Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*Sir B.N. Rau (Constitutional Adviser)* *రాజ్యాంగ రచన ఒక్కరి సృష్టి కాదు, అనే దానికి ఆధారాలు:* *1. “Letter to the Editor” – The Hindu (1948)* *B. N. Rau’s letter to the Editor, The Hindu, 1948* *(Reproduced in B. Shiva Rao, Framing of India’s Constitution:* *Select Documents, Vol. II, p. 574–575)* *రాజ్యాంగం పూర్తయిన తర్వాత 1948–49 కాలంలో కొన్ని పత్రికలు, ముఖ్యంగా The Hindu మరియు Times of India అంబేద్కర్‌ను “Maker of the Indian Constitution” అని పిలిచాయి*. *దానికి ప్రతిస్పందనగా B. N. Rau గారు ఈ వ్యాఖ్యను చేశారు —* *“డ్రాఫ్ట్ రాజ్యాంగాన్ని నేను రాజ్యాంగ సలహాదారుగా సిద్ధం చేశాను; తరువాత అది డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా అసెంబ్లీలో చర్చించబడి, సవరణలు చేసి, అధికారికంగా ఆమోదించబడింది. దాని రచనను కేవలం డా. అంబేద్కర్‌కే ఆపాదించడం తప్పు. ఇది సమిష్టి కృషి ఫలితం.”* *తన పాత్రను స్పష్టంగా తెలియజేస్తూ, రాజ్యాంగ రచన సమిష్టి కృషి అని తెలియజేశారు*. *2. Personal Letter to Sir Ivor Jennings – 15 October 1948* *B. N. Rau Papers, National Archives of India (File No. 58/CA/1948)* *Portions reproduced in Granville Austin, The Indian Constitution: Cornerstone of a Nation (1966), p. 310.* *“నేను ఇప్పుడు రాజ్యాంగ ముసాయిదాను పూర్తిచేశాను. డ్రాఫ్టింగ్ కమిటీ దానిని చర్చిస్తుంది. వారు దానిని మార్పులు లేకుండా స్వీకరిస్తారని నాకు అనిపించడం లేదు, కానీ అది వారి కృషికి పునాది అవుతుంది.”* *ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పాడు — మొదటి ముసాయిదా (First Draft) తన చేత రాయబడింది*, *డ్రాఫ్టింగ్ కమిటీ దానిని ఆధారంగా తీసుకుంటుందని*. *అంటే, ఆయన స్వయంగా రచయిత అని, కానీ తుది రూపం కమిటీ పని అని చెప్పారు*. *3. Reference in the Government of India Official Report (1949)* *Government of India – Report on the Framing of the Constitution (1949), published by the Ministry of Law.* *“మొదటి ముసాయిదాను రాజ్యాంగ సలహాదారు B.N. రావు అక్టోబర్ 1947లో తయారుచేశారు. ఆ తర్వాత, దానిని డా. బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ (Drafting Committee) క్షుణ్ణంగా పరిశీలించింది.”* *ఇది ఆయన వాఖ్యానికి ప్రభుత్వ ధృవీకరణ — అదే భావం: “draft by Rau, scrutiny by Ambedkar”* *4. Oxford University Press* *R. Parthasarathy, Benegal Narsing Rau:* *Constitutional Adviser to the Constituent Assembly (Oxford University Press, 2009), p. 183–189.* *“రావు (B. N. Rau) ఎప్పుడూ ఏకైక రచయితనని చెప్పుకోలేదు, కానీ అంబేద్కర్ కూడా దాని రచయిత కాదని ఆయన దృఢంగా చెప్పారు. మొదటి ముసాయిదా పూర్తిగా ఆయన స్వంత పని, కమిటీ దాన్ని కేవలం సవరించింది.”* *5. Letter to His Brother B. N. Rama Rau (India’s Ambassador in Tokyo), 1949* *Private Papers of B. N. Rau, Nehru Memorial Museum and Library (NMML), New Delhi;* *excerpts printed in R. Parthasarathy, Benegal Narsing Rau:* *Constitutional Adviser to the Constituent Assembly (2009), p. 187.* *“డ్రాఫ్టింగ్ కమిటీ నా ముసాయిదాను చాలా తక్కువ మార్పులతో స్వీకరించిందన్న విషయం నాకు సంతోషంగా ఉంది. కీర్తి ఒక్కరికి కాదు, సభ మొత్తానికే చెందుతుంది.”* *ఇది ఆయన కుటుంబానికి రాసిన వ్యక్తిగత లేఖ —* *ఇక్కడ కూడా ‘సమిష్టి కృషి’ భావనను స్పష్టంగా చెప్పారు*. *6. Sir Ivor* *Jennings సలహాలు* *B. N. Rau గారు* *ఆయనను* *1947–48లో లండన్‌లో కలసి ముసాయిదా పై సలహాలు తీసుకున్నారు*. *B. N. Rau Papers, NMML Archives, 1948* *Rau తన Constitutional Adviser’s Diary లో ఇలా రాశారు* *“నేను సర్ ఐవర్ జెన్నింగ్స్‌తో ఒక రోజు మొత్తం గడిపాను. ఆయన సలహా ఎంతో విలువైనది.”* *Next Post:* *రాజ్యాంగ రచన ఒక్కరి సృష్టి కాదు, అని ప్రముఖుల మాటలు:* *10. Sir Ivor Jennings (బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్)* *11. గ్రాన్విల్లే ఆస్టిన్ (అమెరికన్ చరిత్రకారుడు, 1966)* *12. B.R. అంబేద్కర్* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*శివ దర్శనం* -5 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *_కార్తీకమాసం సందర్భం గా ఈ శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం_* *_కేదారనాథ్_* *పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం*. *హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది.* *రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది*. *ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు*. *శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్‌నాథ్‌ సమీప పర్వతాల్లోనే వుంది*. *పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు.* *ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు. ఈశ్వరుడు వృషభరూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు. వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు. పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది. భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌... ఈ ఐదింటిని పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.* *మంచుకొండల్లోని కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. కానీ శివానుగ్రహం భక్తుల్ని ఆ ఇబ్బందులనుంచి దూరంచేస్తుంది. ఇక్కడ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది*. *అనంతరం ఆదిశంకరాచార్యులు ప్రాచీన ఆలయానికి సమీపంలోనే ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు.* *ఆలయం ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణ విగ్రహాలు వుంటాయి. ఆలయం ముందు నంది విగ్రహం వుంటుంది. ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తారు.* *కొండలనెక్కి...* *శ్రమను అధిగమించి..* *ఉత్తరాఖండ్‌లోని పవిత్రపుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు*. *కేదార్‌నాథ్‌ ప్రయాణం క్లిష్టంగా వుంటుంది. రిషికేశ్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు సులభంగా చేరుకోవచ్చు*. *గౌరీకుండ్‌ నుంచి గుర్రాలు, డోలీలు లేదా కాలినడక ద్వారా ప్రయాణించాల్సి వుంటుంది*. *హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి. హెలికాప్టర్ల సర్వీసులు కూడా ఉన్నాయి* *సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో వుండే కేదార్‌నాథ్‌ను చేరుకోవడంతో బడలిక మొత్తం ఎగిరిపోతుంది.* *_ఆ నీలకంఠుని దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_కార్తీకమాసంలో_సత్యనారాయణ_వ్రతం_చేస్తే_* *కార్తీక మాసం...ఎంతో శ్రేష్ట‌మైన మాసం. ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించడం కూడదని.. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయాలని పండితులు చెప్తున్నారు. ఆ వత్తులు, తామర నార, అరటినార వంటివి ఉపయోగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.* *ఈ మాసంలో అభిషేకాలు, బిల్వ అర్చన, స్తోత్ర ప్రయాణాలు,శివ నామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి* *కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభ దినాన సాయంకాలం కానీ, ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి.. బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి, దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, స్వగ్రహమునకానీ, పుణ్యక్షేత్రములందు సత్యనారాయణ వ్రతం చేయించాలి. పూజా స్థలాన్ని గోమయముచే శుద్ధిచేయాలి.* *తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతన వస్త్రాలు, కొబ్బరికాయ, పూజా స్థలము నందు ఉంచాలి. భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టనష్టాలు తొలగిపోతాయి. ధనధాన్యాలకు లోటుండదు. సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసముంలందు కానీ, ఏదైనా శుభదినాన దీనిని ఆచరించాలి. దారిద్ర్యం తొలగిపోవాలంటే.. ఈ వ్రతాన్ని ఆచరించాలి.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:15
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:16
*_ఓo విష్ణుప్రియాయ నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
00:33
https://www.youtube.com/live/F5BExSeNxT4?si=_TSvtQndOzL7txib #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
https://www.youtube.com/live/5G-mEyNClN0?si=xfPUOz8g62vzpXEv #మన సంప్రదాయాలు సమాచారం
youtube-preview
2️⃣5️⃣ *25 వ రోజు* *_ఆది పర్వము పంచమాశ్వాసము:_* *_పాండవ కౌరవ జననం:_* *పాండురాజు ఆవేదనకు విచలిత అయిన కుంతీ దేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్పింది. కాని కర్ణుని జననం తప్ప అంతా వివరించింది. ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏదేవత సాయంతో సంతానం పొందాలో ఆనతివ్వమని పాండురాజుని అడిగింది.* *పాండురాజు “ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుని పొందుము” అన్నాడు.* *అలా భర్తచేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుని కన్నది. అతనికి యుధిష్టురుడు అని నామకరణం చేసాడు. ఋషులు అతను కుఱు వంశానికి రాజై ధర్మ బద్దంగా రాజ్యం చేస్తాడు అని పలికారు*. *హస్థినలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది*. *అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు  అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు*. *పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సాయంతో ఒక కుమారుని పొందమని చెప్పాడు.* *కుంతి వాయుదేవుని సాయంతో కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది*. *హస్థినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు*. *ఒక్కోరోజుకు ఒక్కో కుమారుడు కలిగారు*. *నూరుగురు కుమారులు జన్మించిన తరువాత దుస్సల అనే కుమార్తె జన్మించింది*. *దుర్యోధనుని జనం తరువాత గోచరించిన దుశ్శకునాలను చూసిన భీష్మ,విదుర, పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయ కారకుడని అతనిని వదిలి వేసి అందర్ని రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు. కానీ పుత్రుని మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి అనుమతించలేదు*. ``` *_భీముని బలం_* *కుంతీ దేవి ఒకసారి భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతున్న తరుణంలో ఒక పులి ఆమె మీదకు ఉరికింది*. *పాండురాజు దానిని చంపేలోగా కుంతీ భీముని ఒక బండరాతిపై జారవిడిచింది. కేవలం పది రోజుల శిశువు పడగానే ఆ రాళ్ళు పొడి పొడి అయ్యాయి. భీముని బలానికి పాండురాజు ఆశ్చర్య పడ్డాడు*. *దృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు కలిగారని విని పాండురాజుకు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అతడు దేవేంద్రుని గురించి తపసు చేసాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించ కలిగిన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీ దేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతీ దేవికి ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి “ఇతను కార్తవవీరార్జ్యునికంటే వీరుడౌతాడు. కనుక అర్జునుడని పిలువబడుతాడు" అని పలికింది*. *కుంతీదేవి,గాంధారి సంతానవతులైన తరువాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్ర మహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు*. *కుంతీ మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకులసహదేవులను పొందింది* #మన సంప్రదాయాలు సమాచారం