Failed to fetch language order
వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏
8 Posts • 241 views
PSV APPARAO
720 views 1 months ago
#🎶గణేశ భజన–మంత్రాలు–ఆరతి🪔 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #🕉️వినాయక మంత్రాలు *ఓం లంబోదరాయ నమః* గణేశ రూపాలు ఎన్నో ఉన్నాయి. గణేశ మంత్రాలు కూడా అసంఖ్యాకమే. ఒక్కోనామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రతి మంత్రానికీ విశిష్ట పరమార్థం, ప్రయోజనం ఉంటాయి. ఏ సమయంలో ఎప్పుడైనా ఎవరైనా జపించుకోగలిగే గణపతి మంత్రాలు మూడింటిని చూద్దాం. _మంత్రం :_ *ఓం లంబోదరాయ నమః* _వివరణ :_ సృష్టికంతకూ మూలమైన వానికి నమస్కారం అని మంత్రార్థం. లంబోదరుడంటే సాధారణమైన అర్థంలో బానబొజ్జ కలవాడని చెబుతాం. కానీ బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి ఖండం లంబ శబ్దానికి బ్రహ్మాండ భాండములనే వివరణ ఇచ్చింది. లంబోదరుడంటే సృష్టిలోని బ్రహ్మాండాలన్నీ ఉదరంలోనే దాచుకున్నవాడని అర్థం. సిద్దిలక్ష్మీదేవిని అంకముపై కూర్చుండబెట్టుకుని లంబోదరుడు దర్శనమిస్తాడు. _నేపథ్యం :_ లంబోదర శబ్దాన్ని గురించి ముద్దలపురాణం చక్కగా వివరించింది. భాగవతంలో కూడా బ్రహ్మవర్చసః కామస్తు యదేతా బ్రహ్మణస్పతిం అంటే బ్రహ్మవర్చస్సు, విద్యకావాలనుకునేవారు లంబోదరుణ్ణి పూజించాలని చెప్పారు. లంబోదర లకుమి కథా అనేకీర్తన లంబోదరుడు లక్ష్మీకరుడు అని చెబుతుంది. _చేయవలసిన క్రమం :_ రోజూ 108 సార్లు _నైవేద్యం :_ వడపప్పు, ఉండ్రాళ్లు, పెసరపప్పు, పానకం వంటివి ఏవైనా. _ప్రయోజనం:_ విద్య, యశస్సు, సంపద కలుగుతాయి. స్త్రీలకు వివాహప్రాప్తి, సౌందర్యప్రాప్తి. _-_ _మంత్రం :_ *ఓం ఫాలచంద్రాయ నమః* _వివరణ:_ అరచంద్రునివంటి నుదురు కలిగిన స్వామికి నమస్కారం అని మంత్రారం. _నేపథ్యం:_ స్వామి శిరస్సు మీద ఉండే చంద్రుడు వేరు. ఆకాశంలో మనకు కనిపించే చంద్రుడు వేరు. నుదురు చంద్రవంకలావుంటే శ్రేష్టమైన జాతకుడవుతాడని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. ఇటువంటి స్వామి అందరికీ ఆరాధ్యుడు. రసూల్ ఖాన్ అనేకవి శిశుశశి ఈక్ అయిన ఫాలచంద్ర గణపతికి తాను బందీనైపోయానని చెప్పుకున్నాడు. _చేయవలసిన క్రమం:_ యధాశక్తి _నైవేద్యం :_ పళ్లు, పాలు, వడపప్పు వంటివి. _ప్రయోజనాలు :_ చంద్రుడు మనస్సుకు కారకుడు. ఫాలచంద్ర గణపతిని అర్చిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి. జ్ఞానము కలుగుతుంది. బుద్ది తీక్ష మవుతుంది. గణపతి సద్విద్య, సద్భుద్ది కలిగిస్తాడు. _-_ _మంత్రం :_ *ఓం గజవకాయ నమః* _వివరణ :_ ఏనుగు ముఖం కలిగిన స్వామికి వందనం అని మంత్రార్థం. గజ అన్నప్పుడు గ అంటే జ్ఞానం. జ్జ అంటే ఆచరణ. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని కలిగించే దేవర గజవక్షుడు. ఈ స్వామి ఎనిమిది ముఖాలతో ఎర్రని శరీరం కలిగివుంటాడు. _నేపధ్యం:_ నారదపురాణంలో చెప్పిన మహామంత్రాలలో ఇదికూడా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శ్లోకంలో ప్రసన్నవదనం అంటే సింహ. గజముఖాలు కలిగిన్ స్వామి అనే అర్ధాన్ని పెద్దలు చెబుతారు. ఏనుగు ముఖం గంభీరమైంది. దాని మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. శిక్షించినా, రక్షించినా అపూర్వమైన రీతిలో చేయడం గజవదనుని ప్రత్యేకత _చేయవలసిన క్రమం :_ రోజుకు 27 సార్లు తగకుండా చేయాలి. _నేవేద్యం:_ బెల్లంముక్క చాలు. _ప్రయోజనాలు :_ గజవదనుడైన గణపతిని పూజిస్తే మనలోని ఎనిమిది అవలక్షణాలు తొలగుతాయి. ఉత్సాహం ఫలితం ఆలస్యం చెయ్యిడం, లోభం, దీనత్వం, నిద్ర, సోమరితనం, అరకొరగా పనిచేయడం, స్తబ్దత, మతిమరుపు ఒకప్పుడు ఈ ఎనిమిది అవలక్షణాలూ ఒకప్పుడు దేవతా సైన్యాలకు కలిగితే వాటిని తొలగించడానికే పరమాత్మ గజవదనంతో వచ్చాడు. జ్ఞానం బలం, చురుకైన బుద్ధి సిద్ధిస్తాయి. పోటీపరీక్షలకు చదువుకునే పిల్లలు ఈ మంత్రం జపించాలి. *డైలీ విష్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
14 shares
11 likes
12 shares
PSV APPARAO
1K views 1 months ago
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #వినాయక చవితి ఉత్సవాలు #🕉️గణేష్ ఉత్సవాలు ప్రారంభం🙏 ఉమ్మడి విశాఖ జిల్లాలో పెడుతున్న పెద్ద విగ్రహాలు.. మన చోడవరం - ఆదిగణపతి విగ్రహం పూర్తి మట్టి విగ్రహం గా మనం తెలియచెయ్యవచ్చును. 🙏🙏🙏
17 likes
15 shares
PSV APPARAO
811 views 1 months ago
#గణపతి తత్వం #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #శ్రీ వినాయక వైభవం 🕉️ *గణపతి తత్త్వం* 'గ' అనే అక్షరం జ్ఞానవాచకం, 'ణ' అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణశాసకుడు గణపతి. కంటికి కనిపించే విశ్వం పంచభూతాత్మకమైంది. దీన్నే 'జగము' అంటారు. 'జ' అంటే పుట్టి; 'గ' అంటే గతించేది. జగము, గజము పరస్పర సంబంధం కలిగిన విషయాలు. వ్యక్తం నుంచి అవ్యక్తం వైపుకు సాగే పయనమే గణేశ తత్త్వం. గణపతి ఏకదంతుడు. ఆయనకు ఉన్న ఇరవై ఒక్కనామాలలో శూర్పకర్ణుడు అనే పేరులోని అర్ధాన్ని లోతుగా పరిశీస్తే 'భక్తుల మొరలను బాగా వినడమే నా పని అన్న సంకేతం కనిపిస్తుంది. తాలును పోగొట్టి అసలైన ధాన్యాన్ని మన కందించే వేటలవంటి చెవులు ఆయనకున్నాయి. తాలు వంటికోరికల్ని పక్కకి నెట్టేసి మంచి కోరికలు తీర్చే దాక్షిణ్యమూర్తి ఆయన. వినాయకుడు వక్రతుండుడు ఆ తొండం ప్రణవస్వరూపం... ఓం కారమంటే పరబ్రహ్మం. ఆ తొండాన్ని ఆరాధిస్తే. మూలాధారదైవాన్ని ఆరాధించినట్టే.. మాయను నివారించే మహిమగల స్వామి వక్రతుండ గణపతి ఆయన వాహనం ఎలుక ఇంద్రియ చాపల్యానికి సంకేతంగా ఎలుకను తత్త్వజులు అభివర్ణించారు. ఆ అసురతత్త్వాన్ని అణిచివేయడం గణపతి లక్షణం కనుక మూషికాన్ని వాహనంగా స్వీకరించాడు. ఆయన సూక్ష్మనేత్రుడు. ఆ చిన్ని కళ్లు సూక్ష్మదృష్టికి దివిటీలు. సూక్ష్మబుద్ధికి సంకేతాలు. పురుష రూప దేవతలకు వారి శక్తులనే భార్యలుగా సంభావన చేసింది శ్రీ శాస్త్రం, అందువల్ల 'సిద్ధి బుది' గణపతి భార్యలుగా పేర్కొన్నాయి కొన్ని పురాణ కథనాలు, సర్వలోకాలు గణపతి ఒజకు బొజ్జలో ఉన్నాయి. విష్ణు ప్రసాద పుష్పాన్ని అలంకరించుకున్న ఏనుగు ముఖంతో పుట్టిన శివపుత్రుడు సృష్టికి ఆద్యుడు కనుక త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు గణపతి. వినాయకుని వీణపేరు 'లకుమి'. సంగీత శిక్షణారంభంలో లంబోదర లకుమి కరా అన్న కీర్తన వినపడుతుంది. ఆయన సంగీత ప్రియుడు. నృత్య ప్రియుడు. ఆయన సకల కళా నిలయుడు. ప్రపంచంలో కళల వలనే సుఖ సంతోషాలు విలసిల్లగలవని పావన గణపతి భావన. వినాయకుడి ఆరాధనలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ. గాణపత్యాలనే అయిదు ఉపాసనలు నిబిడీకృతమవడం వల్ల సర్వమతాలను సమానంగా చూచే గాణపత్యం పొందినవాడాయన. గణపతికి తొమ్మిది రాత్రులపాటు ఉత్సవాలు చేస్తారు. పూర్ణ బ్రహ్మపదాన్ని సాధించడమే యీ తొమ్మిది సంఖ్యకు గల సంకేతం ఏకవింశతి (21) పత్రాలతో స్వామిని పూజిస్తారు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. తన్మాత్రలు 5 5 మనస్సు ఒకటి కలిపితే మొత్తం 21. 21. వీటిన్నింటితో కూడిన శరీరంతో వినాయకచవితినాడు ఏకవింశతిపత్ర పూజ చేస్తాం. కన్యారాశిలో సూర్యుడున్నప్పుడు చంద్రుణి చూడరాదని శాస్త్రం. గణేశుడు పరంజ్యోతి అయిన ఆత్మ. సూర్యుడిచ్చినట్టు చెప్పబడే శ్యమంతకమణి ఆత్మకు ప్రతిక చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సును ఆత్మలో లయంచేయకపోతే అనర్థం అని శ్యమంతకోపాఖ్యానం చెబుతుంది. మానవ - జంతు ఆకృతులు కలగలిసిన రూపాలు గల దేవతలు త్వరగా కరుణిస్తారని మంత్ర శాస్త్రం చెబుతోంది. గణపతి అష్టోత్తర శతనామావళిలో 'ఓం కలికల్మష నాశనాయ నమః' అన్న నామం వుంది. కలౌ చండీవినాయకౌ అన్నట్లుగా కలిలో సత్వరంగా అనుగ్రహించే దైవం ఆయన. విభిన్నపురాణాలలో విభిన్న. రీతులలో గణనాయకుడి గాధలున్నాయి. ఆయన మానవులు తలపెట్టిన సకల కార్యాలనూ నిర్విఘ్నంగా పూర్తిచేయించి సాఫల్యం కలిగిస్తాడు. కీర్తిని ప్రసాదిస్తాడు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
19 likes
22 shares