కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం,క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటూ స్నేహపూరితమైన వాతావరణంలో జీవించాలని చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చారు గాంధీజీ.అంతేకాదు ఆయన అనుసరించిన శాంతియుత పంథా అంటే ' పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగాలనే ' ఆయన అభిలాష,ఇంకా చెప్పాలంటే ఓర్పు,సహన శక్తి,మనో నిబ్బరాన్ని మనం గనుక అలవరచుకోగలిగితే కొండల్ని సైతం పిండి చేయవచ్చు,అసాధ్యాల్ని సైతం సుసాధ్యం చేయవచ్చు అనే నీతి సూత్రాన్ని కేవలం మాటలతో చెప్పడమే కాదు చేతలతో చేసి చూపించిన మహానుభావుడు,యావత్ జాతి మెచ్చిన దార్శనీకుడు,కోట్లాది మంది భారతదేశ ప్రజల హృదయాల్లో కొలువై వున్న దేవుడు లాంటి వారు ఈ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ గారు అనే మాట సత్య దూరం కాదు.అందుకే పూజ్యనీయులు బాపూజీ గారు మన ముందు లేకపోయినా కోట్లాది మంది భారతదేశ ప్రజల మనస్సుల్లో ఇప్పటికి అమరుడే, ఎందుకంటే ఆయన నడిచిన బాట,ఎంచుకున్న సిద్ధాంతాలు సదా అనుసరణీయమే,మేలుకొలుపు వంటివే అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఏదిఏమైనా అలాంటి మహోన్నతమైన,సంస్కారవంతుడైన,విశాల స్వభావం మెండుగా గల బాపూజీ గారి అడుగుజాడల్లో నడిచి,ఆయన సిద్ధాంతాలను,ఆశయాలను దేశవ్యాప్తంగా అమలు పరిచేలా మన నాయకులు, పాలకులు వ్యవహరిస్తే అది మన భారతదేశ ప్రగతికి,అశేష ప్రజల అభివృద్ధికి,అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుంది అనే మాట అక్షర సత్యం.ఏమైన ఈ ప్రత్యేక దినాన,సందర్భాన కోట్లాది మంది భారతదేశ ప్రజానీకం యొక్క సుఖసంతోషాల కోసం తన విలువైన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప మానవతావాది అయినా బాపూజీ గారి పవిత్ర ఆత్మకు ఆ నింగిలో శాంతి చేకూరాలని ప్రతి భారతీయుడు మనసా,వాచ,కర్మణా, హృదయపూర్వకంగా కోరుకోవాల్సిన అవశ్యకత,అవసరత,మన అశేష భారతదేశ ప్రజల భుజస్కందాలపై ఎంతైనా వుంది. అమర్ రహే అమర్ రహే జాతిపిత మహాత్మాగాంధీజీ!జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️ బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #గాంధీ జయంతి
6 likes
8 shares