ఇది కాంగ్రెస్ “ప్రజాపాలన” కాదు
లంచాల కోసం “ప్రజలను పీడించే పాలన”!
ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులే.. గ్రూప్-1 పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవడం.. ఇసుక, కంకర, బూడిద, సివిల్ సప్లై సరఫరాతో పాటు ఆర్టీసీ టికెట్లల్లో సైతం భారీ ఎత్తున బహిరంగంగా కమీషన్లు, లంచాలు తీసుకుంటుంటే.. వారిని చూసి “మాకేం తక్కువ” అన్నట్లుగా, మునుపెన్నడూ లేని విధంగా లంచాల కోసం ప్రజలను పీడించేందుకు కోరలు చాస్తున్న ప్రభుత్వ అధికారులు.
“హైడ్రా” నుండి “దేవాదాయ” శాఖ వరకు...
“ఆబ్కారీ” నుండి “క్రీడా” శాఖ వరకు…
మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న “మున్సిపల్, హోం” శాఖల్లో అడ్డుఅదుపు లేకుండా, భయమనేదే లేకుండా ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల వరకు సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పనుల కోసం వెళ్లినా కాసులే పరమావధిగా మారి, ప్రభుత్వ పెద్దల అండతో లంచాల వసూళ్లకు దిగుతున్నారు.!
కేవలం గత 3 నెలల్లోనే 84 మంది లంచగొండి అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారంటేనే.. అవినీతి ఏ స్థాయిలో పేట్రేగిపోతుందో.. ప్రభుత్వ కార్యాలయాలు లంచాలకు అడ్డాగా ఎలా మారిందో స్పష్టంగా కనిపిస్తున్నది!! #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #CongressFailedTelangana #BRSParty
