🌾 *రైతాంగం సేంద్రీయ వ్యవసాయం బాట పట్టాలి* – *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ*
*మూడు లక్షల మెట్రిక్ టన్నుల* *ఫ్రూట్ బంచ్ క్రషింగ్ సాధించిన ఆయిల్ ఫెడ్ సిబ్బందికి* *అభినందనలు*
🗓️ *12.10.2025, ఆదివారం*
📍 *అప్పారావుపేట, దమ్మపేట మండలం*
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు *తుమ్మల నాగేశ్వరరావు* గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ గారు* మాట్లాడుతూ –
పామాయిల్ సాగు రైతులకు బంగారు బాటగా మారిందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటగా పామాయిల్ విశేష ప్రాధాన్యతను సాధించిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో రైతులు ఆధునిక పద్ధతులను నేర్చుకొని అమలు చేస్తే మరింత అధిక దిగుబడులు పొందగలరని సూచించారు.
అలాగే రైతాంగం *సేంద్రీయ వ్యవసాయం* బాట పట్టాలని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రీయ పద్ధతులను అనుసరిస్తే భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రూట్ బంచ్ క్రషింగ్ సాధించిన ఆయిల్ ఫెడ్ అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే జారె అభినందనలు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పామాయిల్ రైతులతో ముఖాముఖి చర్చించి వారి అనుభవాలు, సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా ఎదగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పామాయిల్ సాగు రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆలపాటి ప్రసాద్, పామాయిల్ రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.
#🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్