కొత్త (చెత్త) పలుకు.. 😁🤠
5 Posts • 311K views
P.Venkateswara Rao
856 views 17 days ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *నిస్సంకోచంగా… నిర్మొహమాటంగా… బాలకృష్ణను కడిగేసిన రాధాకృష్ణ..❗❗* October 5, 2025🎯 సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకుకు పాఠకులు ఎక్కువ… ఏ ఇతర పత్రికల్లోనో కనిపించే సంపాదకీయ వ్యాసాలు చదివేవాళ్లే ఉండరు… ఉత్త నస… పసలేని రాతలు… ఐతే రాధాకృష్ణ వ్యాసాలకు అతి పెద్ద మైనస్… జగన్‌పై విషం, చంద్రబాబుపై భక్తి… సో, ఏపీ రాజకీయాలకు సంబంధించిన తన అభిప్రాయాలన్నీ వెయ్యి శాతం బయాస్డ్… తన వ్యాసాల్ని చదివేవాళ్లు అది తెలిసీ చదువుతూనే ఉంటారు… ఈసారి పూర్తి భిన్నం… ఈరోజు తను రాసిన వ్యాసం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్… బ్యాలెన్స్‌డ్… ఓ జర్నలిస్టుగా తన అనుభవం, తన పరిణతి కనిపించాయి… మామూలుగా తన వ్యాసాల్ని నిశితంగా విమర్శించే సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం ఈరోజు వ్యాసాన్ని మెచ్చుకుంటున్నారు తమ పోస్టుల్లో… కాస్త కటువుగా, పరుషంగా చెప్పాలంటే… బాలకృష్ణ బట్టలిప్పేశాడు… మామూలుగా బాలకృష్ణ మీద ఏదైనా రాయడానికి చాలామంది సంకోచిస్తుంటారు… కానీ ఆ క్యాంపు మనిషే అయి ఉండీ రాధాకృష్ణ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కడిగేశాడు… తన వ్యాసంలోని కొన్ని వాక్యాలు ఇలా… ‘‘తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు – నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు. మూడో పర్యాయం. సభ మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి, రెండు జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమే! నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్లజోడును తలపైకి నెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం కచ్చితంగా అభ్యంతరకరమే. బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చునుగానీ ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్‌రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారేమో తెలియదు. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏక వచనంతో ఎవరినీ సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదుగానీ బాలకృష్ణ ‘వాడు వీడు’ అన్న పదాలను వాడారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడైనా బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైనా నష్టమైనా ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు, విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే’’ హవ్వ… నవ్విపోదురుగాక! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు… అని చంద్రబాబును చూసి కూడా జాలిపడ్డాడు రాధాకృష్ణ… బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా, ఆయన చిరంజీవికి కూడా ఫోన్‌ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది… అని బాలకృష్ణ మాటలతో చంద్రబాబు ఇలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు ఆర్కే… ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపు కులజాఢ్యం ఎలా ప్రబలిందో ఘాటుగానే రాశాడు… నిజమే, కేవలం వాళ్ల కులస్తులు వోట్లేస్తేనే గెలుస్తారా ఈ కులరాజకీయ నేతలు..? టీడీపీ కమ్మ పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ, జనసేన కాపు పార్టీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేసేంతగా కులం- రాజకీయం కలగలిసిపోయి, దానికి ఫ్యానిజం తోడై… ఏపీ రాజకీయాలు నిజంగానే కంపు కొడుతున్నాయి..!! ఓ కొత్త విషయం తెలిసింది… ‘‘బాలకృష్ణను మాత్రమే కాదు– ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ కే.కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖరరెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా? కాదా? అన్నది వేరే విషయం…’’
4 likes
11 shares
P.Venkateswara Rao
580 views 17 days ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *జగన్ ను అలా అనడం తప్పు.. బాలకృష్ణకు సభా మర్యాదలు తెలియవా❓* 05.10.2025🎯 అప్పట్లో ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల మీద నిషేధం ఉండేది.. ఇది కొంతకాలం పాటు సాగింది. ఇటీవల ఆ నిషేధం ఎత్తేశారు. చంద్రబాబు మీద ప్రేమ ఉండి.. బాలకృష్ణ మీద ద్వేషం కలగడం ఏంటో.. అసలు వేమూరి రాధాకృష్ణకు.. బాలకృష్ణకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు.. అందువల్లే కావచ్చు తాజా ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బాలకృష్ణ మీద అమాంతం లేచారు. మర్చిపోతున్న విషయాన్ని మరోసారి గెలికారు. సింపుల్ గా చెప్పాలంటే మానిపోతున్న గాయం మీద కారం వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల శాసనసభలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సైకో గాడు అంటూ మండిపడ్డారు. స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని జుట్టు మీద గాగుల్స్ పెట్టుకొని.. అలా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటని అవి సభ మర్యాదలు ఎలా అవుతాయని రాధాకృష్ణ ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయి అంటూ వాపోయారు. “బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు.. నాటి నగర కమిషనర్ ఆర్పి సింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదుట ఒక నివేదిక ఉంచారు. ఆ నివేదికను చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నవ్వి ఊరుకున్నారు.. చర్యలు ఏమొద్దులేవయ్యా అంటూ నగర కమిషనర్ కు సూచించారు. నాటి ఆ ఘటనలో బాలకృష్ణను కాపాడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణకు కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నది జగన్.. బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి” ఇలా కీలక విషయాలను బయటపెట్టారు వేమూరి రాధాకృష్ణ. బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని.. పేరుకు పరామర్శ అయినప్పటికీ.. అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని వేమూరి రాధాకృష్ణ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆయనను చల్లపరచడానికే చంద్రబాబు ప్రయత్నించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు.. బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు. కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రాధాకృష్ణ బయటపెట్టారు. రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాసం రాశారు కాబట్టి దీనిని వైసిపి నాయకులు మరింత ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే తొలిసారి ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ బాధిత పక్షంగా కనిపించారు కాబట్టి వైసిపి ఊరుకోదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం వదులుకోవడం లేదు. కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ప్రచురిస్తున్నారు. తన చానల్లో ప్రసారం చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా రాధాకృష్ణ వెనుకాడటం లేదు. రాధాకృష్ణలో ఈ మార్పును చూసిన కూటమినేతలు ఆశ్చర్యపోతున్నారు. తాజా కొత్త పలుకులో కూడా వేమూరి రాధాకృష్ణ అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు. దీంతో కూటమినేతలకు మరోసారి షాక్ తగిలినట్టే. అన్నట్టు ఏపీలో కులాల కుంపట్లు ఇప్పుడే కొత్తగా ఉన్నాయా.. గతంలో లేవా.. కులాల కుంపట్ల మీద చలికాచుకున్న వారిలో ఎంతమంది లేరు.. ఇప్పుడే ఏపీలో ఆ జాడ్యం మొదలైనట్టు రాధాకృష్ణ చెప్పడం భలే వింతగా ఉంది.
13 likes
15 shares
P.Venkateswara Rao
549 views 1 months ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…❗* September 14, 2025✍️ ఈమధ్య… కాదు, చాన్నాళ్లుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసాలు ఆవుకథలు అవుతున్నాయి… ఈరోజూ అదే ధోరణి… తనలోని పాత్రికేయుడి పాత్రికేయ విజ్ఞత కనుమరుగవుతూ పక్కా జగన్ ద్వేషి మాత్రమే బలంగా ప్రదర్శితం అవుతున్నాడు… సోమాలియా ఆకలిచావులు, ఉక్రెయిన్ యుద్దం, అమెరికా డ్రగ్ కార్టెల్స్, పాలస్తీనా కష్టాలు దగ్గర నుంచి… ప్రపంచంలో ఏం జరిగినా… దాన్ని అర్జెంటుగా జగన్‌కు ముడివేసి ఏవో జగన్ వ్యతిరేక కథలు చెప్పడం అలవాటైపోయింది ఫాఫం… ఎస్, జగన్ పార్టీ అడ్డదిడ్డం విధానాలు, పాలన పోకడల మీద రాయాలి, రాయొద్దని ఎవరూ అనరు… పైగా తెలుగుదేశం అనుకూల మీడియా కాబట్టి, చంద్రబాబు అనుంగు శ్రేయోభిలాషులు గనుక వైసీపీ వ్యతిరేకత, జగన్ అంటే ద్వేషం సహజమే అనుకుందాం కాసేపు… కానీ చివరకు నేపాల్ జనం తిరుగుబాటును కూడా తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టడం ఏమిటి..? జగన్ కారకుడని కాదు, ఏదేదో చెబుతూ… జగన్ కేసులు, చివరకు పాడిందే పాటరా అన్నట్టుగా వివేకా హత్య కేసు దాకా ఏదో చర్చించి, ఏదో చెప్పి… మళ్లీ మళ్లీ అదే ఉతుకుడు బాగోతం.,. జగన్ అవినీతి కేసులు, వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం న్యాయస్థానాల విశ్వసనీయతను దెబ్బ తీయడం లేదా..? ఇదుగో ఇలాంటివే జనంలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతాయి అనేది అంతిమంగా రాధాకృష్ణ ముక్తాయింపు… తమ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పాదుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని బాధ్యులపై లేదా? అని ప్రశ్నిస్తున్నాడు… ఇప్పటికిప్పుడు జగన్ తన అక్రమాస్తుల కేసులో దోషి అని తేలితే అప్పుడు కోర్టులపై జనంలో విశ్వాసం పెరిగి, వాటి క్రెడిబులిటీ పెరుగుతుందన్నమాట… అంతేనా సర్..? నేపాల్ మాత్రమే కాదు… శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ అల్లర్లు ఏదో ఒక కారణంతో అంటుకున్నవి కావు… అనేక కారణాల కలయిక, జనం కడుపులు మండుతున్నాయి… ఏదో ఒక ఇష్యూతో అవి బద్ధలవుతున్నాయి… ఇదే కారణం అని చెప్పడం, తేల్చేయడం, నిర్దారించడం కష్టం… విదేశీ హస్తాలనూ తోసిపుచ్చలేం… అయితే వాటిని తీసుకొచ్చి తన ప్రాంత నాయకుల మెడకు చుట్టేసి, ఆ అల్లర్లను కూడా ఇక్కడ తమ స్ట్రాటజిక్ పొలిటికల్ ప్రాపగాండాకు వాడుకోవడమే ఓ పాత్రికేయ విషాదం… అన్నట్టు, నేపాల్‌లో ఓ మీడియా హౌజును కూడా ఆందోళనకారులు తగులబెట్టారు… దానికి కారణమేమంటారు రాధాకృష్ణ సాబ్..? జస్ట్ ఆస్కింగ్.,.!!
18 likes
7 shares
P.Venkateswara Rao
7K views 2 months ago
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *వైఎస్ ఫ్యామిలీకి అక్కడంత సీనే లేదట… అదీ బాబు దయేనట..❗❗* August 18, 2025✍️ ‘‘నిజానికి పులివెందులలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రజలలో మద్దతు లేదు… 1996 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది… అప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు… చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు… జిల్లా ఎస్పీగా ఉమేష్‌ చంద్ర ఉన్నారు… ఎన్టీఆర్‌ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకు నాటి ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి… దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుది… ఈ నేపథ్యంలో కడప పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు… ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్‌ చంద్రను ఆదేశించారు… ఉమేష్‌ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు… మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారు… దీంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది… చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకొని పులివెందులలో కాస్త చూసీ చూడనట్టు వెళ్లవలసిందిగా అధికారులను ఆదేశించారు… ఫలితంగా కేవలం ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి గట్టెక్కి పరువు దక్కించుకున్నారు… దీన్నిబట్టి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించగలిగితే పులివెందులలో వైఎస్‌ కుటుంబానికి చెప్పుకొనేంత సీన్‌ లేదని అర్థమవుతుంది… ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాలను చూడాల్సి ఉంది…’’ ఇదంతా మొన్నటి జెడ్పటీసీ ఎన్నికల సరళి, ఫలితాలకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మార్క్ విఫల సమర్థన… సరే, ఆయన చెప్పుకొచ్చిన కారణాల గురించి కాదు గానీ… నిజంగా పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ ఆదరణ లేదా..? బెదిరింపులు, దబాయింపులు, దాష్టీకాల ద్వారానే గెలుస్తూ వస్తోందా..? తను చెబుతున్న ఆ ఎన్నికల సంగతికే వద్దాం… ఆ ఎన్నికల్లో 42 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు రాగా, తెదేపా కూటమి 19 సీట్లు, MIM ఒక సీటు గెలిచాయి… వైయస్సార్ తో పాటు కాంగ్రెస్ నుండి మరో 21 మంది గెలిచారు … వాళ్ళు గెలవగా లేనిది వైయస్సార్ గెలవలేడా… !? నిజానికి టీడీపీ పుట్టిన తర్వాత 1984 లోకసభ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ కడప నుండి గెలిచింది … ఆ టైంలో వైయస్సార్ అసెంబ్లీలో ఉన్నాడు… ఆ తర్వాత ఇప్పటివరకు టీడీపీ అక్కడ గెలవలేదు … వైయస్సార్ 1989 , 1991 , 1996 , 1998 ఎన్నికల్లో గెలిచాడు లోకసభకు … వివేకానంద రెడ్డి 1999 , 2004 ఎన్నికల్లో గెలిచాడు… 2009 , 2011ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి… తరువాత 2014 , 2019 , 2024 ఎన్నికల్లో వరుసగా అవినాష్ రెడ్డి గెలిచాడు… రాష్ట్రం అంతా కూటమి ప్రభంజనం కనిపించిన 2024 ఎన్నికల్లో కూడా అవినాష్ రెడ్డి గెలిచాడు… కూటమి అభ్యర్థి మాత్రం గెలవలేదు … నిజమే… చంద్రబాబు ఉమేష్ చంద్రను చూసీచూడనట్లు పొమ్మన్నాడనే మాటను కన్ఫర్మ్ చేయటానికి ఉమేష్ చంద్ర లేడు… నో, నో అని ఖండించడానికి వైయస్సారూ లేడు… చంద్రబాబు మాత్రమే కన్ఫర్మ్ చేయాలి … కఠినంగా వ్యవహరించమని తనే ముందుగా ఉమేష్ చంద్రకు చెప్పి, తరువాత ఏ కారణాలతో చూసీచూడనట్టు వెళ్లాలని చెప్పాడు..? ఆ మధ్యలో ఏం జరిగింది చంద్రబాబూ..!!
55 likes
73 shares