Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
నూతన మద్యం పాలసీ⁉️
4 Posts • 1K views
P.Venkateswara Rao
548 views 7 days ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 #నూతన మద్యం పాలసీ⁉️ *మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..‼️* October 13, 2025🍺🍻🥂 మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదోరకంగా ప్రభుత్వాన్ని, పార్టీని గోకడానికే ప్రయత్నిస్తున్నాడు… తన నియోజకవర్గం తెలంగాణలో భాగమేననీ, అక్కడ కూడా ప్రభుత్వ పాలసీలు వర్తిస్తాయనీ, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మునుగోడుకు తాను సీఎం కాననీ మరిచిపోతున్నాడు… తనేం అంటున్నాడంటే..? మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ (Wine Shops ) టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశాడు… షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించాడు… మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశాడు… వైన్ షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నాడు… ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్‌లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నాడు… ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్‌ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నాడు… స్థూలంగా గమనిస్తే ఎమ్మెల్యే పెట్టే ఆంక్షలు, షరతులు ఆమోదయోగ్యం అనిపిస్తాయి… సమాజహితం అనిపిస్తాయి… కానీ తను అధికార పార్టీ ఎమ్మెల్యే… నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ పాలసీతో సంబంధం లేదనీ, ఇవి నా షరతులు అని ఎలా అంటాడు..? మునుగోడుకు ఏమైనా స్వయంప్రతిపత్తి ఉందా..? అక్కడ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే చెప్పిందే శాసనమా..? రేప్పొద్దున ఇంకా ఇతరత్రా అన్ని విషయాల్లో కూడా వేరే ఎమ్మెల్యేలు ఇలాగే సొంత పాలసీలను, షరతులను ప్రవేశపెడితే… ఇక ప్రభుత్వాలు దేనికి..? ఇదంతా కావాలని గోకడమేనా..? రియాలిటీ విషయానికి వస్తే, పర్మిట్ రూమ్స్ ఉండటమే బెటర్, లేకపోతే మందుబాబులు బయట ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా తాగేసి న్యూసెన్స్ చేస్తారు… షరతులు పాటించకపోతే తరువాత నష్టపోతారు అనడం బెదిరించడమే.,. ఊరి బయట మాత్రమే ఉండాలనేది ఆచరణలో సాధ్యం కాదు… కాకపోతే స్కూళ్లు, ప్రార్థన స్థలాల సమీపంలో ఉండకూడదు, అదెలాగూ ప్రభుత్వ పాలసీలో ఉన్నదే… సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మాలనేదీ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమే… బెల్టు షాపుల మీద ప్రతి నాయకుడూ మాట్లాడతాడు, ప్రతి ప్రభుత్వం వాటి తాట తీస్తాననే చెబుతుంది… బెల్టు షాపులు లేకపోతే అసలు మద్యవ్యాపారమే లేదు… మహిళల సాధికారత అనే పదానికి విస్తృతార్థం ఉంటుంది… ఇది కాదు… నేను చెబుతున్నట్టుగానే మద్యం విధానం ఉండాలని నేరుగా పార్టీని, ప్రభుత్వాన్నే అడగాలి… లేదా నచ్చకపోతే పార్టీని వదిలేయాలి, తన పదవినే వదిలేయాలి… ఆ మాట చెప్పొచ్చుగా ఎమ్మల్యే సాబ్..!!
10 likes
13 shares
P.Venkateswara Rao
592 views 14 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #నూతన మద్యం పాలసీ⁉️ *ఏం స్కెచ్‌ వేశావ్‌ చంద్రబాబూ?: వైఎస్‌ జగన్‌..❗* 06.10.2025🎯 రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారుల మార్పు సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ మండిపాటు రాష్ట్రంలో మద్యం అక్రమాలకు ములకలచెరువు ఘటనే నిదర్శనం నకిలీ లిక్కర్‌ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేయాలన్నదే మీ లక్ష్యమా? మద్యం దుకాణాలు, ఇల్లీగల్‌ పరి్మట్‌ రూమ్‌లు, బెల్టుషాపులు అన్నీ టీడీపీ వాళ్లవే.. అక్రమ మద్యం తయారీదారులు కూడా వీరే అలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు వచ్చిన ఆదాయాన్ని వాటాలు వేసుకుని అందరూ పంచుకుంటున్నారు వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని మీ ముఠా కొట్టేస్తోంది ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో ఎందుకు తనిఖీలు చేయలేదు? మీ సహకారం ఉంది కాబట్టే అసలు సూత్రధారులను తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసులు మీ సొంత ఆదాయం కోసం పేదల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా? 2024-25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్‌ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్‌ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025-26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్‌ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ? -మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్‌ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది. ⇒ మీ లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ⇒ లిక్కర్‌ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్‌లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్‌ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్‌ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్‌ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్‌ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్‌ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం? ⇒ నకిలీ లిక్కర్‌ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు. ⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్‌ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా?
12 likes
6 shares