Sekhar Digitals - 9603197203
ShareChat
click to see wallet page
@sekhardigitals
sekhardigitals
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేలంక గ్రామంలో గోదావరిలో తృటిలో తప్పిన ప్రమాదం...* రైతులు పడవ దిగే క్రమంలో పడవపై విరిగి పడ్డ ఒడ్డు, ఆ సమయంలో పడవలో ఉన్న పదిమంది రైతులు గోదావరిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం... *సిసి రహదారితో సహ ఒడ్డు పడవపై కూలడంతో గోదావరిలో మునిగిపోయిన పడవ..* రైతులు గోదావరి మధ్య లంకలో పొలం పనులుకు వెళ్లివస్తుండగా చోటు చేసుకున్న ఘటన.... ఒడ్డుకూలి పడవపై పడి మునగడంతో గోదావరిలోకి దూకి ఈదుకుంటూ ఓడ్డుకు చేరిన రైతులు... రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్న లంక వాసులు... వరదలతో నదీ కోత కారణంగా జరుగుతున్న ప్రమాదాలు, కోత నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం *బస్ స్టాండ్ పునరుద్ధరించాలని రిలే నిరాహార దీక్ష...*🚌 ముమ్మిడివరం - నిరుపయోగంగా ఉన్న ఆర్ టిసి బస్ స్టాండ్ ను వెంటనే పునరుద్ధరించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చికురుమిల్లి రవి కుమార్ డిమాండ్ చేశారు. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక సమైఖ్యాంధ్ర శిబిరం వద్ద శనివారం రవి కుమార్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ ఆర్టిసి అధికారుల నిర్లక్ష్యంతో గత ఐదు యేళ్లుగా బస్ స్టాండ్ కు బస్ లు రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్ ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితులలో,ప్రజా ప్రయోజనార్డం రిలే నిరహార దీక్ష చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిరుపయోగంగా ఉన్న ఆర్టిసి బస్ స్టాండ్ కు బస్ లు రాకపోకలు పునరుద్ధరించే వరకు నిరాహార దీక్ష ను కొనసాగిస్తానని హెచ్చరించారు.ఈ దీక్షకు రిపబ్లికన్ పార్టీ నాయకుడు శరత్ ,సిపిఎం నాయకుడు సఖిలే సూర్యనారాయణ లు సంఘీభావం తెలిపారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - సురేష్గారి ం్ర్యంలో ~ச= =3505~5ச e US Suச டப ப {  ವ56 {ು {ು [ a సురేష్గారి ం్ర్యంలో ~ச= =3505~5ச e US Suச டப ப {  ವ56 {ು {ು [ a - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ *ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు.* *16న ఉదయం 7.50 కు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని.* *ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ.* *ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకోనున్న ప్రధాని.* *ఉదయం 11.45 కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ.* *మధ్యాహ్నం 1.40 కి సుండిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ.* *మధ్యాహ్నం 2.30 కు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన.* *సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ.* *సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని సాయంత్రం 4.40 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని దిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ.* ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం* అమరావతి : ఆర్టీసీ బస్సులన్నీ ఈవీలుగా మార్చాలని ప్రతిపాదన పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు నాలుగేళ్లలో మొత్తం బస్సులను మార్చాలని నిర్ణయం ప్రస్తుతబస్సుల స్థితిపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశం
🗞ప్రభుత్వ సమాచారం📻 - ARSRTC ARSRTC - ShareChat
#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 *ముమ్మిడివరం లో ఆర్.టి.సి బస్టాండ్ కొరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాల మహానాడురాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి రవి కుమార్* గడిచిన ఐదు సంవత్సరాలనుండి ప్రయాణికులు సరైన బస్టాండ్ లేక రోడ్డు పైన పడిగాపులు కాస్తున్నారు..... ప్రభుత్వంకి సంబందించిన ఆర్.టి.సి బస్టాండ్ ప్రైవేట్ వారు చేతిలో పెట్టడం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు... వెంటనే ముమ్మిడివరం లో ఆర్ టి సి బస్టాండ్ ఏర్పాటు చెయ్యాలి అంటూ మాల మహానాడురాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి రవి కుమార్ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు... ప్రజలు కోసం ప్రయాణికులు కోసం ఎన్ని రోజులు అయ్యిన దీక్ష చేస్తాను... నా ప్రాణం పోయిన సరే ప్రయాణికులు సరైన బస్టాండ్ ఏర్పాటు చేసే వరకు పోరాడుతాను... అంటూ ప్రభుత్వం కి డిమాండ్ చేస్తున్నాను... ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 - ShareChat
#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం *రహదారిని డంపింగ్ యార్డుగా మార్చిన మినీ మున్సిపాలిటీ అధికారులు* ముమ్మిడివరం నుంచి కొత్తలంకకు వెళ్లే రహదారిని మినీ మున్సిపాలిటీ సిబ్బంది డంపింగ్ స్పాట్‌గా మార్చేసారు.. నగర పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తనీ, సెప్టిక్ ట్యాంకుల మరుగుదొడ్డి వ్యర్థాలనీ రహదారిపైనే "జాతీయ సమ్మేళనం" చేస్తూ, ప్రయాణికులకు ఉచిత "దుర్గంధ పరిమళం" అందిస్తున్నారు.. ఈ "చెత్త ఉత్సవం"లో అగ్రహారం, నేరెళ్లపాలెం, కొత్తలంక, బందరుపాలెం వంటి గ్రామాల ప్రజలు, వేలాది వాహనాలు, వలీబాబా దర్గా భక్తులు నిత్యం "సుగంధ యాత్ర" చేస్తున్నారు. అధికారులు మాత్రం "చూడలేదు, వినలేదు, మాట్లాడలేదు" అన్నట్లు మౌనంగా సినిమా చూస్తున్నారు. స్థానికులు జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. అప్పటివరకూ, ఈ రహదారిని "స్వచ్ఛ భారత్"కి బదులు "చచ్చిన భారత్"గా ఆస్వాదించమని సిబ్బంది సూచన! ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 - C 4{028 0 C 4{028 0 - ShareChat
#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ అబ్దుల్ కలాం ఆకాంక్షించిన రీతిలో పంచాయతీలు • పునర్వ్యవస్థీకరణతో గ్రామ పంచాయతీలు బలోపేతం • స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా గ్రామ పంచాయతీలు • గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు • 10 వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూర్బన్ పంచాయతీలుగా గుర్తింపు • పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో రూర్బన్ పంచాయతీలు • నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ • గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు • పంచాయతీరాజ్ లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు • గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం • పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి... నాలుగు నెలలపాటు సాగిన చర్చలు గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు ‘పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారు. ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ శాఖల ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో నాలుగు నెలల పాటు పలు దఫాలు చర్చలు చేశారు. 10 వేలు జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు చేశారు. స్వతంత్ర యూనిట్లుగా 13,351 గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించింది. రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బంది నియామకం... సేవలు మరో మూడు గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతోపాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా వీరిని రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో నియమిస్తారు. నూతన విధానంలో గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీల్లో ఉన్న విధంగా ప్లానింగ్, పారుశుధ్యం, మంచి నీటి సరఫరా మరియు ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అవుట్‌ సోర్సింగ్/కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు. అవసరాన్ని బట్టి ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. గ్రామ సచివాలయం బాధ్యతలతోపాటు భవనాలు, లే అవుట్ల నిబంధనలు వంటి సేవలనూ వీరు అందిస్తారు. ఇంటర్ కేడర్ ప్రమోషన్లకు వెసులుబాటు మినిస్టీరియల్ మరియు క్షేత్ర స్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. వీరికి క్షేత్ర స్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ కేడర్ ప్రమోషన్లు అమలవుతాయి. దీంతోపాటు డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్ లకు విధివిధానాలు రూపొందించింది. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పని చేయాలి. సంస్కరణల్లో భాగంగా పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు, ఆన్ లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షిస్తారు. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 - ತಾರಲಯನ , [ೌಐಖಂವಾಯತಿ ~ ತಾರಲಯನ , [ೌಐಖಂವಾಯತಿ ~ - ShareChat
#🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA) లకు ప్రభుత్వం తీపి కబురు* VOAల స్థిరమైన 3 సంవత్సరాల పదవీ కాలం నిబంధనను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మెమో జారీ చేసింది. ▪️ఇకపై, గ్రామ సంస్థలకే VOAను ఎంపిక చేయడం లేదా తొలగించడం చేసే అధికారం ఉంటుంది. ▪️పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ▪️ఎంపిక/తొలగింపు జరిగితే, మండల సమాఖ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆ తీర్మానాన్ని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అప్‌లోడ్ చేయాలి. ▪️ఆర్థిక అక్రమాలు జరిగితే, PD, DRDA అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి.
🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 *స్క్రీన్లతో చూపు చీకట్లోకి..!*📱 చిన్నవయసులోనే దృష్టిలోపం.. *ఫోన్లు,టీవీలపై ఎక్కువ సమయం గడపడమే ప్రధానకారణం..* సమయానికి గుర్తించకపోవడంతో అధిక తీవ్రత.. *ఆహారపు అలవాట్లలో మార్పు ఒక కారణం..* ఫోన్లతో పిల్లల్లో దూరమవుతున్న సృజనాత్మకత.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - ஐுகி ಅವುಲುನ್ನ ವಿನ್ನಾರುಲು అనారోగ్య వెంటాడుతున్న . సమస్యలు . ஐுகி ಅವುಲುನ್ನ ವಿನ್ನಾರುಲು అనారోగ్య వెంటాడుతున్న . సమస్యలు . - ShareChat
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *అగ్నిప్రమాద ఘటన పై పితాని బాలకృష్ణ దిగ్భ్రాంతి..* రాయవరం అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.. డాక్టర్. బి.ఆర్.కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం రాయవరం మండలం, కొమరిపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల వైసీపీ రాష్ట్ర సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు..నిరుపేదలైన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఘటనలో గాయపడిన వారికి నష్టపరిహారాన్ని ప్రకటించాలని కోరారు. అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన బాధితులు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - ஜிஇலிடு e0 [మాదం ஜிஇலிடு e0 [మాదం - ShareChat