#ఆషాడ తొలి ఏకాదశి వేళా పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి శోబాయాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు ! #అలా పండరిపురంలో "వార్కరీ ఉత్సవం" జయ జయ పాండురంగ విఠలా! #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #తొలి ఏకాదశి / శయనైకాదశి / పేలాల పండుగ 🕉️ దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం🙏
*పండరీపురం పాండురంగ ఉత్సవం*
_పండరీపురం పాండురంగ ఉత్సవం_
*ఓం నమో పాండురంగాయ*
*ఓం నమో పుండరీక వర్మయా*
*ఓం నమో నారాయణాయ*
*ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ*
శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది.
మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు.
శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు.
శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు.
పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు.
అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం.
మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు.
ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*

