Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
తిరుమల వేంకటేశుని వైభవం
46 Posts • 3K views
PSV APPARAO
702 views 13 days ago
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #టీటీడీ న్యూస్!!!📰 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS 👆 *భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు* తిరుమల, 2025, అక్టోబర్ 08 : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
16 likes
2 shares
PSV APPARAO
597 views 18 days ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల వేంకటేశుని వైభవం 👆తిరుమలలో కన్నులపండువగా భాగ్ సవారి ఉత్సవం తిరుమల, 2025 అక్టోబర్ 03: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
17 likes
6 shares
PSV APPARAO
1K views 23 days ago
#తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు #తిరుమల వేంకటేశుని వైభవం 🙏🕉️ మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు🕉️🙏 తిరుమల, 2025 సెప్టెంబర్ 28: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. గ‌రుడ వాహ‌నం సాయంత్రం 6:30 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
9 likes
17 shares
PSV APPARAO
622 views 24 days ago
#తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 2025 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుకి ప్రత్యేకంగా శ్రీవిల్లి పుత్తూరు నుండి మాలలు 💮💐🙏 #టీటీడీ.. సమాచారం 👆 *తిరుమల శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు* తిరుమల, 2025 సెప్టెంబర్ 27: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. *రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :* ఆండాళ్ మాల – మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు. *భూదేవి అవతారం గోదాదేవి* శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్ మారియప్పన్, ఈవో శ్రీ చక్కరై అమ్మాళ్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్, త‌దిత‌రులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
8 likes
10 shares