ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సీనియర్ సిటిజెన్లకు ఉచిత చికిత్స అందించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు.
వయసు మీద పడుతున్న కొద్ది వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. 70 ఏళ్లు దాటాయంటే శరీరం బలహీనమవుతుంది. తరచూ ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి 70 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులు ఉన్న కొడుకులు, కూతుళ్లు వారిని ఆస్పత్రులు ఖర్చుల కోసం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజెన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి. దీనిలో మీరు రూపాయి ఖర్చు లేకుండా వారికి చికిత్స చేయించవచ్చు.
తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ఉచిత చికిత్స అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్డును జారీ చేస్తారు. ఆయుష్మాన్ వయా వందన కార్డు అని పిలుస్తారు. దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వారికి ఐదు లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందిస్తారు.
ఆయుష్మాన్ వయా వందనా కార్డును పొందడానికి ముందుగా మీరు ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. లేదా ఆయుష్మాన్ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలి. లేదా మీ సమీపంలోని గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా వెళ్లవచ్చు. ఆ కార్డును తీసుకున్నాక యాక్టివేట్ చేయడానికి eKYC అందించాలి.
ఆయుష్మాన్ వయా వందనా కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లు, అందులోనూ 70 ఏళ్లు పైబడిన వారికి ప్రతి ఏడాది ఐదు లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా వస్తుంది. మీకు ప్రైవేట్ బీమా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ బీమాను వాడుకోవచ్చు. ఈ కార్డు ప్రకారం రెండువేల రకాల అనారోగ్యాలకు చికిత్స అందిస్తారు.
చాలా ప్రైవేట్ బీమా కంపెనీలు సీనియర్ సిటిజెన్లకు ఆరోగ్య బీమాని ఇచ్చేందుకు సుముఖంగా ఉండవు. ఒకవేళ ఇచ్చినా కూడా అధికంగా డబ్బును వసూలు చేస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆరోగ్య బీమాను ప్రారంభించింది మీ ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఉంటే మీరు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు.
#తెలుసుకుందాం #Technical Useful information #😴మనకు తెలియని నిజాలు #📚ప్రభుత్వ పథకాలు

