Failed to fetch language order
Failed to fetch language order
శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️
21 Posts • 3K views
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 ----------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమ🕉️ ------------------------------------ గురువారం అక్టోబరు 23, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు 🪔కార్తీకమాసం-శుక్ల పక్షo🪔 తిథి:విదియ:రా7.55వరకు వారం; గురువారం (బృహస్పతివాసరే) నక్షత్రం: విశాఖ: తె3.16వరకు యోగం: ఆయుష్మాన్:తె4.34 వరకు కరణం: బాలువఉ6.54వరకు తదుపరి:కౌలువరా7.55వరకు వర్జ్యం: ఉ6.53 - 8.39 దుర్ముహూర్తము: ఉ9.49 - 10.35 మరల: మ2.26 - 3.13 అమృతకాలం:సా5.31-7.17 రాహుకాలం: మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి: తుల చంద్రరాశి: తుల సూర్యోదయం: 5.58 సూర్యాస్తమయం: 5.32 ------------------------------------ 👉 *భగినీహస్త భోజనం* ----------------------------------- *యమద్వితీయ* ------------------------------------ *అన్నా చెల్లెళ్ళ పండుగ శుభాకాంక్షలు* ------------------------------------ సర్వేజనా సుఖినోభవంతు శుభమస్త
20 likes
8 shares
#కార్తీక మాసం #కార్తీక మాసం స్పెషల్ #శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు -------------------------------------- *ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం , పూజా విధానం* -------------------------------------- *కార్తీక మాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేసుకుంటారు.* *సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ* *వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే* *జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు.* *వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు.* *వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం.* ---------------------------------------- *అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు.ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి ,* *అవ్యవస్థకు , అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది.ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం.* *ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు* *మూర్తీభవించినట్టుగా ఉంటుంది , శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు.* --------------------------------------- *అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి.* *కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది.* *దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత* *పునరపి జననం , పునరపి మరణం , పునరపి జననే జఠరే శయనం* *ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం.* *ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక.* *ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు.* *అయితే ఈచర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా.అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు.* *తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో* *అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.* *అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే* *అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం* *చేస్తారు.* --------------------------------------- *ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది.* *అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది. అవేమిటో గమనిద్దాం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.* ---------------------------------------- *"మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.* --------------------------------------- *"స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.* ---------------------------------------- *"ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి..* ---------------------------------------- *"దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు , పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.* -------------------------------------- *"ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యం శుద్ది అవుతుంది.* ---------------------------------------- *"క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.* *నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.* *కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే* *"మంచితనం"అదే మనకు ఆభరణం.* *మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి.* ---------------------------------------
7 likes
14 shares
#కార్తీక మాసం #కార్తీక మాసం శుభాకాంక్షలు #కార్తీక మాసం స్పెషల్ #శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #🙏ఓం నమః శివాయ🙏ૐ *కార్తీక మాసం 30 రోజులు - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం* *1వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. దానములు:- నెయ్యి, బంగారం పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా *2వ రోజు:* నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు పూజించాల్సిన దైవము:-బ్రహ్మ జపించాల్సిన మంత్రము:- ఓం గీష్పతయే - విరించియే స్వాహా *3వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు కలిసినవి, ఉసిరి దానములు:- ఉప్పు పూజించాల్సిన దైవము:- పార్వతి జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా *4వ రోజు:* నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి దానములు:- నూనె, పెసరపప్పు పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *5వ రోజు:* నిషిద్ధములు:- పులుపుతో కూడినవి దానములు:- స్వయంపాకం, విసనకర్ర పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి) *6వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి దానములు:- చిమ్మిలి పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా *7వ రోజు:* నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా *8 వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం దానములు:- తోచినవి - యథాశక్తి పూజించాల్సిన దైవము:- దుర్గ జపించాల్సిన మంత్రము:- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా *9వ రోజు:* నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు పూజించాల్సిన దైవము:- అష్టవసువులు - పితృ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః *10వ రోజు:* నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు జపించాల్సిన మంత్రము:- ఓం మహామదేభాయ స్వాహా *11వ రోజు:* నిషిద్ధములు:- పులుపు, ఉసిరి దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ పూజించాల్సిన దైవము:- శివుడు జపించాల్సిన మంత్రము:- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ *12వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము:- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా *13వ రోజు:* నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం పూజించాల్సిన దైవము:- మన్మధుడు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా *14వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె పూజించాల్సిన దైవము:- యముడు జపించాల్సిన మంత్రము:- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా *15వ రోజు:* నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు జపించవలసిన మంత్రం:- 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః' *16వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః *17వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు దానములు:- ఔషధాలు, ధనం పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా *18వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి దానములు:- పులిహార, అట్లు, బెల్లం పూజించాల్సిన దైవము:- గౌరి జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా *19వ రోజు:* నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి దానములు:- నువ్వులు, కుడుములు పూజించాల్సిన దైవము:- వినాయకుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *20వ రోజు:* నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి దానములు:- గో, భూ, సువర్ణ దానాలు పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం *21వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం దానములు:- యథాశక్తి సమస్త దానాలూ పూజించాల్సిన దైవము:- కుమారస్వామి జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా *22వ రోజు:* నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా *23వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి, తులసి దానములు:- మంగళ ద్రవ్యాలు పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా *24వ రోజు:* నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ జపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా *25వ రోజు:* నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు దానములు:- యథాశక్తి పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు జపించాల్సిన మంత్రము:- ఓం ఈశావాస్యాయ స్వాహా *26వ రోజు:* నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు దానములు:- నిలవవుండే సరుకులు పూజించాల్సిన దైవము:- కుబేరుడు జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా *27వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా *28వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ దానములు:- నువ్వులు, ఉసిరి పూజించాల్సిన దైవము:- ధర్ముడు జపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా *29వ రోజు:* నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు) జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్ *30వ రోజు:* నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః 🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏
22 likes
15 shares
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #కార్తీక మాసం ----------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ శుక్రవారం: అక్టోబరు 24, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు 🪔కార్తీక మాసం-శుక్ల పక్షం🪔 తిథి: తదియ:రా10.01వరకు వారం: శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం: అనూరాధ:తె5.51 వరకు యోగం: సౌభాగ్యం: తె5.08 వరకు కరణం:తైతుల, ఉ8.59 వరకు, తదుపరి: గరజి: రా10.01 వరకు వర్జ్యం: ఉ7.42 - 9.29 దుర్ముహూర్తము:ఉ8.17-9.03 మరల: మ12.08 - 12.54 అమృతకాలo: సా6.20-8.07 రాహుకాలం: ఉ10.30/12.00 యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30* సూర్యరాశి: తుల చంద్రరాశి: వృశ్చికం సూర్యోదయం: 5.59 సూర్యాస్తమయం: 5.31 ------------------------------------ 👉 *త్రిలోచనగౌరీ వ్రతం* ------------------------------------ సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------
15 likes
11 shares