*🙏🌹जय श्री महाकाल🌹🙏14-10-25,శ్రీ ఉజ్జయిని మహా కాళేశ్వర్ జ్యోతిర్లింగ్ సుప్రభాత దర్శనం 🙏🪷🌹🔱*
*श्री महाकालेश्वर ज्योतिर्लिंग का भस्म आरती श्रृंगार दर्शन*
*14-10-2025 कण-कण में महादेव*💕
🪷🔱🪷🔱🪷🔱🪷
--SHIVALOKAM PROJECT
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🌹राजाधिराज द्वारकाधीश जी के मङ्गला आरती दर्शन
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात.
🪷🌹🪷🌹🪷🌹🪷
*दिनांक :- 14/10/2025 मंगलवार, శ్రీ ద్వారకాదినాధ శ్రీకృష్ణ భగవానుని సుప్రభాత దర్శనం 🪷🌹🙏🎻*
🪷🙏🪷🙏🪷🙏🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#⛳భారతీయ సంస్కృతి #🙏మన సాంప్రదాయాలు
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ జ్ఞానం అంటే సర్వేశ్వరుని తెలుసుకోవడం "వివరంగా శివలోకం మీ కోసం.....*_
🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹🕉️✡️🌹
వేదాంతమును సృష్టించిన వాడు వేదమును బాగా తెలిసిన వాడు. వేదములన్నిటిచే తెలియబడదగినవాడు శ్రీమన్నారాయణుడైన శ్రీమహావిష్ణువే ఆ పరమాత్మ. భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో ఒక శ్లోకంలో పరమాత్మ స్వరూపాన్ని ఇలా చెప్పారు.
*🕉️"శ్లో|| సర్వస్యచాహం-హృది సన్ని విష్టో మత్తః స్మృతిజ్ఞాన-మపోహనంచ*
*వేదైశ్చసర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద-విదేవచాహం" అన్నారు.*
పరమాత్మ సమస్త ప్రాణుల హృదయమునందున్నవాడు. జీవులకు జ్ఞా పకశక్తిని, జ్ఞానమును, మఱపును కలుగచేయుచున్నవాడు.వేదములన్నిటిచేతను తెలియదగినవాడు. వేదములందు, శాస్త్రములందు అనేక దేవులు, దేవతలు పేర్కొనబడినను, తెలుసుకొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయి ఉన్నాడు. త్రిమూర్తులు కూడా ఒక్క పరమాత్మగానే భాసిస్తూ వివిధ రూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము- ధ్యేయము-జ్ఞేయము కలది పరమాత్మయే. లోకంలో గురుపరంపరను దెప్పునపుడు ఓం నారాయణం పద్మభువం అంటూ మొదట ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుని పేర్కొంటారు. ప్రపంచంలో ముగ్గురు పురుషులుంటారు. క్షరుడు-అక్షరుడు- ఉత్తమ పురుషుడు ఉంటారు.
పదిహేడవ శ్లోకంలో ఉత్తమ పురుషుని స్వభావాన్ని వర్ణిస్తూ....
*🕉️శ్లో||ఉత్తమః పురుషస్త్వన్స: పరమాత్మేత్యుదాహృతః*
*యోలోకత్రయమా విశ్వ-భిభర్త్యవ్యయ ఈశ్వర ॥*
అంటూ ఎవరు ఈ ముల్లోకములందును చేరి వానిని భరించుచున్నాడో అట్టి నాగరహితు డను. జగన్నియామకుడును అయిన పరమాత్మ క్షర-అక్షర పురుషుల కంటే వేరుగా ఉంటూ ఉత్తమ పురుషునిగా తెలియబడుచున్నాడు.
🕉️నశ్వర దేహాభిమాని కంటెనుచిత్ ప్రతిబింబరూపుడగు జీవుని కంటెను వేరుగ ఆత్మకలదు, అతడే ఉత్తమ పురుషుడని తెలిపాడు కృష్ణ పరమాత్మ. క్షణికమగు దేహాభిమానికంటెను బద్ధుడగు జీవునికంటెను ముక్తుడైన ఆత్మగొప్పవాడు శ్రేష్ఠుడు గదా. జీవుడు త్రిగుణ సహితుడు. పరమాత్మ త్రిగుణ రహితుడు. గుణాతీతుడు. ఈ కారణము వలన క్షర-అక్షర పురుషుల కంటెను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడుని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు. ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అలాంటి ఉత్తమ పురుషత్వమును- పురుషోత్త మత్వమును అందరూ కూడా ప్రయత్న పూర్వకముగా సంపాదించాలి. విజ్ఞులైన వారు ఎల్లకాలము జీవస్థితిలోనే అనగా బద్ద జీవితములోనే యుండుట వలన ఇబ్బందులెదురౌతాయి. క్రమంగా దేహస్థితిని, జీవస్థితిని దాటి, సాక్షియగు ఆత్మ స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవారు ధన్యులు, శ్రేష్ఠులు, ఈ స్థితియే జీవితము పరమావధి. పరమలక్ష్యము. దానివలన జన్మలు సార్ధకమౌతాయి. మిగిలిన ఇతర ప్రక్రియల చేతను మన మానవజన్మ సార్ధకతను పొందలేదు. పరమాత్మను, పరమాత్మ తత్త్వమును గ్రహించి సర్వలోకధారుని, అవ్యయుడని అంతర్యామిగా భావించి ఈశ్వరుడై వెలయుచున్న పరమాత్మ ధ్యాసలో, ధ్యానంలో, స్మరణలో తరించాలి.
✡️మోక్షప్రాప్తి వేళ జీవత్వము తొలగిపోతుంది. కావున ఏ కాలమందునూ నశింపని పరమాత్మ కొరకు సర్వులూ ప్రయత్నించాలి. పురుషోత్తముడైన పరమాత్మను ఎరుగువాడు నిర్మల భక్తితో సేవించి నిరంతరము అతనినే భజించాలి. ఎన్ని విద్యలు పొందినను, ఎంత పాండిత్యమును బడసినను, ఎన్ని కళలనార్జించినను మనుజుడు సర్వజ్ఞుడు, సర్వవేత్త కాలేడు. ఇవన్నియును పరమాత్మకు యందే ఉండుట వలన అచంచల భక్తి భావంతో సేవించి తరించాలి. పరిపూర్ణ మనస్సు తో మసలాలి.
*"యస్మిన్ విజ్ఞాతే-సర్వమిదం విజ్ఞాతం భవతి"*
✡️దేనిని తెలిసికొనినచో సమస్తము తెలిసికొనబడినదగునో అట్టి పరమాత్మ నెఱగువాడే లోకంలో సర్వవేత్త- సర్వజ్ఞుడు కాగలడు. పరిపూర్ణ భావము దైవము యదార్థతత్త్వము తెలిసికొననిదే కాలగదు. ముందుగా పరమాత్మ విభవము వాస్తవ స్వరూపము తెలుసుకొనాలి. భక్తి భావమును విభజించి చూడరాదు. అభ్యాసంతో పూర్ణభక్తిని పొంది, సర్వభావమును అందరూ పొందాలని "సర్వభావేన" అనుపదానికి నిర్వచనంగా పరమాత్మ బోధించాడు. ఈ విషయాలను తెలిసికొన్నవాడు జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు. ఉత్తమ పురుషునిగా పరమాత్మని తెలిసికొని పాపరహితుడౌతాడు. ధీశక్తిని పొందుతాడు. యోగ్యత గల వారికే పరమాత్మతత్త్వం లభిస్తుంది. ఇదే జీవులకు లభించే జీవనరహస్యం, దుఃఖరహితము, వేదాహమేతం పురుషం మహాన్తమ్" అనిపురుషసూక్తం.
✡️🕉️✡️🕉️✡️🕉️✡️
_*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
_*🌹🎻🙏🪷అమ్మలను కన్న అమ్మలు మనం ఈ వ్యాసం లో చెప్పుకోబోయే అమ్మలు వారి గురించి శివలోకం మీ కోసం..... #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻🪷🌹🎻
దక్ష ప్రజాపతికి "స్వాథా" అనే ఇంకొక కుమార్తె కలదు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. వారెవ్వరూ ఆమె గర్భము. నుండి జన్మించ లేదు. వారు ఆమె మానస పుత్రికలు పెద్దకుమార్తె మేనాదేవి రెండవకుమార్తె ధన్యాదేవి. మూడవ కుమార్తె కళావతి. ఒకసారి "స్వాథా" తన కుమార్తెలను తీసుకుని శ్వేతదీపానికి వెళ్లింది. అక్కడ శ్రీమహావిష్ణువు అందరికి దర్శనం ఇస్తూ ఉంటాడు. అనేకమంది ఋషులు ఆయన దర్శనానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా! అక్కడ వారంతా ఉన్నారు. ఆ సమయంలో సనక సనందాది ఋషులు అక్కడికి వచ్చారు. అందరూ! వారి గౌరవార్థం లేచినుంచున్నారు. కాని అక్కడ ఉన్న "స్వాథా" కుమార్తెలు గమనించలేదు. అక్కడి అద్భుత ప్రదేశాన్ని చూస్తూ మైమరచిపోయారు. అందరూ! ఒక్కసారి మౌనం వహించాడు. పరంధాముని సన్నిధిలో కూడా వారు ముగ్గురు పరిహాసాలాడు కుంటున్నారు. అది చూసి సనకాది ఋషులకు కోపము వచ్చింది. "చపలమైన మనస్సులు కలవారు భూలోకంలో పుట్టండి" అని శాపము ఇచ్చారు. అప్పుడు కాని వారికి వారి తప్పు తెలియలేదు. "సోథా” తన కుమార్తెలతో వారి పాదాలపై పడింది. "మేమంతా శ్వేతద్వీపంలోని అద్భుతాలకు మైమరచిపోయాము అంతేకాని మిమ్మల్ని అవమానపరచాలని కాదు" అని శాపాన్ని తిరిగి తీసుకోమని ప్రాధేయపడ్డారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీమహావిష్ణువు సనకాదులవైపు మందస్మితవదనంతో చూసాడు. వారు తమ కోపాలను తగ్గించుకొని వారివైపు తిరిగి "మీరంతా భూలోకంలో తప్పకుండా జన్మిస్తారు. కాని మీమీ కుమార్తెల వలన మీరు కూడా అందరితో మన్ననలు అందుకుంటారు. మేనాదేవి కుమార్తె పార్వతి శంకరుని తన భక్తితో గెలుచుకుని పరిణయమాడుతుంది. ధన్యాదేవి భూలోకంలో జనక మహారాజును వివాహం చేసుకొని "సీత"ను అల్లారుముద్దుగా పెంచుతుంది. ఆమెను శ్రీరాముడు చేపట్టుతాడు. ఇక కళావతి ద్వాపరయుగంలో రాధను కుమార్తెగా పొంది ఆమెను పెంచి పెద్దచేస్తుంది. వీరంతా జగత్ప్రసిద్ధి గాంచిన మహాపురుషులకు భార్యలు అవుతారు" అని చెప్పి సనకాదులు అక్కడి నుండి వెళ్లిపోయారు.
మేనాదేవి హిమవంతులు ఎంతోకాలంగా సంతానం కొరకు పూజలు చేసారు. శ్రీమహావిష్ణువును వారు ప్రార్ధించారు. దేవతల కల్యాణం కొరకు వారికి పార్వతి జన్మించింది.
పార్వతి తపస్సుతో పరమశివుని మెప్పించి భర్తగా పొందింది. త్రేతాయుగంలో ధన్యాదేవి పుట్టి జనకమహారాజును వివాహం చేసుకొంది. సీతాదేవిని పెంచి పెద్ద చేసింది. సీతాదేవిని శ్రీరాముడు "శివధనస్సు" విరిచి గెలుచుకుని పెండ్లి ఆడాడు. విధివిలాసం వారిద్దరిని అరణ్యవాసానికి పంపించింది. భరతుడు తిరిగి వారిని అయోధ్యానగరానికి తీసుకొని వెళ్లడానికి సహాయపడవలసినదిగా జనకమారాజును ఆహ్వానం పంపాడు. జనకమహారాజు ధన్యాదేవి వనవాసం చేస్తున్న చిత్రకూటం వద్దకు వచ్చారు. అక్కడ భరతుడు మహారుషులు ధర్మనిపుణులు సమావేశం అయ్యారు. పలురకాలుగా చర్చించారు. జనకమహారాజు ధన్యాదేవి వనవాసం పూర్తిగా చెయ్యాలని శ్రీరాముడు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఆయన ధర్మనిరతికి చాలా సంతోషించారు. ఒంటరిగా ధన్యాదేవి సీతాదేవిని కలిసింది. "పతివ్రతా ధర్మాన్ని ఆచరించాలి" అని హితవు చెప్పింది. అత్తగార్లకు "సేవలు" చెయ్యమని చెప్పింది. వీరి అరణ్యవాసానికి కారణం అయిన కైకేయిని కూడా కౌసల్య సుమిత్రలతో సమానంగా గౌరవించాలని కోరింది.
ద్వాపరయుగంలో కళావతి పుట్టింది. శ్రీకృష్ణుణి పెంచిన నందుని వలె మరియొక యాదవ ప్రముఖుడు అయిన వృషభానుని పెండ్లి ఆడింది. అప్పుడు ఆమె పేరు రత్నాగర్భాదేవి. బర్మానా అనే చోట చిన్న సముదాయం అతనిని ముఖ్యుడుగా ఎన్నుకున్నారు.
వీరంతా తమపై ఆధారపడిన ప్రజలను చక్కగా చూసుకుంటే మధుర రాజైన కంసునికి "కప్పాలు" (అడగకుండానే) వారంతట వారే కట్టేవారు. కంసుని విశ్వాసపాత్రులు అయ్యారు. శ్రీకృష్ణుడు నందగ్రామంలోనే ఉన్నట్లు కంసునికి అనుమానం కలిగేవరకు వారిపై దృష్టి పడలేదు.
ఆ తరువాత మాత్రమే కంసుని దృష్టివారిపై పడింది. అనేక వింతపరిణామాలు జరిగిపోయాయి. రాధాకృష్ణుల అలౌకిక ప్రేమ జగత్ప్రసిద్ధము. నందుని కుటుంబము వృషభానుని కుటుంబాలు ఉత్సవాలలో కలుసుకునేవి, అక్కడే రాధాకృష్ణులు రాధ కూడా అక్కడే ఉంది. శ్రీకృష్ణుడు మధురానగరానికి వెళ్లి తిరిగి రాలేదు. ఒకసారి స్నేహితుడయిన ఉద్దవుని మాత్రము అక్కడికి పంపాడు. ఆయన బృందావనంలో గోపికలను కలుసు కున్నాడు. వారంతా శ్రీకృష్ణుని ఆటపాటలు గుర్తుచేసుకొని వారి వారి పనులు చేసుకుంటున్నారు.
ఒంటరిగా రాధాకృష్ణునితో మాటలాడుతున్నది. ఉద్దవుడు ఆశ్చర్యపడ్డాడు. వారు వేరొక లోకంలో ఉన్నారు. ఆయన మౌనంగా తిరిగి ద్వారక వెళ్లి చూడగా శ్రీకృష్ణుడు ద్వారకలో కూడా ఉన్నాడు. అంతవరకు తాను మాత్రమే శ్రీకృష్ణునికి నిజమైన మిత్రుడు అనుకున్న ఉద్దవునికి రాధ గొప్పదనం అర్ధం అయింది. ఆమె శ్రీకృష్ణుని ఏమి కోరలేదు. కాని ఆయనే ఆమె వశుడయ్యాడు.
"సీతారాములు గౌరీశంకరులు రాధాకృష్ణులు" అని మాత్రమే అంటారు. శ్రీకృష్ణునికి ఎంతోమంది భార్యలు భార్యలు ఉన్నా" రాధాస్థానం ఎంతో ఉన్నతమైనది. ఈవిధముగా జగదీశ్వరులను చేపట్టిన "అమ్మలను కన్న అమ్మలు" మేనాదేవి, ధన్యాదేవి, కళావతి అంతటి. ప్రాముఖ్యాన్ని పొందారు.
🪷🌹🎻🪷🌹🎻🪷
_*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
🪷🌹🎻🌳🦜"పురాణాల్లో ప్రస్తావించిన నైమిశారణ్యం" గురించి శివలోకం మీ కోసం.... #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳🦜🌳
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది.
గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం.
వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది.
మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను
తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
నైమిశారణ్యం 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాదాపు 100 కి.మీ. దూరం ఉంటుంది.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట.
అది పడిన చోటే నైమిశారణ్యము.
ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది.
ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు.
వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు.
వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే
ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు.
వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు
మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు.
ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి.
ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.
ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఉంది.
*పేరువెనుక చరిత్ర....*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను.
ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను.
(నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం)
ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను.
అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను .
ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.
వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది.
మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు.
బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు.
మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా
ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది.
చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది.
ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా
పేరుగాంచింది.
చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది.
నిమి అంటే చక్రకైవారం, అరణ్యం - అడవి.
చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది.
వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురులను ఈ ప్రాంతంలో సంహరిస్తాడు.
నిమి (లిప్త) (సెకండు) లో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని
పేర్కొనబడింది.
ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి.
శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.
*నైమిశారణ్యము విశేషాలు.....*
🌳🌳🌳🌳🌳🌳🌳
నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక్త ఆలయాలలో ఒకటి.
శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.
నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి.
దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు.
గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాంచాయి.
ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది.
ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.
బలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆస్రమంలో యాత్రీకులకు బస, భోజన వసతులు లభిస్తాయి.
*శ్రీరాముడు.....*
🏹🏹🏹🏹🏹🏹
శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే.
సీతాదేవి పేరున శ్రీరాముడు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు.
శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు.
ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
*పరిక్రమణ.....*
🌷🌷🌷🌷🌷🌷
నైమిశారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనేదొకటి అని విశ్వసిస్తుంటారు.
ఫల్గుణమాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిశారణ్యంలో మొదలుపెట్టి, 11 పవిత్ర క్షేత్రాలలో మజీలీలు చేసుకుంటూ, మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ముగిస్తారు.
*చూడవలసిన ప్రదేశాలు....*
🕉️🔯🕉️🔯🕉️🔯🕉️
వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది.
పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం.
చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక,
శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.
గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది.
ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.
నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్. శ్రీమన్నారాయణుడు.
తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.
శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది.
ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.
*నైమిశారణ్యం లో ఆలయాలు....*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
వ్యాసగద్దె, సూతగద్దె, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, మొదలైనవి ఉన్నాయి.
రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది.
అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు.
ఆ అడుగున శివమూర్తి ఉంది.
*భూతేశ్వరాలయం....*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు.
ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది.
గయుడు అనే రాక్షసుడు విష్ణుధ్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేసాడు.
కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అనుగ్రహిస్తానన్నాడు.
దానికి గయుడు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసుకుంటుంటే, నిన్నెవడు రమ్మన్నాడు. నీవు నాకు వరమిచ్చేవాడివా! నేనే నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు.
వాడి అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకుని, అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వమని అడిగాడు.
ఇక మాట తప్పలేక గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేసాడు.
వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని మూడు భాగాలుగా నరికేసాడు.
అందులో ఒక భాగం గయలో పడగా,
రెండవ భాగం నైమిశారణ్యంలోనే పడింది.
మూడవ భాగం బదరీనాథ్‌లో పడింది.
ఈ మూడు ప్రసిద్ధక్షేత్రాలుగా వెలిసాయి.
ఈ నైమిశారణ్యంలో పడిన చోట ఆలయ నిర్మాణం జరిగింది.
అందులో వేలుపుని భూతేశ్వరుడు అని వ్యవహరిస్తారు.
*చక్రతీర్థం.....*
🪷🌹🙏🪷🌹🙏🪷
భూతేశ్వరాలయానికి ప్రక్కనున్న సరస్సే చక్రతీర్థం అంటారు.
ఇది వృత్తాకారంలో ఉండి చుట్టూ మెట్లుండి స్నానమాచరించడానికి అనువుగా ఉంటుంది.
ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజల విశ్వాసం.
*వ్యాసగద్ది....*
🪷🌹🙏🪷🌹🙏🪷
ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాసమహా ముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు.
ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగ అని కూడా పిలిచేవారు.
ఈ ప్రదేశంలో ఒక పీఠంలాంటి గద్దెపై పట్టువస్త్రంతో అలంకరించి ఉంచారు.
ఆనాడు వేద వ్యాసుడు ఇక్కడ కూర్చుని మహా భారతాన్ని చెప్తుంటే, విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చుని రాసిన పవిత్ర స్థలం ఇదే.
ఈ పక్కనే వ్యాసుని కుమారుడైన శుకమహర్షి
పాలరాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షితు మహారాజు, శుకమహర్షి శిష్యుడైన శ్యాం చరణ్ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి.
ప్రాచీన కాలంలో గోమతిని ధ్యానమతి గంగ అనేవారట.
ఇక్కడ నిలుచుని చూస్తే, ఒకపక్క ప్రవహించే గోమతి, మూడు పక్కలా దట్టంగా వ్యాపించిన అరణ్యంతో మనోహరమైన దృశ్యం కనువిందు చేస్తుంది.
ఇక్కడ చిన్న మందిరాన్ని నిర్మించారు.
ముందున్న యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తుంటారు.
వచ్చినవారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులోవున్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్ది దర్శిస్తారు.
*లలితాదేవి ఆలయం....*
🔯🔯🔯🔯🔯🔯
ఈ నైమిశారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి.
పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ వుంటుంది.
*హనుమాన్ ఘరి....*
🐒🐒🐒🐒🐒🐒🐒
ఈ మందిర విశేషానికి వస్తే, రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహరించుకుపోయాకా,
ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే.
ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలువెత్తులో ఉండి, భుజాలమీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలికింద తొక్క బడుతూ మైరావణుడు ఉంటారు. అంజనేయ స్వామి నిత్యపూజలతో, భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది.
నైమిశనాథ దేవాలయం..
ఇక్కడి స్వామి నైమిశారణ్యం క్షేత్రపాలకుడు.
వేంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటాడు. నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది.
అలాగే అహౌబిలం వారు నిర్మించిన
నారసింహ దేవాలయం, దదీచి కుండం, బలరాముడు ఇక్కడకి వచ్చిన ప్రదేశం, చూడదగ్గవి. అన్నిటినీ మించి ఇక్కడి రమణీయ దఋశ్యాలు అనేకం మనకి కనువిందు చేస్తాయి.
*పురాణపురుష....*
🪷🌹🙏🪷🌹🙏🪷
ఇక్కడ ఆనందమయి మాత ఫౌండేషన్ వారు నిర్మించిన పురాణ పురుషుని మందిరం చాలా అందమైన నిర్మాణం.
పురాణ పురుషుని విగ్రహం పంచలోహంతో మలచారు.
చిలుక తలతో, అభయముద్రలో, ప్రశాంత గంభీర వదనంతో వుంటుంది.
ఇక్కడ పురాణాం మీద పరిశోధన జరుగుతోంది.
18 పురాణాల తాళ పత్ర గ్రంథాలు పట్టుబట్టలో చుట్టి ఒక వేదిక మీద ఉంచారు.
దీని చుట్టూ రేలింగ్ అమర్చి ఒక పక్క వేదవ్యాసుని విగ్రహం ప్రతిష్ఠించారు.
మరో పక్క నూతుని విగ్రహముంది.
దీనికి ప్రక్కనే బహు విశాలమైన గోష్ఠిమందిరం పెద్ద పెద్ద పట్టుపురుపులతో, గద్దెలతో పవిత్ర వాతావరణం ఆవరించింది ఉంది.
*అహోబిల మందిరం..*
🪷🌹🙏🪷🌹🙏🪷
మన అహోబిలమఠం వారిక్కడ నిర్మించిన ఆలయంలో నారసింహుని పంచలోహ విగ్రహం
నిత్య పూజలతో అలరారుతోంది.
*దధీచి కుండము..*
🌳🦜🐒🌳🦜🐒🌳
ఇది ప్రసిద్ధికెక్కిన స్థలం.
దీనికో పౌరాణిక గాథ ఉంది.
దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరిగాయని పురాణకథనాలు వివరిస్తున్నాయి.
అలాంటి ఒక యుద్ధంలో తారకాసురుడు విజృంభించి, దేవతలనందరినీ చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువును సమీపించి దేవతలకు రక్షంచమని వేడుకున్నాడు.
విష్ణుమూర్తి సలహా మేరకు దధీచి మహర్షి ఎముకతో తయారుచేసిన ఆయుధం రాక్షస సంహారం చేయగలదని తెలిపాడు,
ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయం వివరించి ఆయన వెన్నెముకను ఇవ్వమని కోరాడు . ఆ మహాత్ముడు ఈ కోరిక లోక కళ్యాణార్థమని గ్రహించి, యోగమార్గాన తన శరీరాన్ని త్యజించాడట.
ఆయన సుదీర్ఘ తపస్సుతో, అనూహ్యశక్తి సంపన్నమైన ఆయన ఎముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారుచేసుకుని విజయం సాధించాడట.
యిప్పటికీ ఇదే ఇంద్రుని ఆయుధం.
ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా ఈ దధీచికుండానికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది.
లోకకళ్యాణార్థం, తన శరీరాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనం
ఈ దధీచి కుండం.
బలరాముని గురించిన పురాణగాధలో బలరాముడు నైమిశారణ్యంలో ప్రాయశ్చితకర్మలు నిర్వహిన్నట్లు తెలుస్తుంది.
కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలుజరుగుతున్నాయి.
బలరాముడు తాను తటస్థంగా వుండిపోవాలని నిశ్చయించుకుని, తీర్థయాత్రలకు బయలుదేరి, దానిలో భాగంగా నైవిశారణ్యం చేరుకున్నాడు.
ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘమైన సత్సంగంలో ఉన్నారు. బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు. సభకు ఆచార్యపీఠాన్నలంకరించిన వారు ఇలా లేవకూడదు.
కనుక ఆ స్థానంలో వున్న రోమహర్షణుడు (నూతుడు) లేచి నమస్కరించలేదు.
ఇది అవిధేయతగా భావించి దీనిని సహించలేని బలరాముడు సూతుని శిరస్సు ఖండించాడు. మునిగణాలలో అహంకారాలు చెలరేగినాయి.
ఈ ఉద్విగ్నిత కొంత ఉపశమించిన తరువాత
ఈ బ్రహ్మహత్యా పాతకానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు.
అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బలరాముడు ప్రాయశ్చిత్తమేదో వారినే నిశ్చయింపమన్నాడు.
వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు మహా భయంకరుడు. అమావాస్య, పౌర్ణమి రోజులలో
మా సమావేశాలను భంగం చేస్తూ,
రక్త మలమూత్రాలు మాపై కురిపిస్తున్నాడు.
ముందు వాణ్ణి సంహరించి మాకుపకారం చేయి. తరువాత 12 మాసములు బ్రహ్మవర్తంలోని సకల తీర్థాలు సేవిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు.
ఇంతలో పౌర్ణమిరానే వచ్చింది.
పెద్ద తుఫాను చెలరేగి, చీము, రక్తమూ వర్షిస్తూ నల్లని పర్వతాకారంలో అతి భయంకరంగా బల్వలుడు విజృంభించాడు.
బలరాముడు తన ఆయుధాలను స్మరించగనే అతని గద, నాగలి చేతికి వచ్చాయి.
బలరాముడు గదతో వాడి తలవ్రక్కలు చేశాడు. వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు. మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు.
అప్పుడు బలరాముడు వేద ప్రమాణపరంగా మానవుడు తన ప్రతిరూపంగా పుత్రుడై జన్మిస్తాడు గనుక యికనుండి రోమహర్షుని తనయుడు మీకు పురాణ ప్రవచనం చేస్తాడు.
అతనికి దీర్ఘాయువు, బలము ఇంద్రియపటుత్వము ప్రసాదిస్తున్నానని అన్నాడట.
మునులందరూ అంగీకరించి అతణ్ణి వైజయంతి మాలతో సత్కరించి పంపారట.
*విశేషాలు....*
🌳🐒🌳🐒🌳🦜🌳
ఇక్కడ మఠములు, రామానుజ కూటములు ఉన్నాయి.
వనరూపిగా నున్న స్వామికే ఆరాధన. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్లుగాని ఇక్కడ లేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు భావిస్తున్నారు.
స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు ఉన్నాయి.
సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు ఉన్నాయి.
*మార్గం...*
🌳🦚🌳🦚🦜🌳🦜
లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు
35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్.
అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును.
అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి.
🪷🌹🙏🪷🌹🙏🪷
_*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి నమఃశివాయ -పంచాక్షరీ జపం చేద్దాం 🪷🌹🔱🙏*_
राजाधिराज द्वारकाधीश जी के मङ्गला आरती दर्शन
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात.
🪷🌹🪷🌹🪷🌹🪷
*दिनांक :- 13/10/2025, సోమవారం, శ్రీ ద్వారాకాధీసుని సుప్రభాత దర్శనం 🪷🌹🙏🎻*
🪷🌹🪷🌹🪷🌹🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి