ShareChat
click to see wallet page
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #భగవానుడు శ్రీ కృష్ణుడే 'కృష్ణస్తు స్వయం భగవాన్' 🙏 *భగవానుడు కృష్ణుడే* శ్రీకృష్ణ పరమాత్మ పదహారు కళలతో ప్రభవిల్లిన పరిపూర్ణ అవతారము శ్రీకృష్ణావతారము. భగవదవతారములలో శ్రీకృష్ణావతార మునకున్న ప్రత్యేకత, విలక్షణత ప్ర త్యేకమైంది. కర్షయతీతి కృష్ణః సమస్త హృద యములను ఆకర్షించువాడు ఆయనచే ఆక ర్షింపబడని ప్రాణి అంటూ లేదు. జీవాత్మను ఆకర్షించు పరతత్త్వము ఆయన. కలియు గంలో మానవుడు ఎలా మెలగాలో, ఏమి చెయ్యాలో భగవద్గీత మూలమున మార్గద ర్శనం చేసిన జగదుర్గువు శ్రీకృష్ణుడు. గీతోప దేశం ద్వారా మనిషి పుట్టుక నుండి మోక్ష ప్రాప్తివరకు వివరించి మానవులకు ధర్మ మార్గాన్ని మానవ రూపంలో బోధించాడు పర మాత్ముడు శ్రీకృష్ణుడు. 'రసో వైసః' అతడు రస స్వరూపుడు. యశోదా గృహము చేరగానే గోకులమున రస స్వరూపము వికసనమొందినది. గోకులము లోని సమస్త జనులకు, సకల జన చేతనము లకు ఉత్కృష్ట రసయగము సిద్ధించినది. అది ఒక అద్భుత లీల. యోగమాయవలన కంసుడు సహితము రసపూర్ణుడైనాడు. సంయోగ వియోగములలో 'యోగ'మున్నది. పరమాత్ముని చేరుటకై జీవుని వేదన ఒక యోగము. గోప స్త్రీల విరహవేదన ఒక యోగము, అర్జునుని విషాదము ఒక యోగ ము. ఇట్టి యోగములన్నియు మహా యోగేశ్వరేశ్వరు డగు శ్రీకృష్ణ పరమాత్మ తనలో పర్యవసింపచే సుకొనినాడు. స్వామి నారాయణ, గౌడీయ, వల్లభాచర్య, నింబార్క మొదలగు సంప్రదా యాలవారు 'కృష్ణస్తు స్వయం భగవాన్' అనే సంభావన చేస్తారు. ఒడిషాలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్ జీగా ఆరాధిస్తారు. మణిపూర్ ప్రాంతంలో రాధాసమేతుడైన కృష్ణున్నే ఆరాధిస్తారు. చైత న్య మహాప్రభు, ఏకనాథ్, నామేవ్, తుకా రామ్, సూరదాస్, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, పురందరదాస్, జయదేవుడు, అన్న మయ్య, సదాశివబ్రహ్మేంద్రులు వంటి భక్తశిఖా మణులు కలియుగంలో భగవన్నామ సంకీర్త నమే సర్వపాపహరము, ముక్తిప్రదము అని భావించి శ్రీకృష్ణలీలా సంకీర్తనంతో, గోవింద గుణగానంతో తరించి ధన్యులయ్యారు. మనమూ ఆ కృష్ణనామాన్ని పలికి పులకించి పోదాంరండి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 - ShareChat

More like this