టిక్.. టిక్.. టిక్.. గంటలే సమయం..
10 Posts • 1K views
P.Venkateswara Rao
646 views 4 months ago
#టిక్.. టిక్.. టిక్.. గంటలే సమయం.. *దేనికీ టైమ్ లేదా…❓ పరుగు తీస్తున్నావా..❓ టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..❗❗* June 19, 2025⏲️ గతంలో 12 గంటలు పైన పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లో చేయగలుగుతున్నాం. అయినా నేను అంటూనే ఉంటాను… *నాకు టైం* లేదని గతంలో పదిమంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు ఇద్దరు ఉండే కుటుంబంలోకి వచ్చాము ..అయినా నేను అంటూనే ఉంటాను *నాకు టైం* లేదని ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టేది ఇప్పుడు నాలుగు సెకన్లలో వెళ్ళిపోతుంది అయినా సరే నేను అంటూనే ఉంటాను *నాకు టైం* లేదని గతంలో మనకు ఇష్టమైన వాళ్ళని చూడడానికి నెలల కాలం పట్టేది ఇప్పుడు తలుచుకోగానే ఎదురుగా కనబడుతున్నారు అయినా సరే నేను అంటూనే ఉంటాను *నాకు టైం* లేదని గతంలో ఇంటి నుంచి ఇంటికి వెళ్లడానికి గాని, మెట్లు ఎక్కి పైఅంతస్తు వెళ్ళడానికి కానీ శక్తి, సమయము రెండు కావాలి. ఇప్పుడు నిమిషంకన్నా తక్కువ టైంలో పైఅంతస్తులోకి వెళ్ళిపోతున్నాం. అయినా సరే నేను అంటాను *నాకు టైం* లేదు అని గతంలో పోస్ట్ ఆఫీస్ లోను బ్యాంకు లోను గంటకుపైగా పని కోసం పెద్ద లైన్లో నిలబడి ఎదురు చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సెకండ్లలో మన పనులు అయిపోతున్నాయి అయినా సరే నేను అంటాను *నాకు టైం* లేదు అని గతంలో మెడికల్ టెస్ట్లు రిపోర్టులు రావడానికి రోజులు పట్టేది .ఇప్పుడు చిటికలో రోగ నిర్ధారణ జరిగిపోతోంది. అయినా సరే నేను అంటాను *నాకు టైం* లేదు అంటున్నారు. మరి నేను హోండా యాక్టివా హ్యాండిల్ ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో ఫోను మెడ వంచి పక్కగా పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే బండి ఆపి పక్కన నిలబడి మాట్లాడే అంత *టైం నాకు* లేదు కాబట్టి కారు నడుపుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు రోడ్డు కేసి చూస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండవ చేత్తో వాట్సప్ చూస్తూ లేదా మొబైల్ మాట్లాడుతూ నేను డ్రైవింగ్ చేస్తాను ఎందుకంటే కారు ఆపి మాట్లాడి వెళ్ళేటంత *టైం నాకు* లేదు కాబట్టి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్లో బళ్ళు ఆగినప్పుడు నేను పక్కనుంచి వెళ్లి మూడో లైన్ తయారుచేసి అక్కడ బండి ఆపుతాను , ఎందుకంటే నాకు ఇంత లైన్లో నిలబడి ఎదురు చూసే *టైం నాకు* లేదు కాబట్టి పదిమందిలో నేను ఉన్నప్పుడు కూడా అసహనంగా మొబైల్ పట్టుకుని వాట్సప్ మొత్తం పైకి కిందకి జరుపుకుంటూ ఉంటాను , కానీ సరిగ్గా మనసు విప్పి ఎవరితోనో మాట్లాడను ఎందుకంటే నాకు *టైం లేదు* కాబట్టి రాత్రి పొద్దుపోయేదాకా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూనే ఉంటాను, ఇన్స్టాలో వీడియోలు చూస్తూనే ఉంటాను , పొలిటికల్ పనికిమాలిన వార్తలు వీడియోలు చూస్తూనే ఉంటాను , సినిమా వాళ్ళ పనికిమాలిన రీల్స్ చూస్తూనే ఉంటాను, కానీ నాకోసం నేను కొద్దిపాటి సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నాను ఎందుకంటే *నాకు టైం* లేదు కాబట్టి.. ఎంతో కష్టపడి జీవితాన్ని సింపుల్ గా స్పీడ్ గా పనులన్నీ అయ్యేట్లు చేసుకోగలిగినా.. ఇంకా అంటూనే ఉంటాను *నాకు టైం* లేదు అని మనకి 24 గంటల సుదీర్ఘ సమయం ఇచ్చినప్పటికీ మనం టైముని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ మళ్ళీ *నాకు టైం* లేదు అంటూ టైంనే తిడతాం.. మరి ఇవే 24 గంటలు మన అమ్మానాన్నలకి ఉన్నాయి కదా అందులోనే వాళ్లు కనీస సౌకర్యాలతో ఎంత చక్కగా ఆనందంగా సమయాన్ని ఉపయోగించుకున్నారు ఒకసారి ఆలోచించండి… కాబట్టి నాకు టైం లేదు అనడం కేవలం మన ఫెయిల్యూర్ మాత్రమే అని ఒప్పుకోవడం…. కాదంటారా? ఒక్కసారి ఆలోచించి సమాధానం చెప్పండి… ఎక్కడో చదివిన 4 ఇంగ్లీష్ లైన్లకి నాకూ కలిగిన భావనలు స్వేచ్ఛనువాదంగా రాశాను, ఎందుకంటే ఇది మీ అందరికీ చెప్పడానికి *నాకు టైం* ఉంది కాబట్టి…. చదవడానికి *టైమ్ లేదు* అనకండి, జీవితాన్ని కొత్తగా చూడటం ఆరంభించండి… మనకు బోలెడంత *టైమ్ ఉంది*... ఎవరో పంపారు, ఎవరో రాశారు… ఐతేనేం, అందరికీ మంచిదే, అవసరమే… పరుగు, పరుగు… ఎందాకా..? అదే ఈ కథనం ప్రశ్న… కాస్త టైమ్ తీసుకుని చదవండి, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, దానికి పెద్దగా టైమ్ పట్టదు కదా… పరుగు తీసేకొద్దీ, స్ట్రెస్, యాంగ్జయిటీ, బీపీ, సుగర్, నో మనశ్శాంతి... కూల్, కూల్, బెటర్ యుటిలైజ్ టైమ్... *ఆఫ్టరాల్ టైమ్*...! come what may, be ready to face...
13 likes
13 shares