#🗞️అక్టోబర్ 12th అప్‌డేట్స్💬 మెట్రో రైలులో సైకిల్ పార్క్ చేసింది
ఓ యువతి మెట్రోరైలు కోచ్లో సైకిల్ పార్క్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ముంబై మెట్రోలో ప్రయాణించేవారు మీ సైకిల్ను ఎంచక్కా అందులో పార్క్ చేసుకోవచ్చు. అందుకు కార్నర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానిని ఓ యువతి మొదటిసారి ప్రయత్నించారు. ఇది చాలా అద్భుతంగా ఉందంటూ ఆమె మెచ్చుకున్నారు. కొందరైతే ఇది ఇండియాలో కాదు.. జర్మనీలాంటి దేశాల్లో జరిగింది అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
సరస్సులో అద్భుత దృశ్యం
ఒడిశాలోని చిలికా సరస్సులో టోర్నడో వంటి దృశ్యం ఆవిష్కృతమైంది. దీంతో సరస్సును సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులు ఆశ్చర్యంతో పాటు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో వైరలవ్వగా దీనిని వాటర్ స్పౌట్గా వాతావరణ నిపుణులు గుర్తించారు. విశాలమైన నీటి ఉపరితలాలు, సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ఒక వాతావరణ స్థితి అని తెలిపారు. అయితే పర్యాటకులు, మత్స్యకారులు భయాందోళనకు గురైనా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
VIDEO: బావమరిది పెళ్లిలో జూ.ఎన్టీఆర్ సందడి
జూ.ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహం
లక్ష్మి శివానితో ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో యంగ్ టైగర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. బామ్మర్ది పెళ్లి కావడంతో ఎన్టీఆర్ మండపంలో హడావిడిగా కనిపించారు. బంధువులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలకు స్వయంగా ఆహ్వానం పలికారు. వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆయన భార్య లక్ష్మీప్రణతి, పిల్లలు కూడా సందడి చేశారు. #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
రీల్స్ పిచ్చి.. ప్రాణాలనూ లెక్క చేయట్లేదు
యువత SM ఫేమ్ కోసం హద్దులు దాటేస్తోంది. కొందరైతే ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు. తాజాగా ఓ అబ్బాయి, అమ్మాయి చేసిన పిచ్చి పని నెట్టింట వైరలవుతోంది. రైలు వెళ్తున్న క్రమంలో బ్రిడ్జిపై ప్రమాదకరంగా రీల్ చేశారు. ఆ సమయంలో వారికి ఇంచుల దూరం నుంచే ట్రైన్ వేగంగా వెళ్లింది. ఏ చిన్న పొరపాటు జరిగినా వారి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. ఇలాంటివి మానుకోవాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
VIDEO: బిడ్డలా పెంచిన చెట్టును నరికేయడంతో!
ప్రకృతితో మనిషికుండే బంధాన్ని కళ్లకద్దినట్టు చూపే దృశ్యమిది. ఛత్తీస్ గఢ్ లోని సరగొండిలో 20ఏళ్ల క్రితం ఓ తల్లి ప్రేమతో నాటిన వృక్షాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. తన బిడ్డలా పెంచిన చెట్టు కళ్లెదుటే నేలకూలడంతో వృద్ధురాలు గుండెలవిసేలా రోదించిన దృశ్యం అందరినీ కదిలిస్తోంది. ప్రకృతిపై ఆమెకున్న మమకారాన్ని చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు. దీనిపై గ్రామస్థులు సైతం నిరసన చేపట్టారు #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
#🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో కనిపించిన హార్దిక్
క్రికెటర్ హార్దిక్ పాండ్య తన రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ మోడల్ మహికా శర్మతో ముంబయి ఎయిర్పోర్టులో కనిపించారు. నటాషాకు విడాకులిచ్చాక వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆమె ఓసారి SMలో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఓ వ్యక్తి అంత క్లియర్ గా కనిపించలేదు. అతను హార్దిక్ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపించడంతో వాళ్ల రిలేషన్ కన్ఫామ్ అయ్యిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
VIDEO: కళ్లు చెదిరే ట్రాఫిక్
ప్రవాహాన్ని తలపించే ట్రాఫిక్ జామ్ను మీరెప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే కళ్లుచెదరడం ఖాయం. చైనాలోని అతిపెద్ద టోల్ ప్లాజా వద్ద కనుచూపు మేర వాహనాలు కిక్కిరిసిపోయాయి. అక్కడ 8 రోజుల నేషనల్ డే హాలిడేస్ నిన్నటితో ముగియడమే ఇందుకు కారణం. సొంతూళ్ల నుంచి ప్రజలు నగర బాట పట్టడంతో రోడ్లన్నీ వాహనాల బ్రేక్ లైట్ల వెలుతురుతో ఎరుపెక్కాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు SMలో వైరల్ అవుతున్నాయి. #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ప్లాష్ అప్‌డేట్స్
VIRAL: అఫ్గాన్లో ఇండియన్కు ఇచ్చే రెస్పెక్ట్ ఇదీ!
అఫ్గానిస్థాన్లో ఓ ఇండియన్ మోటో వ్లాగర్కు ఊహించని అనుభవం ఎదురైంది. తనిఖీలో భాగంగా చెక్పోస్ట్ వద్ద తాలిబన్లు అతడిని ఆపారు. అయితే తనది భారతదేశమని చెప్పగానే తాలిబన్ సైనికులు చిరునవ్వుతో అతడికి వెల్కమ్ చెప్పి ఛాయ్ ఆఫర్ చేశారు. కనీసం పాస్పోర్ట్ కూడా తనిఖీ చేయకుండానే పంపించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు అద్దంపట్టింది. మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని కొందరు అభిప్రాయపడ్డారు. #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
WOW.. ఇది నిజంగా అద్భుతమే!
కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. IND-NEP|
బిహార్లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు బోర్డర్లో ఉండే ఈ టౌన్లో గాలి క్లియర్&క్లీన్గా మారడంతో ఎత్తయిన భవనాల నుంచి ఈ అద్భుత దృశ్యాలు కనిపిస్తున్నాయి. జై నగర్, ఎవరెస్టు ప్రాంతానికి దాదాపు 300kms దూరం ఉంటుంది. సాధారణ రోజుల్లో కంటే వసంత పంచమి-హోలీ/రామ నవమి, దుర్గా పూజ-కార్తీక పౌర్ణమి మధ్య అక్కడ గాలి స్పష్టంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. #🗞️అక్టోబర్ 9th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
VIRAL: కారు రూప్పై కూర్చొని జంట రొమాన్స్..!
పంజాబ్ లూథియానాలో ఓ జంట రెచ్చిపోయింది.
కారు రూప్పై కూర్చొని అసభ్యకరమైన చర్యలకు పాల్పడింది. కారు కదులుతుండగానే ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకున్నారు. అందరూ చూస్తున్నారనే భయం లేకుండా ప్రవర్తించడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఇదంతా వెనకాల వస్తోన్న వాహనదారులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరలవుతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు #🗞️అక్టోబర్ 8th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్