జడ్చర్ల: పగిలిన మిషన్ భగీరథ పైపు లైన్... రోడ్డుపై నీరు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో శనివారం మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో జాతీయ రహదారి-44 పై కొత్త బస్టాండ్ కు వెళ్లే దారిలో నీరు ఎగసిపడుతోంది. ఈ సంఘటనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ముందుకు వెళ్లలేక రివర్స్ తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
#🆕Current అప్డేట్స్📢 #📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣