PSV APPARAO
760 views • 25 days ago
#మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు శ్రీ మలయప్ప స్వామి వారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనం🙏 #మోహినీ అవతారం – మాయా మోహ నాశనం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు
👆 మోహినీ అట్టం, గోపికానృత్యం తిరువథారకలి నృత్యాలతో అలరించిన కళా బృందాలు
తిరుమల, 2025 సెప్టెంబర్ 28: ఈ మోహినీ అవతార సేవ సందర్భంగా ఆదివారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి.
మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 26 కళాబృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాలలో మొత్తం 568 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో వాహన సేవ శోభను మరింత ఇనుమడింపజేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, పుదుచ్చేరి, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు కు చెందిన బృందాలు పాల్గొన్నాయి.
కేరళకు చెందిన కళాకారులు ప్రదర్శించిన మోహినీ అట్టం, ‘గోపికానృత్యం, తిరువథారకలి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కర్ణాటకకు చెందిన మోహినీ భస్మాసుర యక్షగానం, దాసవాణి నృత్యవైభవం, రాజస్థాన్ నుంచి కల్బెలియా నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
మధ్యప్రదేశ్ నుంచి బదాయ్, గిరిజన జానపద నృత్యాలు, చత్తీస్‌ఘడ్ నుంచి ప్రరవ్ పూజ, పంజాబ్ నుంచి బంగ్రా వంటి వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే కళా రూపాలు ప్రదర్శించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన ధింసా, కిట్టయ్య లీలలు, దమరుక ధ్వని విన్యాసం చెక్క భజన వంటి సాంప్రదాయ కళలు వాహన సేవకు మరింత ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
16 likes
13 shares