నంది పరమశివుని వాహనమే కాక ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన అనుచరుడు. నంది శివునిపై అపారమైన భక్తి, విశ్వాసం అంకితభావానికి చిహ్నం. అందుకే అన్ని శివాలయాలలో గర్భగుడికి ఎదురుగా కూర్చున్న భంగిమలో నంది విగ్రహం ఉంటుంది. న్యాయం, విశ్వాసం, గౌరవం, వివేకం మరియు ధైర్యానికి మారుపేరుగా, ఎల్లప్పుడూ పరమేశ్వరునిపై దృష్టి సారించాలి అనే సందేశాన్ని మనకు తెలియజేస్తుంది.
కైలాసంలో శివునికి ద్వారపాలకునిగా మరియు శివుని గణాలలో ముఖ్యునిగా ఉంటూ, భక్తులు తమ కోరికలను లేదా మొక్కులను నంది చెవిలో నెమ్మదిగా చెప్పడం ద్వారా వాటిని శివునికి చేరవేస్తాడని నమ్మకం.
ఎల్లప్పుడూ ధ్యాన రూపంలో కూర్చొని ఉంటాడు, శివుని కోసం శాశ్వత నిరీక్షణను సూచిస్తాడు.
#తెలుసుకుందాం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #om Arunachala siva🙏

