nvs subramanyam sharma
ShareChat
click to see wallet page
@nvssharma
nvssharma
nvs subramanyam sharma
@nvssharma
ఐ లవ్ షేర్ చాట్
🌺🌺🌺🌹ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्॥🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱హరహర మహాదేవ🕉️
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
🌺🌺🌺🌹।।ॐ श्री मुरुगाय नमः।।🌷🌺🌺🌺 🙏🏵️🙏సుబ్రహ్మణ్యం... బ్రహ్మజ్ఞానం!🙏🏵️🙏 కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, శరవణభవుడు, షాణ్మాత్రుడు, ఆర్ముగం, మురుగన్‌, దండాయుధపాణి. ఈ పేర్లతో పిలిచే కుమారస్వామి తారకాసుర సంహారం నిమిత్తం జన్మించిన శివ పుత్రుడు. పై పేర్లన్నీ ఆయన శక్తిని, మహిమను, అవతార రహస్యాన్ని తెలియజెప్పేవే. ఆయనే బ్రహ్మజ్ఞాన స్వరూపంగా ఎలా మారాడో తెలుసా?కుమారస్వామి పసివాడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో శివుడు పార్వతికి ప్రణవ మంత్ర అర్థాన్ని వివరించాడు. ఆమెతో పాటు కుమారుడూ ఆ మంత్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది అతనికి. దానికితోడు దేవ సేనకు నాయకత్వం రావడంతో కుమారుడి గర్వం మరింత పెరిగింది. అది ఎంత వరకు వెళ్లిందంటే. బ్రహ్మదేవునితో వాదనకు దిగి, ఆయన్నే పరీక్షించే సాహసం చేశాడు. వాదోపవాదాల అనంతరం బ్రహ్మను బంధించాడు. విషయం తెలుసుకున్న శివుడు కుమారుణ్ని పిలిచి... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వేరు వేరు రూపాల వారైనా అందరి శక్తులు సమాహారం సృష్టికి అత్యవసరమని వారి తత్వాన్ని చెప్పాడు. దీంతో తాను చేసిన తప్పు తెలుసుకున్న కుమారస్వామి ప్రాయశ్చిత్తం కోసం యోగ సాధన చేశాడు. ఆ సాధనలో తన శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి మేల్కొంది. అది క్రమంగా మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి చక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. అదే బ్రహ్మ జ్ఞానం. సు అంటే మంచి, బ్రాహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానాన్నే సుబ్రహ్మణ్య తత్త్వం అని కూడా అంటారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే కుండలినీ శక్తి షట్చక్రాలను దాటి సహస్రారం చేరే వరకు సర్పరూపంలో మెలికలు తిరుగుతూ వ్యాపించి ఉంటుంది... అందువల్లనే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆలయాల్లో కార్తికేయుణ్ణి సర్పరూపునిగా కొలుస్తారు.సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి. ఇది పురి విప్పితే ఓంకారానికి ప్రతీక. ఆయుధం శూలం. ఇది సునిశితమైన మేధా శక్తికి ప్రతీక. వల్లీ, దేవసేనలు దేవేరులు. వీరు ఇచ్ఛా,జ్ఞాన శక్తులకు ప్రతీకలు. దేశంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు. ఇవన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. అవి... తిరుత్తని, పళని, స్వామిమలై, తిరుచ్చందూర్‌, తిరుప్పర కుండ్రం, పదముదిర్‌ చోలై. తెలుగు రాష్ట్రాల్లో బిక్కవోలు,అత్తిలి,రామకుప్పం, మోపిదేవి, నాగులమడక. ఎంతో ప్రసిద్ధి పొందాయి... #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩 .
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
00:56
🌿🌼🙏।।ॐ श्री मुरुगाय नमः।।🙏🌼🌿 🌺 సుబ్రహ్మణ్య స్వామి 🌺 ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ కైలాసం వైపు వెడుతూ వుండగా సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ గారిని ఆపి “ బ్రహ్మమనగా ఏమి? ప్రణవమునకు అర్ధం తెలుసా? “ అని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మ అన్నారు, “ బ్రహ్మము అనగా నేనే “. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మని చెరసాలలో బంధించారు. వెంటనే పరమశివుడు వచ్చి, “నాన్నా, బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి” అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు. అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, “ నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని. దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉంటాడు. అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తేజోమయమైన సుబ్రహ్మణ్య రూపం వచ్చింది. 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 . . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
☀️శుభ మధ్యాహ్నం - { n  [ { n  [ - ShareChat
సాధ్వీ సీతకు శ్రీరాముని వియోగం ఎలా కలిగింది. వాల్మీకి రామాయణంలో సీతవియోగంకి ప్రధాన కారణం అయోధ్యలో ధోబీ (చాకలి వాడు ) వేసిన అనుమానం. కాని ఇక్కడ చెప్పుకొనేది ఒక లోకప్రచార కథ , వాల్మీకి రామాయణం లేదా తులసీదాసు రామచరిత మానస్‌లో కాని కనిపించదు. ఈ కథ ప్రాచీన జానపద రామాయణాలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రబంధాలు లో కనిపిస్తుంది. కొన్ని ఉత్తర భారత ప్రాచీన మౌఖిక కథనాల్లో “సీత చిన్నతనంలో చేసిన ఒక తప్పు కారణంగా భర్తవియోగం శాపం పొందింది” అని చెప్పబడింది. ఇక కథలోకి వెళితే పూర్వo మిథిలానగరంలో ధర్మపరుడైన జనక మహారాజు పాలన సాగిస్తున్నాడు. ఒకసారి జనకుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు, హలరేఖ(నాగలియొక్క చాలు)నుండి బంగారు పెట్టెలో ఓ పాప (సీత) లభించింది. భగవంతుని ప్రసాదంగా ఆమెకు సీత గా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు . జనకుని కుమార్తెగా ఆమెను జానకి అని కూడా పిలిచారు. ఆమె రూపం, గుణం, లావణ్యం ప్రతిరోజూ శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ పోయాయి. ఒక రోజు సీత తన చెలికత్తెలతో కలిసి తోటలోఆడుకొనుచుండగాఒక చెట్టుపై ఇద్దరు సుందరమైన తిత్తిరి పక్షులు / చిలుకలు కనిపించాయి. వారియొక్క సంభాషణ ఈ విధంగా ఉంది భూమిపై ‘శ్రీరాముడు’ అనే మహారాజు పుట్టి, ఆయన భార్యగా సీతా దేవి పది ఒక్క వేల సంవత్సరాలు సౌభాగ్యంతో జీవిస్తారు. ఒక ధన్యమైన జంటగా సీతా రాములు జగత్ ప్రసిద్ది పొందుతారు. ఈ మాటలు వినిన సీత అబ్బురపడి సఖులచేత ఆ చిలుకలను పట్టించుకొని, ప్రేమతో అడిగింది వారి గురించి , మేము మహర్షి వాల్మీకి ఆశ్రమంలో నివసిస్తాము. అక్కడ ప్రతిరోజూ ఆయన ‘రామాయణం’ అనే మహాకావ్యం శిష్యులకు బోధిస్తారు. మేము విని విని రామచంద్రుడి లీలలు తెలుసుకున్నాము. అయోధ్య రాజు దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు . యజ్ఞ ఫలం గా దశరథునికి శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని 4 పుత్రులు కలుగుతారు. తరువాత శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా వచ్చి, శివధనుస్సును విరిచి సీతతో వివాహం జరుగుతుంది. చిలుకలు చెప్పిన ఈ సంగతులు సీత చెవులకు అమృతంలా అనిపించాయి. ఆమె రామచంద్రుని గుణాలు చెప్పండి అని మరింత అడిగింది. శ్రీరామచంద్రుడు సర్వ సౌందర్యమూర్తి, అన్ని ఐశ్వర్యాలతో నిండినవాడు. రామునితో సహవాసం చేసే జనకనందిని సీత కూడా ధన్యురాలు అయింది అప్పుడు సీత నవ్వుతూ చెప్పింది “నేనే ఆ జనకనందిని సీతను. రాముడు ఇక్కడికి వచ్చి నన్ను వరించగానే మిమ్మల్ని విడిచి పెడతాను అప్పటివరకు నా ఇంటిలో సుఖంగా ఉండండి.” అని చెబుతుంది. ఇది విని ఆ జంట చిలుకలు ఆందోళనతో ఇలా అన్నాయి “మేము అరణ్యపక్షులు. చెట్లపై స్వేచ్ఛగా విహరించడం మాకు ఆనందం కలిగిస్తుంది. నేను (సుగ్గి) గర్భవతిని. నా గూటికి వెళ్లి పిల్లలను కనాలి. తరువాత మళ్ళీ వస్తాను. దయచేసి విడిచేయండి.” అని ఎంతగానో ప్రాధేయ పడినవి ఆ చిలుకలు. కానీ సీత విడువలేదు. సుగ్గి కన్నీళ్లతో వేడుకున్నా, సీత తన చిన్నపిల్లల హఠం వదల్లేదు. అప్పుడు సుగ్గి కోపంతో శపించింది “నన్ను నా గర్భదశలో భర్తతో వేరు చేస్తే, నీవు కూడా గర్భదశలో భర్త వియోగం అనుభవించాలి!”అని చెప్పి " రామ రామ” అంటూ ప్రాణాలు విడిచింది. వెంటనే దివ్య విమానంలో స్వర్గానికి చేరింది. కొద్దిసేపటికి ఆమె భర్త తన పత్ని వియోగాన్ని భరించలేక దుఃఖం తో ప్రాణాలు వదిలాడు. అలా సీత జీవితంలో దుఃఖానికి కారణమయ్యే శాపం ఏర్పడింది ఆ సుగ్గి (ఆడ చిలుక) తరువాత జన్మలో **అయోధ్యలో ఒకచాకలి వానిగా గా పుట్టి, సీతపై అనుమానాన్ని మోపాడు. ఆ కారణంగా సీతకి వనవాసం, రాఘవ వియోగం సంభవించాయి. వాల్మీకి రామాయణం లోని ఉత్తరకాండ లో ప్రధాన శ్లోకాలలో 1. ధోబి మాటలు (చాకలి వాడు) ఒక ధోబీ తన భార్యను ఇంట్లోకి తీసుకోకుండా అన్న మాట “అహం హి రాజా బహవో జనేశు సదా చరామి ప్రతిభాసమానః । రామో హి నారీం రక్షసగృహస్థాం స్వయముపనీతాం ప్రజనోపజప్తుః ॥ (నేను రాజవంశీయుడిని. ప్రజలలో గౌరవంగా తిరుగుతున్నాను. రాముడు రాక్షసుని ఇంటి నుండి వచ్చిన భార్యను స్వీకరించాడు. కానీ నేను అలాంటి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించను.”) 2. మంత్రులు రామునితో అన్నమాటలు "ఇదం హి జనం వక్తి, సుతసంకీర్తనం మహత్ । రాజా దోషం న కర్తవ్యః ప్రజానాం ప్రతిభావనః ॥” (రాజా! ప్రజల్లో ఈ మాట చాలా ప్రాచుర్యం పొందుతోంది. రాజుకు దోషమని ప్రజలు భావించకూడదు. ప్రజాభిప్రాయం ముందు నీ వ్యక్తిగత భావాలు ఉండకూడవు.”) 3. శ్రీరాముడు తనంతట తానే మనోవేదన తో ఆలోచిస్తూ అన్నమాటలు అహం హి సీతాం నిత్యం పావనీం మను మానసే । ప్రజావాదభయాత్తు సా మయా వనమానితా ॥” (సీత పవిత్రురాలు అని నాకు బాగా తెలుసు. నా హృదయంలో ఎప్పుడూ పవిత్రురాలిగానే ఉంది. కానీ ప్రజల విమర్శ భయంతోనే నేను ఆమెను వనానికి పంపిస్తున్నాను.”) 4. రాముడు లక్ష్మణునితో చెప్పిన మాటలు. ఆనయాశు మహాభాగే సీతాం సత్యపరాక్రమాం । పతిం హి సతతం భజ్యా మయా హి ప్రదిషిద్ధసా ॥” (లక్ష్మణా! సీత పవిత్రురాలు, సత్యవ్రత పరాయణురాలు. అయినప్పటికీ నా చేతనుండి విడిపించబడింది. నీవు ఆమెను వెంటనే అరణ్యానికి తీసుకెళ్ళు.”) రాజధర్మం కోసం – ప్రజల విమర్శను నివారించడానికి రాముడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #జై శ్రీ రామ్..🏹🚩 #🛕అయోధ్య రామమందిరం🙏
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం......!! శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు. ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి. ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్ మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ” శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం.... వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం భావం:- వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ), అశ్వ అనే అయిదు ముఖాలతో , అనేక అలంకారాలతో , దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం . . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🌿🌼🙏శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి🙏🌼🌿
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
ఆంజనేయ స్వామి అవతారాలు తొమ్మిది..!🙏🏻🌿🙏🏻 హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. 1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయస్వామి. 4. పంచముఖాంజనేయస్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయస్వామి. 7. చతుర్భుజాంజనేయస్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. 🌿🌼🙏*ఓం నమో ఆంజనేయ నమో నమః*🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪 .
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
🌿🌼ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణం చేసేప్పుడు పఠించవలసిన శ్లోకం ... పరాశర సంహితలో చెప్పబడినటువంటి శ్లోకం🙏🌼🌿 🌿🌼🙏అందరమూ తప్పకుండా తెలుసుకోవలసిన అమూల్యమైన విషయాలు🙏🌼🌿 🌿🌼🙏ఆంజనేయం మహా వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణ్ణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్🙏🌼🌿 🌺🌺🌺🌹జై జానకిరామ్ జై హనుమాన్🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
01:00
🌿🌼🙏!! ॐ नमो भगवते हनुमते नमः !!🙏🌼🌿 🌹🙏 శ్రీ ఆంజనేయ స్తోత్రం...!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే! నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే.!! మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే! భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ !! వాగ్మినేగతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ! వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే.!! తత్త్వ జ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే! ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ.!! జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ.! నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే! యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే.!! యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే! మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే.!! హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే! బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే.!! లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక! యశోజయంచ మే దేహి శతృన్ నాశయ నాశయ.!! స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం! హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్. !!..🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
☀️శుభ మధ్యాహ్నం - U N U N - ShareChat
🌺🌺🌺🌺🌹!! ॐ नमो भगवते हनुमते नमः !!🌷🌺🌺🌺||జై శ్రీ రామ దూత రామ భక్త హనుమాన్|| అంజనీ పుత్ర ఆంజనేయ శుభ నామ, జై మారుతి జై భజరంగి.!!🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం| భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం | భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం భజేహం భజేహం భజేహం భజేహం|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ! వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి !! ధర్మ స్వరూపుడు, దశరథ నందనుడు, శ్రీ రాముని పరమ భక్తుడు, బుద్ధిమంతుడు, వానర శ్రేష్ఠుడు శ్రీ హనుమాన్ శుభాశీస్సులతో శుభమస్తు. 🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
షేర్ చాట్ వ్యూవర్స్ అందరికీ ఆ శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారుల అనుగ్రహం మన అందరికి ఉండాలని కోరుకుంటు మంగళవారం శుభాకాంక్షలు ఓం శరవణ భవః జై భజరంగబలి...🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩
🌅శుభోదయం - @alu 8790565859) De ಅಯವಿನೆ பனம் బ Crcalons దేవి క్రియేషన్స్  క్రియేషన్: జైశ్రీరామ్ ಆಂಜನೆಯಂ జె 14-10-251 శుభ మంగళవారం దయం శుభో @alu 8790565859) De ಅಯವಿನೆ பனம் బ Crcalons దేవి క్రియేషన్స్  క్రియేషన్: జైశ్రీరామ్ ಆಂಜನೆಯಂ జె 14-10-251 శుభ మంగళవారం దయం శుభో - ShareChat