ShareChat
click to see wallet page
దేశానికీ వెన్నెముక,గుండెకాయ,పట్టుకొమ్మ వంటి గ్రామాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి మనవంతుగా ప్రయత్నం చేద్దాం ! లేదా గ్రామాలలోని సంస్క్రతి, సంప్రదాయాలకు విలువనిద్దాం,వాటి అభివృద్ధిలో పాలు పంచుకోవడం మన కనీస ధర్మంగా భావిద్దాం ! అహింసావాది, మన జాతిపిత మహాత్మాగాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపితం కావాలంటే మళ్ళీ గ్రామాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా మన వంతుగా ప్రయత్నాలు ప్రారంభిద్దాం.దేశానికీ వెన్నెముక, గుండెకాయ,పట్టుకొమ్మ వంటి గ్రామాలలోని సంస్క్రతి,సంప్రదాయాలకు విలువనిద్దాం, వాటి అభివృద్ధి లో పాలు పంచుకుందాం.పూర్వం మన గ్రామాలు చక్కటి పాడిపంటలతో,పచ్చనైన పైరులతో,నిత్య కళ్యాణం,పచ్చ తోరణంలా కలకల లాడుతూ ఉండేవి,అలరారుతుండేవి.కానీ ప్రస్తుతం గ్రామాలలోని అధిక శాతం జనాభా పట్టణాల వైపు తరలివెళ్లడంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక అవి తన ఆనవాలను సైతం కోల్పోయే దయనీయ పరిస్థితికి నెట్టివేయబడుతున్నాయి అనే మాట సత్యదూరం కాదు.కొంతమంది గ్రామాల నుంచి తరలివెళ్లి విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయులు, వ్యాపారరీత్యా గ్రామాలను వదిలి నగరాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నవారు తమ స్వంత గ్రామాలపై వున్న మమకారంతో,వాసల్యంతో తాము నివసించిన గ్రామాల అభివృద్ధి పట్ల కాస్తంత శ్రద్ధాసక్తులు చూపిస్తున్నప్పటికీ అవి కొంత మేర మాత్రమే గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.అయితే మనదేశంలో నేటికీ యాభై (50 % ) శాతానికి పైగా గ్రామాలు కనీస సౌకర్యాలు అయిన మంచినీరు,పాఠశాలలు,రోడ్డురవాణా సదుపాయాలు,ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేక ఇప్పటికి అనేక గ్రామాల ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే మాట సత్య దూరం కాదు. ఏదిఏమైనా ఇప్పటికైనా మన కేంద్ర,రాష్ట్ర సర్కార్ గ్రామాల అభివృద్ధి విషయంలో మరింత శ్రద్ధాసక్తులు కనబరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.లేకపోతే ప్రశాంత వాతావరణానికి,ప్రకృతి సోయగాలకు,పిల్లగాలులకి,స్వచ్ఛమైన గాలి, వెలుతురుకు,సంస్క్రతిక వైభవానికి,సంప్రదాయాలకు పెట్టింది పేరైన,గతమెంతో ఘనకీర్తి గల మన గ్రామాలు తమ గొప్పతనాన్ని,ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచివుంది.ఏమైనా మన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైఎస్. రాజశేఖరరెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తన హయం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టినప్పటికి మరింతగా అయా గ్రామాలలో సౌకర్యాల లేమి అనే మాట తలేత్తకుండా అక్కడి ప్రజానీకం అంతా పురోభివృద్ధి బాటలో అత్యంత వేగవంతంగా మున్ముందుకు దూసుకుపోయేలా,సాంకేతిక ప్రగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధాశక్తులు చూపాల్సిన గురుతర బాధ్యత నేటి మన కూటమి ప్రభుత్వం వారి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఈ సందర్బంగా మన జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా మనమంతా చెయ్యి చెయ్యి కలిపి మన ఆశయాన్ని సాధించేదిశగా మొక్కవొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం!అప్పుడే మన పల్లె సీమలు పూర్వ వైభవాన్ని సంతరించుకొనేందుకు అవకాశం ఏర్పడుతుంది,లేకపొతే మన గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉండిపోయి అవి వెలవెల బోవడం తథ్యం!జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #గ్రామాలు
గ్రామాలు - పల్లలే కదా దేశానికి పట్టుకొ: Momspresso మన పల్లెలే దేశానికి పట్టుకొ magazine telangana govin uಮೌಲು ದಕನಿತನಿರ್ಯ೯ನಲು ட TBllil SIUllcur దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అంగీకరిస్తే షేర్ చేయండి Telugu Lokal App Lokall TeluguSTOPcom 0%5. {೦ಲ Facebook దేశానికి [ualua] ನlfn 6.151 P] పల్లెటూర్లు దేశానికి పట్టుకొ Facebook దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ పల్లలే కదా దేశానికి పట్టుకొ: Momspresso మన పల్లెలే దేశానికి పట్టుకొ magazine telangana govin uಮೌಲು ದಕನಿತನಿರ್ಯ೯ನಲು ட TBllil SIUllcur దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అంగీకరిస్తే షేర్ చేయండి Telugu Lokal App Lokall TeluguSTOPcom 0%5. {೦ಲ Facebook దేశానికి [ualua] ನlfn 6.151 P] పల్లెటూర్లు దేశానికి పట్టుకొ Facebook దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ - ShareChat

More like this