తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం :
దసరా రోజుల్లో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవం అంటే అతిపెద్ద ఉత్సవం అని అర్థం ఉంది. పూర్వం బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవాలని ఆగమ పండితులు చెబుతుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీనివాసుని ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి ఇరుదేవేరులతో కలిసి, మాడవీధులలో ఊరేగుతాడు. ధ్వజారోహణం జరిగినప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలుంటాయి. శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టుడు గరుత్మంతుడు కనుక, గరుడ వాహన సేవను (సెప్టెంబర్ 28) చూసేందుకు ఎక్కువమంది భక్తులు తరలి వస్తారు. అక్టోబర్ 1వ తేదీన మహారథోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమినాడు చక్రస్నానంతో తిరుమల బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయి. తిరుమలలోనే కాకుండా చిన్నతిరుపతి వంటి వేంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో దసరా రోజుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘనమైన చారిత్రక నేపధ్యం కలిగిన ఆనందనిలయ వాసుని బ్రహ్మోత్సవాలను కళ్లారా చూడడానికి ఒక్కసారైనా తిరుమల కొండకు వెళ్లాలి.
వేదాలే శిలలైన కొండలపై వెలిసిన వేంకటనాథుని బ్రహ్మోత్సవ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. తిరుమల మందిర సుందరుని ఆనందనిలయమంటే నిజంగా ఆనందనిలయమే అనిపిస్తుంది. అణువణువునా భక్తిరసోత్సవం తొణికిసలాడుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. నిత్యకల్యాణ చక్రవర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో వైభోగాలతో నిరంతరం మునిగి తేలుతుంటాడు. మానవులక మోక్షాన్ని, ఇతర కామితాలను ఏకకాలంలో అందిస్తుంటాడు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు జరిపించుకుంటూ ఉంటాడు. బ్రహ్మోత్సవాలు భక్తకోటిని ఆనంద పారవశ్యంలో ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. వేడుకంతా మాడవీధుల్లోనే .... తిరుమల క్షేత్రంలో ఆలయం చుట్టూ ఉన్న వీధులకు మాడవీధులు అని పేరు.
___________________________________________
HARI BABU.G
__________________________________________
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #🙏శ్రీవారి బ్రహ్మోత్సవాలు🙏

